breaking news
Business success
-
ఓవర్‌నైట్ సక్సెస్ కానేకాదు.. ఇది మా పన్నెండేళ్ల కష్టం!
కోటి రూపాయల వేతనం అందుకునే మంచి ఉద్యోగాన్ని కాలదన్నుకోవడం అంటే అలాంటి ఇలాంటి సాహసం కాదు. సొంతంగా వ్యాపారం చేయాలనే ధ్యేయంతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాకుండా సక్సెస్ అయ్యి యువతకు ప్రేరణగా నిలిచింది ఈ 28 ఏళ్ల వివియన్ వాంగ్. మరి అంత డేరింగ్ నిర్ణయం తీసుకుని ఈ వనిత వ్యాపారంలో ఎలా నిలదొక్కుకుందో తెలుసుకుందామా..!తండ్రి అనారోగ్యంతో కీలక నిర్ణయం..చిన్నప్పటి నుంచే తండ్రి బేకరీలో పనులు చేస్తూ పెరిగిన వివియన్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. అయితే తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఇక వ్యాపారాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సోదరుడితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించింది.బియ్యంతో తయారు చేసిన మెత్తటి పిండిలో ఐస్‌క్రీమ్‌ను నింపి మోచి ఐస్‌క్రీమ్ బంతులను తయారు చేశారు. తొలి ఐదేళ్ల పాటు రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు విక్రయించారు. వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టారు.అన్నీ పర్ఫెక్ట్ అయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే..వ్యాపారం ప్రారంభించిన రోజుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు ఎన్నో వ్యక్తిగత సౌకర్యాలను వదులుకుంది. కంపెనీ ఖాతాలను ఆదివారాల్లో స్వయంగా నిర్వహించడంతో పాటు ఐటీ, యంత్రాలు, ఉత్పత్తి అభివృద్ధి, సిబ్బంది నిర్వహణ వంటి ఎన్నో విషయాలను స్వయంగా నేర్చుకుంది వివియన్ వాంగ్.వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ప్రతిదీ పరిపూర్ణంగా సిద్ధమయ్యే వరకు ఎదురుచూడకూడదు. 80 శాతం ఉత్పత్తి సిద్ధమైన వెంటనే మార్కెట్లోకి తీసుకెళ్లి.. వినియోగదారుల స్పందన ఆధారంగా మిగిలిన 20 శాతాన్ని మెరుగుపరచాలి.ప్రతి అవకాశానికీ ‘అవును’ అని చెప్పకూడదు. బ్రాండ్ విలువలు, లక్ష్యాలు స్పష్టంగా ఉంటే ఏ ట్రెండ్‌ను అనుసరించాలో, దేనికి దూరంగా ఉండాలో నిర్ణయించుకోవచ్చు అనే అంశాలు సక్సెస్‌కి ఎంతో కీలకం.నిపుణులు ఇచ్చే సలహాలను కూడా గుడ్డిగా పాటించకూడదు. ఒక వ్యాపారానికి సరిపోయే సలహా.. మరో వ్యాపారానికి సరిపోకపోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.సోదరుడితో కలిసి పనిచేయడం తమకు బలంగా మారినా, ఇద్దరి మధ్య ఎన్నో వాదనలు జరిగేవని, ఒకరు రిస్క్ తీసుకోవాలని భావిస్తే.. మరొకరు జాగ్రత్తగా ఆలోచించేవారని వివియన్ తన అనుభవాన్ని పంచుకుంటోంది. ఈ భిన్నమైన అభిప్రాయాలే చివరకు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడ్డాయని చెబుతుందామె.టిక్‌టాక్‌లో వైరల్.. కానీ 12 ఏళ్ల కష్టం!కరోనా సమయంలో ‘లిటిల్ మూన్స్’ టిక్‌టాక్‌లో వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో చాలామంది అది రాత్రికి రాత్రే సాధించిన విజయమని భావించారు. కానీ వాస్తవానికి ఆ విజయానికి ముందు సంస్థ 12 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడింది. ఉత్పత్తి, సిబ్బంది శిక్షణ, ఎగుమతులు, పెద్ద రిటైలర్లకు సరఫరా వంటి అంశాల్లో ఏళ్ల పాటు అనుభవం సంపాదించింది. ఆ పునాది బలంగా ఉండటమే వైరల్ అయిన సమయంలో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది.‘ఓవర్‌నైట్ సక్సెస్ అనేది 12 ఏళ్ల కష్టానికి కనిపించే ఒక్క క్షణం మాత్రమే’ అనేది వివియన్ చెప్పే ముఖ్యమైన పాఠం. సొంత వ్యాపారం చేయాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూడకుండా చిన్నగా ప్రారంభించి.. చేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచిస్తోంది. -
గుజరాతీలు జాబ్స్ ఎందుకు చేయరంటే..
వ్యాపారం, ఆర్థిక రంగాల్లో గుజరాతీల (Gujaratis) ఆధిపత్యం గురించి తెలిసిందే. అయితే వారు ఆయా రంగాల్లో అంతలా రాణించడానికి కారణాలు ఏంటి.. సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేక లక్షణాలేంటి అన్న దానిపై పై స్టాకిఫీ వ్యవస్థాపకుడు అభిజిత్ చోక్సీ అద్భుతమైన విశ్లేషణ చేశారు. వారి ఆర్థిక ప్రభావాన్ని హైలైట్ చేసే గణాంకాలతో ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.దేశంలోని 191 మంది బిలియనీర్లలో 108 మంది గుజరాతీలేనని రాసుకొచ్చిన చోక్సీ సంపద సృష్టిలో వారికున్న ప్రత్యేకతలను వివరించారు. చివరికి అమెరికాలో నివసిస్తున్న గుజరాతీ.. సగటు అమెరికన్ కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాడని చోక్సీ అభిప్రాయపడ్డారు. భారతదేశ జనాభాలో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ, గుజరాత్ దేశ జీడీపీకి 8% పైగా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 18% భాగస్వామ్యం వహిస్తోంది. భారత భూభాగంలో కేవలం 6% మాత్రమే ఉన్న గుజరాత్ దేశం మొత్తం ఎగుమతుల్లో 25% వాటాను కలిగి ఉంది.గుజరాతీల సక్సెస్‌కు కారణాలివే..మరి గుజరాతీలు వ్యాపారంలో అంత సక్సెస్ కావడానికి కారణం ఏమిటి? చోక్సీ ప్రకారం.. ఇది తరతరాలుగా వస్తున్న జ్ఞానం, వ్యవస్థాపక మనస్తత్వం, కొత్త మార్కెట్లను స్వీకరించడానికి, ఆధిపత్యం చేయడానికి సాటిలేని సామర్థ్యం కలయిక. గుజరాతీలు వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను శాసించడానికి 20 కారణాలను ఆయన వివరించారు.ఉద్యోగాల (Jobs) కంటే వ్యాపారానికి తరతరాలుగా ప్రాధాన్యత ఇవ్వడమే ఈ విజయానికి కారణమని చోక్సీ పేర్కొన్నారు. "నౌకరీ తో గరీబోన్ కా దండా చే" (ఉద్యోగాలు పేదల కోసం) అనేది గుజరాతీ కుటుంబాలలో ఒక సాధారణ నమ్మకం. వ్యాపారం అనేదేదో నేర్చుకోవాల్సిన ఒక నైపుణ్యంలాగా కాకుండా గుజరాతీ పిల్లలు.. తమ కుటుంబాల్లో డబ్బును ఎలా నిర్వహిస్తున్నారు.. డీల్స్ ఎలా చేస్తున్నారు.. నష్టాలను ఎలా అంచనా వేస్తున్నారు.. అనేది నిత్యం చూస్తూ పెరుగుతారు.రిస్క్ తీసుకోవడం అనేది మరో ముఖ్యమైన లక్షణం. వజ్రాల ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ల వరకు గుజరాతీలు అనిశ్చితిని స్వీకరించి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ మనస్తత్వం ప్రారంభ ఆర్థిక విద్య ద్వారా బలపడుతుంది. చాలా మంది పిల్లలు చిన్న వయస్సు నుండే కుటుంబ వ్యాపారాలలో సహాయపడతారు. ఏ ఎంబీఏ బోధించలేని రియల్ వరల్డ్ ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకుంటారు.నెట్ వర్కింగ్, కమ్యూనిటీ సపోర్ట్ కీలకం. రుణాలు, మార్గదర్శకత్వం, మార్కెట్ విషయంలో గుజరాతీలు ఒకరికొకరు చురుకుగా సహాయపడతారు. వారి పొదుపు జీవనశైలి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. లాభాలను విలాసవంతంగా ఖర్చు చేయకుండా తిరిగి పెట్టుబడి పెడతారు. ఇది దీర్ఘకాలిక సంపద సేకరణకు దారితీస్తుంది.వివిధ పరిశ్రమల్లో గుజరాతీలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నారో కూడా చోక్సీ తెలియజేశారు. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్ మాత్రమే ప్రాసెస్ చేస్తోందని, బెల్జియం, ఇజ్రాయెల్ లోని పోటీదారులను గుజరాతీ పారిశ్రామికవేత్తలు ఎలా అధిగమించారో ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా, భారతదేశ స్టాక్ మార్కెట్ వ్యాపారులలో 60% పైగా గుజరాతీలు లేదా మార్వాడీలు ఉన్నారు.అమెరికాలో కూడా గుజరాతీలు వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. అమెరికాలోని మొత్తం హోటళ్లలో 60 శాతానికి పైగా గుజరాతీ కుటుంబాలకు చెందినవేనని, ప్రధానంగా పటేల్ సామాజిక వర్గానికి చెందినవని చోక్సీ వెల్లడించారు. 1950వ దశకంలో చిన్న చిన్న పెట్టుబడులుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మల్టీ బిలియన్ డాలర్ల పరిశ్రమగా రూపాంతరం చెందింది.108 out of 191 Indian billionaires are Gujarati.A Gujarati living in America makes three times more than an average American.Gujarat, which has 5% of India’s population, contributes over 8% to the GDP and 18% of the industrial output.Gujarat has a land area of only 6% but… pic.twitter.com/ZId5idzCNS— Abhijit Chokshi | Investors का दोस्त (@stockifi_Invest) March 8, 2025 -
ఖదీజా అభిమానాన్ని చూరగొన్న ముహమ్మద్
ఇస్లాం/ప్రవక్త జీవితం వ్యాపార విజయంతో ఒంటెలనిండా సామగ్రి నింపుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒంటెలు బాగా నీరసించాయి. అడుగుతీసి అడుగేయడమే కనాకష్టమైపోయింది. సహప్రయాణీకులు ముందుగానే చకచకా వెళ్లిపోయినా వీళ్లు మాత్రం వెనుకబడిపోయారు. ముహమ్మద్ నిజాయితీ, వ్యాపార దక్షతల కారణంగా ఆ సంవత్సరం ఊహించినదానికన్నా అనేకరెట్లు లాభాలు, శుభాలు సమకూరాయి. గతంలో ఎప్పుడూ ఇంతగా లాభాలు గడించిన దాఖలాలు లేవు. దీంతో ఆమె మరింతగా ప్రభావితమయ్యారు. అన్నిటికీ మించి ముహమ్మద్ వ్యక్తిత్వం, హుందాతనం, నీతి నిజాయితీలు ఆమెను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇంతలో మైసరా కూడా వచ్చేశాడు. వాహనాల నిండా సరకు, సరంజామా పుష్కలంగా ఉంది. మైసరా వ్యాపార సామగ్రితోబాటు బోలెడన్ని కబుర్లు కూడా మోసుకొచ్చాడు. మైసరా నోట అనేక విషయాలు తెలుసుకున్న ఖదీజా హృదయం సంతోషంతో పులకించి పోయింది. ప్రయాణ విశేషాలతోబాటు, ముహమ్మద్ వ్యక్తిత్వాన్ని గురించి, వ్యాపార లావాదేవీల్లో ఆయన చూపిన నీతి, నిజాయితీ, సామగ్రి పరిరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తదితర విషయాలన్నీ వివరించాడు మైసరా. అంతేకాదు, ప్రయాణ సమయంలో సంభవించిన అద్భుతాలను కూడా ఒక్కొక్కటి వరుసగా చెప్పుకొచ్చాడు ప్రయాణంలో ముహమ్మద్ (స) సహప్రయాణీకులతో మెలిగిన ప్రశంసనీయమైన తీరు, మోడువారిన చెట్టు పచ్చగా చిగురించి నీడ కల్పించడం, ప్రఖ్యాత పండితుడు వస్తూరా వినిపించిన భవిష్యవాణి తదితర విషయాలన్నీ చెప్పాడు. తరువాత తిరుగు ప్రయాణంలో జరిగిన మరో అద్భుతాన్ని వివరించాడు. వ్యాపార విజయంతో ఒంటెలనిండా సామగ్రి నింపుకుని వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒంటెలు బాగా నీరసించాయి. అడుగుతీసి అడుగేయడమే కనాకష్టమైపోయింది. సహప్రయాణీకులు ముందుగానే చకచకా వెళ్లిపోయినా వీళ్లు మాత్రం వెనుకబడిపోయారు. అప్పుడు మైసరా ముహమ్మద్‌తో, ‘చూడండి, సహప్రయాణీకులు మనకంటే ముందే వెళ్లిపోయారు. మన ఒంటెలు బాగా అలసిపోయాయి. ఇక ఎంతమాత్రం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడేం చేద్దాం’ అంటూ తలపట్టుకున్నాడు. అప్పుడు ముహమ్మద్గారు, అలసిపోయి, చతికిలపడ్డ ఒంటెల కాళ్లను ఒకసారి తమ పవిత్ర హస్తాలతో నిమిరి, వాటిని అదిలించారు. వెంటనే అవి ఎక్కడలే ని ఉత్తేజం పొందినట్లుగా పరుగులాంటి నడక ప్రారంభించి, అందరికన్నా ముందే గమ్యానికి చేరుకున్నాయి. ఈ విధంగా మైసరా ముహమ్మద్‌ను గురించి అనేక విషయాలు చెప్పాడు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)


