breaking news
Cape Verdean
-
పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్రమాదం
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి కేప్ వెర్డే దీవుల్లో పడవ బోల్తా పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 60 మందికి పైగా మరణించారని,38 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) అధికారులు తెలిపారు. దీనిని అల్ జజీరా వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కిలోమీటర్ల (385 మైళ్లు) దూరంలోని ద్వీప దేశమైన కేప్ వెర్డే నుంచి ఒక ఫిషింగ్ బోట్ నెల రోజుల క్రితం సెనెగల్ నుండి బయలుదేరింది. మీడియా తెలిపిన వివరాల ప్రకారం గినియా-బిస్సౌకు చెందిన ఒక పౌరునితో సహా 38 మందిని అర్థరాత్రి వేళ పడవ ప్రమాదం నుండి రక్షించినట్లు సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాల్ ద్వీపానికి 320 కిలోమీటర్ల (200 మైళ్లు) దూరంలో స్పెయిన్ ఫిషింగ్ బోట్ ఈ ఓడను గుర్తించింది. స్పానిష్ మైగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ ఈ ఓడను భారీ ఫిషింగ్ బోట్గా పేర్కొంది. ఈ పడవను పిరోగ్ అంటారు. ఇది 100 మంది శరణార్థులు, వలసదారులతో జూలై 10న సెనెగల్ నుండి బయలుదేరింది. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేప్ వెర్డేలో నెలకొన్న పేదరికం, యుద్ధ వాతావరణం కారణంగా వేలాదిమంది ఇక్కడి నుంచి బయటపడేందుకు ఇటువంటి ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ, తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఏమాత్రం రక్షణలేని పడవలు లేదా స్మగ్లర్లు అందించే మోటరైజ్డ్ పడవలలో వీరంతా ప్రయాణిస్తుంటారని అల్ జజీరా తెలిపింది. ఇది కూడా చదవండి: ఒకసారి మంత్రి కుమారుడు, మరోసారి మనుమడు.. మధ్యలో తారలకు లేఖలు.. బ్లఫ్ మాస్టర్ స్టోరీ! -
అవి లేక వాయిదా పడ్డ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏమ్యాచ్లైనా ఎందుకు రద్దు చేస్తారు. వాతావరణం బాగాలేకో, పిచ్ అననుకూల పరిస్థితుల్లో రద్దవటమో, వాయిదా పడటమో జరుగుతుంది. అంతులోను ఫుట్బాల్ మ్యాచ్లు రద్దు చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఆఫ్రికాలోని కేప్ వెర్డేన్లో జరగాల్సిన ఓ పుట్బాల్ బ్యాచ్ ఆశ్చర్యకరంగా రద్దైంది. స్టేడియం అధికారులు చేసిన నిర్లక్ష్యానికి మ్యాచ్ను వాయిదా వేశారు. స్టేడియం అధికారులు స్టేడియం గేటు తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. దీంతో మ్యాచ్ను వాయిదా వేయాల్సి వచ్చింది వివరాల్లోకి వెళ్తే కేప్ వెర్డేన్లో ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆల్ట్రామెరీనా, మిండ్లెన్స్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ జరగాల్సిఉంది. కానీ స్టేడియం అధికారులు స్టేడియం గేటు తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోయారు. దీంతో మ్యాచ్ వాయిదా పడింది. అంతేకాదు ఆదేశ ఫుట్బాల్ అసోషియేషన్ రెండో సెమీస్ మ్యాచ్ను ఆడాలని జట్లను ఆదేశించింది. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండా రెండో మ్యాచ్ నిర్వహించడం కొత్తగనే ఉంది కదా!. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అట్లాంటిక్ మహా సముద్రంలోని పది చిన్న చిన్న ద్వీపాల సముదాయమే ఈ కేప్వెర్డేన్ దేశం.