breaking news
cancellation of debts
-
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే...
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే మాఫీ చేస్తారట మావా! -
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 10,306.. బకాయిల రద్దు 10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆర్బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్ఫ్రా ఇంజినీరింగ్ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. 46% తగ్గిన ఎయిడ్స్ 2021 నివేదిక ప్రకారం దేశంలో సుమారు 24.01 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు కేంద్రం రాజ్యసభకు తెలిపింది. వీరిలో 45% మంది అంటే 10.83 లక్షల మంది మహిళలు కాగా 2% మంది 12 ఏళ్లలోపు చిన్నారులు సుమారు 51 వేల మంది ఉన్నట్లు పేర్కొంది. అయితే, అత్యధికంగా మహారాష్ట్రలో 3.94 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 3.21 లక్షల కేసులుండగా తెలంగాణలో 1.56 లక్షల కేసులు నమోదైనట్లు వివరించింది. మొత్తమ్మీద చూస్తే 2010 నుంచి ఎయిడ్స్ కేసుల్లో తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా 32%, దేశంలో 46% నమోదైందని తెలిపింది. -
ఆర్టీసికి పండగ!
హైదరాబాద్: ఆర్టీసికి శుభవార్త. ప్రభుత్వానికి ఆర్టీసీ చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేశారు. ఆర్టీసి చెల్లించవలసిన బకాయిలను గ్రాంట్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఆర్టీసీ బకాయి పడ్డ వాహన పన్ను 1116 కోట్ల రూపాయలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలను కూడా రద్దు చేశారు. ఈ రకమైన రుణాలు, బకాయిలను రెండు రాష్ట్రాలకు బదలాయించడం ఇబ్బందికరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.