breaking news
bullfight
-
స్పానిష్ లో 'బుల్‌ఫైట్'
-
చెవులు కోసిన ఆమెను... ఏం చేసిందో తెలుసా?
లియా విసెన్స్.. ఈ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది జంతుప్రేమికులు ఉలిక్కిపడతారు. అందుకు కారణం ఆమె కిరాతకంగా ఓ దున్నపోతును చంపడమే కాకుండా.. ఆ దున్నపోతు చెవులు కోసి.. వాటిని చేతిలో పట్టుకొని గర్వంగా ఫొటో దిగింది. ఈ ఫొటోతో విస్మయపోయిన జంతుప్రేమికులు ఆమె తీరుపై భగ్గుమన్నారు. ఇప్పుడు సాటి దున్నపోతే ఆమె మీద పగ తీర్చుకుంది. స్పెయిన్ జరాగోజాలోని లా మిజెరికార్డియాలో ఎల్ పిలార్ ఫెరియా టోర్నమెంటు పేరిట దున్నపోతులను హింసించే అతి కిరాతకమైన క్రీడ జరుగుతుంది. గుర్రం మీద స్వారీ చేసే బుల్ ఫైటర్లు దున్నపోతును నుంచి తప్పించుకుంటూ దానిని పొడిచి పొడిచి హింసిస్తారు. ఈ క్రీడలో భాగంగా 31 ఏళ్ల లియా విసెన్స్ గత ఏడాది గుర్రంపై స్వారీ చేస్తూ ఓ దున్నపోతును ఇలా పొడిచి పొడిచి చంపేసింది. అంతేకాకుండా ఆ దున్నపోతు చెవులను కోసి.. వాటిని గర్వంగా పట్టుకొని ఫొటో దిగింది. ఈ కిరాతకమైన ఫొటో చూసి జంతు ప్రేమికుల ఒళ్లు జలదరించింది. ఆమె తీరుపై వారు భగ్గుమన్నారు. ఈ ఏడాది క్రీడలో సాటి దున్నపోతు తన పవర్ ఏంటో ఆమెకు రుచి చూపించింది. గుర్రంపై స్వారీ చేస్తూ.. లియా విసిరిన శూలం పోట్లను తప్పించుకుంటూ ఆమెకు చుక్కలు చూపించింది. గుర్రాన్ని కుమ్మేసి.. ఆమెను కిందపడేసింది. కొమ్ములతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించింది. క్షణాల్లో ప్రాణాలు పోయేవే. కానీ, క్రీడా సిబ్బంది తక్షణమే స్పందించి ఆమెకు రక్షణగా రావడంతో లియాకు ప్రాణాపాయం తప్పింది. కానీ, గత ఏడాది ఆమె చూపిన దుర్మార్గ చర్యకు ఈ ఏడాది సాటి దున్నపోతే పగ తీర్చుకుందని జంతు ప్రేమికులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను చంపేసిన దున్నపోతు చెవులతో (గత ఏడాది ఫొటో) -
స్పెయిన్‌లో 'బుల్‌ఫైట్' ఫెస్టివల్
-
రానా బుల్‌ఫైట్ ఇలా..
బాహుబలి సినిమా రిలీజై ఇన్నాళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఏదో ఒక రకంగా ఆ సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు చిత్రయూనిట్. సినిమా విడుదలకు ముందునుంచే ప్రమోషన్ విషయంలో సరికొత్త స్ట్రాటజీ ఫాలో అయిన రాజమౌళి.. రెండో భాగం రిలీజ్ అయ్యే వరకు బాహుబలి ఫీవర్ కొనసాగేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవల చిత్రయూనిట్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా ప్రారంభంలో రానా ఓ భారీ అడవిదున్నతో పోరాడే సన్నివేశాన్ని ఎలా తెరకెక్కించారో.. ప్రేక్షకులకు రివీల్ చేశాడు జక్కన్న, అంత బలమైన దున్నతో రానా ఎలా తలపడ్డాడు.. ఆ సీన్‌ను ఎలా షూట్ చేశారన్న అంశాలను మేకింగ్‌లో స్పష్టంగా చూపించారు. ముఖ్యంగా ఈ ఒక్క సీన్ చూస్తే చాలు.. బాహుబలి సినిమా తెరకెక్కించటం వెనుక గ్రాఫిక్స్ మాయాజాలం ఎంత ఉందో అర్థమైపోతుంది. ఈ మేకింగ్ చూసిన ప్రేక్షకులు మరొక్కసారి వెండితెర మీద ఆ సీన్ చూడాలనుకునేలా ఉంది ఆ వీడియో. గ్రీన్‌మ్యాట్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫైటింగులలో రిస్కు చాలావరకు తగ్గిపోయిందన్న విషయాన్ని కూడా ఈ వీడియో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఏదైనా తన సినిమాను ప్రమోట్ చేసుకోవటం రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదేమో..? -
బుల్ ఫైట్