breaking news
Budget Cuts
-
బడ్జెట్‌కు పాక్ ఆర్మీ స్వచ్ఛంద కోత
ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌కు మద్దతిస్తూ పాక్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రక్షణ బడ్జెట్‌కు కేటాయించే నిధులను స్వచ్ఛందంగా తగ్గిస్తున్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చెప్పారు. ‘దేశ భద్రత, రక్షణ విషయాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోం. అన్ని ప్రమాదాల నుంచి దేశాన్ని రక్షించాలి. ముప్పులను దీటుగా ఎదుర్కొగలిగేలా సామర్థ్యాన్ని కొనసాగించాలి. బడ్జెట్లో కోత వల్ల కలిగే ఇబ్బందులను త్రివిధ దళాలు తగిన అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయి. దేశంలోని గిరిజన ప్రాంతాలు, బలూచిస్థాన్ అభివృద్ధిలో పాలుపంచుకోవడమే మాకు ముఖ్యం’ అని ఆసిఫ్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయాన్ని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు. పలు భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ దేశం కోసం వారు ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. -
ప్రముఖులను కలవరపెడుతున్న ట్రంప్ బడ్జెట్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న తొలి బడ్జెట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు సహాయం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం పలువురు ప్రముఖులను కలవర పెడుతోంది. ట్రంప్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్ ను కనుక ఆమోదిస్తే, ప్రపంచంలో అమెరికానే తక్కువ సుసంపన్నమైన, తక్కువ సురక్షితమైన దేశంగా ఉంటుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనలతో తాము పూర్తిగా సమస్యల ఉచ్చులో కూరుకుపోతామని, ఇది పేద ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని ఫౌండేషన్ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ల్మన్ అన్నారు. దేశంలో ఉన్నవారిని, విదేశీయులను ఎంతో ప్రభావితం చేయనుందన్నారు. ట్రంప్ బడ్జెట్ ఎక్కువగా రక్షణ వ్యవహారాలకు సహాయపడుతుందని, మిగతా వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్, రవాణా, వ్యవసాయం, పర్యావరణం వంటి డిపార్ట్ మెంట్లను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజలను ఆరోగ్యవంతంగా, సుస్థిరమైన సంఘాలలో జీవించే విధంగా సహకరించాలని, ఇది జాతి భద్రతకంటే కూడా ఎంతో క్లిష్టతరమైన అంశమని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. గురువారం ట్రంప్ బడ్జెట్ బ్లూప్రింట్ ను విడుదల చేశారు. అమెరికా ఫస్ట్ పేరుతో వచ్చిన ఈ బడ్జెట్లో విదేశీ సహాయాలు తగ్గిస్తున్నట్టు ప్రతిపాదించారు.