breaking news
buddharam
-
కొడుకును కడతేర్చిన తల్లి
నల్లగొండ క్రైం: వివాహేతర సంబంధం బయటపడుతుందనే ఉద్దేశంతో.. ప్రియుడితో కలసి ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా బుద్ధారంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన వెంకన్న–విజయకు పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా విజయ గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తో్తంది. శుక్రవారం మధ్యాహ్నం వెంకట్‌రెడ్డి విజయ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో రెండో కుమారుడు నాగరాజు (7) ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్ద కుమారుడు బయట ఆడుకుంటున్నాడు. విజయ, వెంకట్‌రెడ్డి చనువుగా ఉన్న సమయంలో నాగరాజు గమనించి నాన్నకు, నాన్నమ్మకు చెప్తానన్నాడు. వెంటనే తల్లి నాగరాజు చెంపపై కొట్టగా.. గట్టిగా ఏడ్చాడు. ఎవరైనా చూస్తున్నారా అని ఇంటి బయటికి వచ్చి చూసింది. ఇరుగుపొరుగు వారు కుమారుడు ఎందుకు ఏడుస్తున్నాడని అడగడంతో కడుపు నొప్పి ఉందని, అందుకే ఏడుస్తున్నాడని చెప్పింది. తల్లి మళ్లీ ఇంట్లోకి వెళ్లి నాగరాజుని ఏడ్వవద్దని చెప్పింది. మళ్లీ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉండటంతో విషయాన్ని అందరికీ చెప్తానని నాగరాజు అన్నాడు. దీంతో విషయం బయటపడుతుందని భయపడి ప్రియుడితో కలసి బాలుడి గొంతుకు టవల్ బిగించి హతమార్చారు. ఆర్థిక సంబంధాలతో చనువు విజయ కుటుంబానికి తోకల వెంకట్‌రెడ్డి రూ.లక్ష అప్పు ఇచ్చాడు. రూ.50 వేలు తిరిగి ఇచ్చినప్పటికీ మరో రూ.50 వేలు ఇవ్వాల్సి ఉంది. అప్పుడప్పుడు వెంకట్‌రెడ్డికి వ్యవసాయ పని కోసం ట్రాక్టర్ దున్నటానికి విజయ భర్త వెంకన్న వెళ్లేవాడు. భార్య విజయ వెంకట్‌రెడ్డితో చనువుగా ఉంటుందన్న విషయం తెలిసిన వెంకన్న గతంలో విజయ, వెంకట్రెడ్డిలను మందలించినట్లు తెలిసింది. -
తహసీల్దార్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
దాయాదుల మధ్య భూ వివాదమే కారణం బాధితుడి పరిస్థితి విషమం బుద్ధారం సాదాబైనామాల గ్రామ సభలో ఘటన గణపురం : తనకు చెందిన భూమిని తనకు కాకుండా కొందరు గ్రామపెద్దలు అడ్డుపడుతున్నారని మనోవేదనకు గురైన ఓ రైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని బుద్ధారంలో బుధవారం జరిగింది. సాదాబైనామాల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలో తహసీల్దార్ జీవాకర్‌రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం కలకలం సృష్టించింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బుద్ధా రం గ్రామానికి చెందిన చెలుమల్ల బాబురావు, చెలుమల్ల రాజేందర్ మధ్య కొన్నాళ్లుగా భూవివాదం ఉంది. రాజేందర్‌కు చెందిన భూమిని బాబురావు చాలాకాలం నుంచి ఆక్రమించుకుని దున్నుతున్నాడు. ఈ విషయమై రాజేందర్ గ్రామపెద్దలకు ఫిర్యాదు చేసి పంచాయితీ పెట్టాడు. ఇరువర్గాల పెద్దమనుషులు రెండెకరాల భూ మిలో ఎకరం రాజేందర్‌కు, ఎకరం బాబురావుకు కేటాయిస్తూ తీర్మానం చేశారు. దాని ప్రకారం తనకు రావాల్సిన ఎకరం భూమిని సాదాబైనామాల గ్రామసభలో పహణీలో చేర్చాలని రాజేందర్ గ్రామసభకు వచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్ భర్తతో రాజేందర్‌కు ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేందర్ గ్రామంలోకి వెళ్లి క్రిమిసంహరక మందు కొనుగోలు చేసి తిరిగి గ్రామపంచాయతీకి వచ్చాడు. అందరి ముం దే తన భూమి తనకు కాకుండా అడ్డుపడుతున్నవారి మూలంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని అంటూనే మందు తాగాడు. సర్పంచ్ భర్త మునుకుంట్ల సంగయ్య, ఉపసర్పంచ్ గండ్ర మాధవరావు, సీహెచ్ బాబురావు, సురేందర్, రవీందర్ తదితరులు కారణమని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీఎంను సంబోధిస్తూ లేఖ కూడా రాశాడు. తహసీల్దార్‌కు లేఖ అందించి రాజేందర్ మందు తాగాడు. దీంతో వెంటనే అతడిని గణపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ దగ్గర ఉండి వైద్యం చేయించారు. కాగా బాధితుడి తల్లి ఉదయమ్మ, భార్య మమత ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.