breaking news
Cabbage cultivation
-
క్యాబేజీ సాగు.. లాభాలు బాగు
లాభసాటి పంట.. బంక, ఒండ్రు నేలలు అనుకూలం సాగుకు ఇదే సరైన సమయం సస్యరక్షణతో అధిక దిగుబడులు ఉద్యాన అధికారి సలహా సూచనలు మిరుదొడ్డి:కొద్దిపాటి నీటి వసతితోనే క్యాబేజి సాగును లాభసాటిగా మలుచుకోవచ్చు. సాగుకు చల్లని తేమగల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సాగుకు తరుణమిదే కావడంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపుతున్నారు. క్యాబేజీని కూరల్లో విరివిగా వాడుకోవడమే కాకుండా పత్యేకంగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. దీంతో మార్కెట్లో క్యాబేజీకి మంచి డిమాండ్ ఉంది. సస్యరక్షణ చర్యలు చేపట్టి జాగ్రత్తలు పాటిస్తే క్యాబేజి సాగులో మంచి దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన అధికారి భాస్కర్‌రెడ్డి (సెల్: 8374449346) తెలిపారు. ఈ పంట సాగుపై ఆయన అందించిన సలహా సూచనలివీ.. వాతావరణం: క్యాబేజి సాగుకు చల్లని వాతావరణం ఉండాలి నేలలు: ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం విత్తన మోతాదు: ఎకరానికి 100 నుండి 150 గ్రాముల విత్తనాలు సరిపోతాయి విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ను కలిపి శుద్ధి చేసుకోవాలి. క్యాబేజిలో రకాలు: హైబ్రీడ్, గోల్డెన్ ఎకర్, లేట్ డ్రమ్‌హెడ్, పూస డ్రమ్‌హెడ్, పూనముక్త, గణేష్ గోల్ లేదా హరిరాణి గోల్, ప్రై డ్ఆఫ్ ఇండియా, ఎర్లీ డ్రమ్‌హెడ్ అనే రకాలు ఉన్నాయి. నాటుకునే సమయం: స్వల్పకాలిక రకాలకు ఆగస్టు నుండి, సెప్టెంబర్ చివరి వారం వరకు, దీర్ఘకాలపు రకాలకు అక్టోబర్ నుండి నవంబర్ చివరి వారం వరకు నాటుకోవచ్చు. నారుమడి తయారీ విధానం నేలలో తగినంత పశువుల ఎరువును వేసుకుని నాలుగు నుండి ఐదు సార్లు కలియ దున్నాలి. 10–15 సెంటీమీటర్ల ఎత్తు, 4 మీటర్ల పొడవు మరియు 1 మీటరు వెడల్పుతో నారుమళ్లను సిద్ధం చేసుకోవాలి. క్యాబేజీ విత్తనాలను సన్నని ఇసుకతో గానీ, కంపోస్టు ఎరువుతో గానీ కలిపి నారుమళ్లలో పలుచగా వేసుకోవాలి. అనంతరం ప్రతి మడిని ఎండు ఆకులతో కప్పివేయాలి. విత్తనాలు మొలకెత్తే వరకు నీటిని అందించాలి. మొలకెత్తిన తర్వాత ఎండిన ఆకులను తొలగించాలి. నారుకుళ్లు తెగులు సోకకుండా లీటర్ నీటికి 3 గ్రాముల కాఫర్ ఆక్సీక్లోరైడ్‌తో నేలను తడపాలి. నారుమడిని ఆకుతినే పురుగు నుండి రక్షించుకోవడానికి 2.5 మి.లీ. మాలథీయాన్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటుకునే విధానం బాగా దున్నుకున్న నేలను 10–15 రోజుల ముందే సిద్ధం చేయాలి. దీర్ఘకాలిక రకాలకు 60 సెం.మీ. పొడవు, 40 సెం.మీ. వెడల్పు, స్వల్పకాలిక రకాలకు 45 సెం.మీ. 45 సెం.మీ. దూరం ఉండేట్లు చూడాలి. 25–30 రోజుల వయసున్న నారును నాటుకోవాలి. నాటే ముందు నీటి తడిని ఇవ్వడం తప్పనిసరి. నీటి యాజమాన్యం తేలిక నేలల్లో వారానికి ఒకసారి, బరువు నేలల్లో ఆయితే పది రోజులకు ఒకసారి నీటి తడిని అందించాలి. ఎరువులు మొదటి దశలో ఎకరానికి 8–10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 32–40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్‌ను దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. 24–32 కిలోల నత్రజనిని మూడు దఫాలుగా నాటిన 25–30 రోజులకు ఒకసారి, 50–60 రోజులకు రెండవ సారి, దీర్ఘకాలిక రకాలకు 75–80 రోజులకు మూడవ సారి వేయాలి. ఎరువులు వేసిన ప్రతిసారి నీటి తడిని అందించాలి. కలుపు నివారణ పెండిమిథాలిన్ 30 శాతం ఎకరానికి 1.25 లీ. లేదా 1.0 లీ. లేదా 1.2 లీ. చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 24–48 గంటల లోపు పిచికారి చేయాలి. అనంతరం 20–25 రోజుల్లో అంతర కషి చేయాలి. సస్యరక్షణ రెక్కల పురుగు: ఆకుల అడుగు భాగాన ఉండి ఆకులను తింటూ నాశనం చేస్తుంది. పురుగులు ఆశించిన ఆకులు పూర్తిగా వాడి ఎండిపోతాయి. ఈ పరుగుల ఉధతి ఎక్కువైతే ఆకులన్నీ రంధ్రాలు ఏర్పడతాయి. దీంతో క్యాబేజీ పరిమాణం పూర్తిగా తగ్గిపోతుంది. వీటి నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు రెండు వరుసల్లో ఆవ మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి. ఈ పురుగుల గుడ్లను నాశనం చేయడానికి వేపగింజల ద్రావణాన్ని సుమారు 5 శాతం వరకు పిచికారి చేసుకోవాలి. పురుగుల ఉదతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటికి ఎండోసల్ఫాన్ 2 మి. లీ. లేదా 0.3 మి. లీ. కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. నాటిన తర్వాత 30–45 రోజుల్లో బీటీ మందులు 1 గ్రా. ఒక లీటర్ నీటిని కలిపి పిచికారి చేయాలి. పేను బంక: ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చి తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు మాలథీయాన్ లేదా డైమిథోయేట్ లేదా డెమటాన్, 2 మి. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. నారుకుళ్లు లె గులు: నారు మొక్కల కాండపు మొదళ్లు కుళ్లిపోయి చనిపోతాయి. దీని నివారణకు ఎతై ్తన మడులపై నారును పెంచాలి. వరుసల్లో విత్తనాలను పలుచగా చల్లుకోవాలి. సాధ్యమైనంత వరకు ఎక్కువ నీటి తడులను ఇవ్వరాదు. నారు మొలిచిన తర్వాత కాఫర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటర్ నీటిలో కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. నల్లకుళ్లు తెగులు: ఏ దశలోనైనా ఈ తెగులు ఆశిస్తుంది. ఆకుల్లో ‘వీ’ ఆకారం కలిగిన మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నలుపు రంగులోకి మారతాయి. దీని నివారణకు స్ట్రెప్టోసైక్లిన్ అనే మందుతో (1 గ్రా./10 లీటర్ల నీటికి) విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇదే మందును (50 మి.గ్రా. ఒక లీటర్ నీటికి) నారు నాటిన సమయంలో, గడ్డ ఎదుగుతున్న దశలో పైరుపై పిచికారి చేయాలి. కాఫర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా. ఒక లీటర్ నీటికి) మందు ద్రావణంతో మొక్కల మొదళ్ల చుట్టూ తడపాలి. ఎకరానికి 5 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో వేసుకోవాలి. రెండు సంవత్సరాల పాటు ఏదైనా నూనె గింజల పంటతో మార్పిడి చేసుకోవాలి. కోత సమయం: మంచి పరిమాణంలో ఉండి గట్టిగా లేతగా ఉన్న గడ్డలను కోసి మార్కెట్‌కు తరలించాలి. -
వేసెయ్జీ.. క్యాబేజీ
ఖమ్మం వ్యవసాయం: క్యాబేజీ పంట సాగుకు ఇది అనుకూలమైన సమయం. ఈ పంటను జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఇల్లెందు, రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, భద్రాచలం, తిరుమలాయపాలెం, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంట సేద్యమవుతోంది. క్యాబేజీ పంటలో రకాలు, విత్తన మోతాదు, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ తదితర అంశాలను ఖమ్మం ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న వివరించారు. క్యాబేజీ రకాలు: గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రీమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియాతో పాటు ప్రైవేటు కంపెనీలు విడుదల చేసిన రకాలు. విత్తనమోతాదు: ఎకరానికి 100 నుంచి 150 గ్రాముల విత్తనాలు. విత్తన శుద్ధి: కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్‌ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. విత్తే విధానం: మొక్కల మధ్య, వరుసల మధ్య 45 సెం.మీ దూరం ఉండాలి. ఎరువులు, నీటి యాజమాన్యం ఎకరానికి 32 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో, 50 కిలోల వరకు నత్రజనిని ఇచ్చే ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి. (నాటిన 25-30 రోజులు, 50-60 రోజులు, 75-80 రోజులు). బిందు సేద్యం ద్వారా నీరు పారించటం శ్రేయస్కరం. సస్యరక్షణ తల్లి రెక్కల పురుగులు: ఇవి చిన్నవిగా గోధుమ రంగులో ఉంటాయి. డైమండ్ ఆకారంలో ఈ పురుగులు ఉంటాయి. కనుక వీటిని డైమండ్ బాక్ మాత్ అంటారు. ఈ పురుగులు గుడ్లను పెట్టి పొదుగుతాయి. వీటి నుంచి వచ్చే లార్వాలు అడుగు భాగాన చేరి ఆకులను తినేస్తాయి. నివారణ: ప్రతి 25 వరుసల క్యాబేజి పంటకు 2 వరుసల చొప్పున ఆలా మొక్కలు ఎర పంటగా నాటాలి. 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగుల ఉధృతిని బట్టి లీటర్ నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 0.3 మి.లీ స్పెనోశాడ్ మందును పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా నల్లకుళ్లు: దీని వల్ల ఆకులు పత్రహరితం కోల్పోయి ‘వి’ ఆకారంలో మచ్చలు ఏర్పడుతాయి. నివారణ: 10 లీటర్ల నీటికి 30 గ్రాముల బ్లైటాక్స్ , 5 మి.గ్రా, స్పెప్ట్రోసైక్లిన్ మందును పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల బ్లీచింగ్ పౌడర్‌ను భూమిలో పైపాటుగా వేయాలి.