breaking news
cannabis plants
-
ఇంటి మిద్దెపై గంజాయి పెంపకం
టీ.నగర్ : చెన్నైలో ఇంటి మిద్దెపై గంజాయి పెంచుతున్న ఇంజినీరును మంగళవారం పోలీసులు అరెస్టుచేశారు. చెన్నై కేకేనగర్ ఒకటవ సెక్టార్ ఏడవ వీధికి చెందిన చార్లెస్ ప్రదీప్ మెకానికల్ ఇంజినీరుగా ఉన్నారు. ఈయన తన ఇంటి మిద్దెపై తోటను ఏర్పాటుచేసి కొన్ని మూలిక మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలతోపాటు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు కేకేనగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ తంగరాజ్, ఇతర పోలీసులు మంగళవారం అక్కడికి వెళ్లి తనిఖీలు జరిపారు. ఆ సమయంలో మూలికా మొక్కలతోపాటు నాలుగన్నర అడుగుల ఎత్తుగల ఏడు గంజాయి చెట్లను పెంచుతున్నట్లు తెలిసింది. దీంతో చార్లెస్ ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలను, అక్కడున్న కిలో 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనిగురించి చార్లెస్ ప్రదీప్ పోలీసులతో మాట్లాడుతూ తాను గంజాయి ఉపయోగిస్తూ దానికి బానిసయ్యానని, దీంతో ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచి వాడేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఇరుగు పొరుగు వారికి ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పరిశోధనల కోసం మూలికా మొక్కలను పెంచుతున్నట్లు తెలిపానని, ఈ మొక్కల మధ్య గంజాయి మొక్కలను పెంచినట్లు పేర్కొన్నారు. గంజాయిని ఆమ్లెట్, భోజనంతో కలిసి ఆరగిస్తానన్నారు. చార్లెస్ ప్రదీప్‌కు గంజాయి మొక్కలు ఎలా లభించాయి? అతనికి గంజాయి ముఠాతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
దొంగే దొంగా దొంగా అని పోలీసులకు ఫోన్ చేస్తే..
సిడ్నీ: దొంగే దొంగా దొంగా అన్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. తమ స్థలంలో పెంచుకుంటున్న గంజాయిని తన తండ్రి తగులబెట్టేశాడని ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి ఓ కుమారుడు చెప్పాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు సమీపంలోగల హంప్టీ డూ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ టెర్రిటరీ పోలీసులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి తన తండ్రితో తాను గొడవ పడ్డానని, అయితే, ఆ క్రమంలో తండ్రి తమ స్థలంలోని గంజాయి మొక్కలు తగులబెట్టాడని చెప్పాడు. అయితే, తాము ఇన్నాళ్లపాటు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగానే ఆ మొక్కలను కాల్చడంతో అది తప్పనుకొని భ్రమపడిన ఆ కుమారుడు పోలీసులకు ఫోన్ చేసి ఈ చర్య గురించి చెప్పాడు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి చూడగా అక్కడ గంజాయి మొక్కలు ఉన్నమాట వాస్తవమే అని తేలింది. ఈ ఘటనకు సంబంధించి తండ్రి, కొడుకులు ఇద్దరు దోషులే అని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే, ఇంకా కేసు నమోదు చేయలేదు.