breaking news
Case rigistered
-
లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊహించని షాక్
బీహార్ మాజీ సీఎం, ఆర్జేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు మరోసారి ఊహించని షాక్ తగిలింది. లాలూ ప్రసాద్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నసమయంలో(2004-2009) మధ్య జరిగిన రైల్వే శాఖకు చెందిన పోస్టుల నియామకాల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ తాజాగా అభియోగాలు మోపింది. దీంతో, రంగంలోకి దిగిన సీబీఐ శుక్రవారం.. ఒకేసారి లాలూ ప్రసాద్ ఇంటితో పాటుగా రాష్ట్రీయ జనతాదళ్‌కు సంబంధించిన 15 ప్రదేశాలలో సోదాలు నిర్వహిస్తోంది. ఇక, ఈ కేసులో లాలూ కుటుంబ సభ్యులకు కూడా పాత్ర ఉందని సీబీఐ ఆరోపిస్తూ.. వారిని నిందితులుగా పేర్కొంది. ఇక, ఈ పోస్టులకు సంబంధించిన కేసులో రైల్వే ఉద్యోగాలు ఇప్పించేందుకు లాలూ, అతని కుటుంబ సభ్యులు డబ్బుకు బదులుగా భూమి, ఆస్తులను లంచంగా అందుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. రూ. 139 కోట్లు డోరాండా ట్రెజరీ కుంభకోణం కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటీవలే లాలూకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్షతోపాటుగా 60 లక్షల జరిమానా కూడా విధించింది. రైల్వే జాబ్స్ నియామకాల కేసుపై ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లకు పెరుగుతున్న పాపులారీ కారణంగానే ప్రభుత్వం కక్షగట్టి వారిపై ఇలా కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
జిన్నారం(పటాన్చెరు) : గుమ్మడిదల మండలంలోని బొంతపల్లికి చెందిన కీర్తన(24)అనే మహిళ బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. కీర్తన ఉదయం మంచం మీద నుంచి కిందపడడంతో మృతి చెందిందని భర్త తెలిపాడు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని కీర్తన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి రాజద్రోహం ఆరోపణలతో సైబారాబాద్ పరిధిలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ, కేసీ త్యాగి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, వామపక్ష నేతలు డీ రాజా, సీతారం ఏచూరిపై కూడా కేసు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు 124(ఏ) 156 (3) కింద ఆరోపణలు నమోదు చేశారు.