breaking news
calls off strike
-
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
విద్యుత్ ఉద్యోగుల సమ్మెయోచన విరమణ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో మంత్రి జగదీష్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను విద్యుత్ ఉద్యోగులు విరమించుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మికులకు పరిహారాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గురైతే వారి వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. చర్చలు ఫలించడంతో ఉద్యోగులు సమ్మె ప్రతిపాదనను విరమించుకున్నారు.