breaking news
The bride and groom
-
కోవిడ్–19 కిట్ల పెళ్లి
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. రాజస్థాన్లో ఓ పెళ్లి మాత్రం కోవిడ్ సెంటర్లో జరగాలని దేవతలు నిర్ణయించినట్టున్నారు. ఇటీవల రాజస్థాన్ బారాలో ఒక జంట కెల్వారా కోవిడ్ సెంటర్లో పెళ్లితో ఒక్కటయ్యింది. నవ వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పెళ్లి జరిపించే çపురోహితుడు పిపిఇ కిట్లు ధరించి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి పెళ్లి జరగడం దేశంలో ఇదే మొదటిదిగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా వివాహవేడుకలపై అనేకానేక ఆంక్షలు తప్పడం లేదు. పెళ్లిళ్లలో మాస్కులు ధరించకపోయినా, ఎక్కువ సంఖ్యలో హాజరైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా పోలీసులు జరిమానాలు విధించిన సంఘటనలు చూశాం. కొన్ని పెళ్ళిళ్లలో వెయిటర్లు పిపిఇ కిట్లు ధరించడమూ చూశాం. కానీ, పెళ్లిలో వధూవరులు పిపిఇ కిట్లు ధరించడం మాత్రమే ఇప్పుడే చూస్తున్నాం. ఇందులో పెళ్లికూతురెవరో, పెళ్లికొడుకెవరో ఎత్తును బట్టి కొంత తెలుసుకోవచ్చు కానీ, మిగిలిన అతిథులలో ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. పురోహితుడంటే ప్రత్యేకంగా తెల్లసూటేసుకున్నాళ్లెండి. విషయమేమంటే.. రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో ఛతర్గంజ్ గ్రామానికి చెందిన వధువుకు దంతా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె కోవిడ్–19 పరీక్ష చేయించుకుంది. పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత వధువు కూడా పరీక్ష చేయించుకుంది. పెళ్లి జరిగే రోజున వధువుకు కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దీంతో వాయిదా వేయలేక అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలనుకున్నారు పెద్దలు. అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఈ పెళ్లిలో వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మొత్తం 7 గురు పిపిఇ కిట్లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి తంతు ముగించారు. పిపిఇ కిట్లతో వివాహం జరుపుకున్న జంటగా ఈ రాజస్థానీ వధూవరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. -
తగిన జోడీ ఎవరో తెలిసేదెలా?
వివాహం చేసుకోవాలనుకునేవారికి తమకు తగిన జోడీ ఎవరో ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే ఏయే విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి? వివాహం విషయంలో వధూవరుల నక్షత్రాలతో పాటు రాశి పొంతన, నాడీకూటమి, గణాలు, గ్రహమైత్రి వంటివి పరిశీలించుకోవాలి. ఉభయుల జాతకాలలో (జన్మకుండలి) కుజ, శుక్ర, రాహుకేతు దోషాల వంటివి లేకుండా చూసుకోవాలి. వధూవరుల నక్షత్రాలు సరిచూడాలి. వధువు నక్షత్రం నుంచి వరుడి నక్షత్రం వరకు లెక్కించాలి. వివాహ విషయమై వధూవరుల పొంతనకై అనుకూల నక్షత్రాలు... వధువు వర నక్షత్రములు నక్షత్రం అశ్వని భరణి, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, రేవతి (చిత్త, మృగశిర, పునర్వసు 4, మఖ)భరణి కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, మూల, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి, అశ్వని (పుబ్బ, స్వాతి) కృత్తిక రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, భరణి (పునర్వసు, పూర్వాషాఢ, ఉత్తర) రోహిణి మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర, రేవతి, భరణి, కృత్తిక (పుష్యమి, అనూరాధ, పూర్వాషాఢ, శతభిషం) మృగశిర ఆర్ద్ర, పుష్యమి, ఉత్తర, హస్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, కృత్తిక, రోహిణి (చిత్త, జ్యేష్ఠ, పూర్వాభాద్ర) ఆర్ద్ర పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర (పుష్యమి, స్వాతి, మూల) పునర్వసు పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనూరాధ, మూల ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర (విశాఖ, పూర్వాషాఢ, రేవతి) పుష్యమి ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, శ్రవణం, రేవతి, భరణి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు (ఉత్తర, అనూరాధ, ఉత్తరాషాఢ, శతభిషం) ఆశ్లేష ఉత్తర, చిత్త, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, అశ్వని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి (హస్త, శ్రవణం) మఖ పుబ్బ, హస్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, శతభిషం, ఉత్తరాభాద్ర, భరణి, ఆర్ద్ర, పుష్యమి (చిత్త, శ్రవణం, రోహిణి, ఆశ్లేష) పుబ్బ ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, రేవతి, అశ్వని, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ (స్వాతి, పూర్వాషాఢ, శతభిషం, కృత్తిక) ఉత్తర హస్త, స్వాతి, అనూరాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ (విశాఖ, ఉత్తరాషాఢ, రేవతి, భరణి, పుబ్బ) హస్త చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర (అనూరాధ, శ్రవణం, ఉత్తరాభాద్ర, భరణి, పుబ్బ) చిత్త స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త (ధనిష్ఠ, కృత్తిక) స్వాతి విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, పూర్వాభాద్ర, రేవతి, భరణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త (మూల, శతభిషం, అశ్వని, పుష్యమి) విశాఖ అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి (శ్రవణం, అశ్వని) అనూరాధ జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ (ఉత్తరాషాఢ) జ్యేష్ఠ ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, అనూరాధ (ధనిష్ఠ, పూర్వాభాద్ర, రోహిణి, విశాఖ) మూల పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, భరణి, ఆర్ద్ర, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ఠ (ధనిష్ఠ, అశ్వని, రోహిణి)పూర్వాషాఢ ఉత్తరాషాఢ, ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల (కృత్తిక, ఆర్ద్ర) ఉత్తరాషాఢ {శవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, కృత్తిక, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, మూల (భరణి, పుబ్బ, పుర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి) శ్రవణం ధనిష్ఠ, పూర్వాభాద్ర, రేవతి, భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ (పుష్యమి, పుబ్బ, పూర్వాషాఢ) ధనిష్ఠ శతభిషం, ఉత్తరాభాద్ర, అశ్వని, కృత్తిక, రోహిణి, పుష్యమి, ఉత్తర, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం (ఆర్ద్ర, మఖ, అనూరాధ) శతభిషం పూర్వాభాద్ర, రేవతి, భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం (అశ్వని, ఆర్ద్ర, ఆశ్లేష) పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర, అశ్వని, మృగశిర, ఆర్ద్ర, పుష్యమి, మఖ, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, శతభిషం (కృత్తిక, పునర్వసు, ఉత్తర) ఉత్తరాభాద్ర రేవతి, భరణి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, ఆశ్వని, పుబ్బ, హస్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వాభాద్ర (స్వాతి, పుష్యమి, అనూరాధ) రేవతి కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, చిత్త, విశాఖ, అనూరాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర (అశ్వని, రోహిణి, ఆశ్లేష, హస్త, పూర్వాభాద్ర) రాశి పొంతన ( వధువు రాశి నుంచి వరుని రాశి వరకు): ఏకరాశి శుభం, 2-12 మృత్యువు, 12-2 ఆయుష్షు, 3-11 సౌఖ్యం, 11-3 దుఃఖం, 4-10 ప్రీతి, 10-4 అప్రీతి, 5-9 సౌభాగ్యం, 9-5 అశుభం, 6-8 కలహం, 8-6 పుత్రలాభం, 7-7 శుభం. ద్విద్వాశకము (2-12)లో శుభము: మీనం - మేషం, వృషభం - మిథునం, కర్కాటకం - సింహం, కన్య - తుల, వృశ్చికం - ధనుస్సు, మకరం - కుంభం. ఏకాదశ త్రికము (11-3)లో శుభము: కర్కాటకం - వృషభం, కుంభం - ధనుస్సు, మీనం - మకరం. దశ చతుర్థకములు (10-4)లో శుభము: కర్కాటకం - మేషం, వృషభం - కుంభం, కన్య - మిథునం, వృశ్చికం - సింహం, మకరం - తుల, మీనం - ధనుస్సు.నవ పంచకములు (9-5)లో శుభము: కన్య - వృషభం, కుంభం - తుల, వృశ్చికం - కర్కాటకం, సింహం - మేషం, కర్కాటకం - మీనం. షష్ఠాకము (6-8)లో శుభము: వృషభం - తుల, వృశ్చికం - మేషం, కర్కాటకం - ధనుస్సు, కన్య - కుంభం, మకరం - మిథునం, మీనం - సింహం. నాడీ కూట వివరము: ఆది, మధ్య, అంత్యనాడులలో వధూవరులు ఇద్దరికీ ఒకే నాడి కాకూడదు. ఆదినాడీ దోషపరిహార నక్షత్రములు: ఉత్తర - శతభిషం, పూర్వాభాద్ర - పునర్వసు, ఆరుద్ర - మూల, అశ్వని.మధ్య నాడీ దోష పరిహార నక్షత్రములు: మృగశిర - పుష్యమి, పుబ్బ - చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ఠ. అంత్యనాడీ దోష పరిహార నక్షత్రములు: కృత్తిక - రోహిణి, ఆశ్లేష - మఖ, విశాఖ, శ్రవణం. నాడీ దోషము లేని నక్షత్రములు: రోహిణి, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి.గణ కూట వివరము (దేవ, మనుష్య, రాక్షస గణములు): వధూవరులవి ఒకే గణమైన ప్రీతి. దేవ - మనుష్య గణమైన మధ్యమం. దేవ - రాక్షస గణం అధమం.మనుష్య - రాక్షస గణమైన మృత్యుప్రదం. పనికి వచ్చే రాక్షస గణ నక్షత్రములు: ఆశ్లేష, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, శతభిషం. విరోధ జంతువులు: కుక్క - జింక, పాము - ముంగిస, సింహం - ఏనుగు, కోతి - మేక, గుర్రము - దున్నపోతు, ఆవు - పులి, పిల్లి - ఎలుక.దోష నక్షత్ర వివరములు: మూలా నక్షత్రం నాల్గవ పాదము మామకు, ఆశ్లేష 1వ పాదం అత్తకు, విశాఖ నాల్గవ పాదం మరిదికి, జ్యేష్ఠ నక్షత్రం నాల్గవ పాదం బావకు అశుభం. వధూవరులకు ఏక నక్షత్ర ఏక పాదం అయినను దోషం లేనివి అశ్వని - కృత్తిక, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, హస్త - చిత్త, విశాఖ, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి.వధూవరులకు ఒకే నక్షత్రం అయిననూ దోషం లేనివి అశ్వని, భరణి, రోహిణి, ఆశ్లేష, ఆరుద్ర, మఖ, పుబ్బ, పుష్యమి, స్వాతి, విశాఖ, అనూరాధ, మూల, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. గహ మైత్రి గ్రహం మిత్రులు శత్రువులు సములు.. రవి కుజ, గురు, చంద్ర శని బుధ, శుక్రులు చంద్ర శుక్ర, రవి బుధ కుజ, గురు, శని కుజ గురు, రవి, చంద్ర శని బుధ, శుక్రులు బుధ శుక్ర, శని, రవి చంద్ర గురు, కుజులు గురు రవి, కుజ, చంద్ర శుక్రుడు బుధ, శని శుక్ర బుధ, శని గురుడు చంద్ర, కుజుడు శని బుధ, శుక్ర రవి, కుజులు గురు, చంద్రులు