breaking news
canceling notes
-
ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జహీరాబాద్: అందరిని సమానంగా చూడా ల్సిన గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల జపం చేయడం సరికాదని కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ను, ఆయన కుమారుడు కేటీఆర్‌ను మెచ్చుకోవడం తగదన్నారు. గతంలో ఏ గవర్నర్ కూడా ఇలా ప్రత్యేకంగా మెచ్చుకున్న దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తుండగా.. గవర్నర్ కేసీఆర్ జపం చేస్తున్నారని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దుతో 90 శాతం మంది ప్రజలు నానా అవస్థలు పడుతున్నా.. సీఎం మాత్రం ప్రధానిని మెచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ ప్రసంగం నిరాశ పర్చిం దని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారని, కేసీఆర్ మాత్రం స్పందించక పోవడం దారుణమన్నారు. తుగ్లక్ పాలనను తలపిం చే విధంగా రాష్ట్ర సర్కార్ కొనసాగుతోందని విమర్శించారు. -
రాజ్యాంగ బెంచ్‌కు నోట్ల రద్దు
► 9 అంశాలపై విస్తృత ధర్మాసనం విచారణ జరపుతుందన్న సుప్రీం ► పాత నోట్ల వినియోగాన్ని పొడిగించాలన్న పిటిషన్ల తిరస్కరణ న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల రద్దు చేసిన రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే టికెట్లు, వినియోగ బిల్లుల చెల్లింపులకు అనుమతించాలన్న విజ్ఞప్తులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ వినతులతో దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది. అలాగే పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధతను తేల్చే బాధ్యతను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఈ బెంచ్ మొత్తం 9 అంశాలపై విచారణ జరుపుతుందని తెలి పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదులకు ఉన్న ప్రజా ప్రాముఖ్యత దృష్ట్యా ఈ అంశాన్ని విస్తృత బెంచ్‌కు అప్పగించడం సముచితమని భావిస్తున్నట్టు పేర్కొంది. ‘రద్దు చేసిన నోట్ల వినియోగాన్ని పొడిగింపుపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రమే సరైనది’ అని పేర్కొంది. ‘24 వేల విత్‌డ్రా’ను నెరవేర్చండి బ్యాంకుల్లో వారానికి విత్‌డ్రా పరిమితిని రూ. 24 వేలుగా నిర్ణయించినా.. బ్యాంకులు ఆ మొత్తాన్ని అందజేయడం లేదని, ఆ మొత్తాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని వచ్చిన పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ప్రభుత్వం కోరిన 50 రోజుల గడువు ఇంకా ముగియలేదని, ఆ సమయానికల్లా నగదు చలామణి పెరుగుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చెప్పిన మాటలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటి వరకూ 40 శాతం పాతనోట్లను కొత్త రూ.2,000, రూ.500 నోట్లతో భర్తీ చేసినట్టుగా కేంద్రం చెప్పింది. వారానికి రూ. 24 వేల విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం ఆ హామీని నెరవేర్చాలని సూచించింది. హైకోర్టుల్లో నోట్ల రద్దు విచారణపై స్టే నోట్ల రద్దును సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణపై సుప్రీం స్టే విధించింది. వీటన్నింటిని తామే విచారిస్తామంది. ఇకపై దీనికి సంబంధించిన రిట్ పిటిషన్లను ఇతర కోర్టు స్వీకరించరాదని పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు అవసరమనుకుంటే తమను ఆశ్రయించవచ్చంది. అలాగే నవంబర్ 11 నుంచి 14 వరకూ దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లు స్వీకరించిన రూ.8,000 కోట్లను కొత్త కరెన్సీతో నిబంధనల మేరకు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న అటార్నీ జనరల్ హామీకి సుప్రీంకోర్టు అంగీకరించింది.