breaking news
Bramhothsavam
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు
– సిద్దమైన శ్రీవారి పుష్కరిణి – గదులు, ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్ రద్దు – సెప్టెంబరు 27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 3వ తేది నుండి 11వ తేది వరకు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు పూర్తి చేసి పైపులతో కొత్త నీటిని నింపే చర్యలు మంగళవారం ప్రారంభించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ఇవి.. – శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో 2.20 లక్షల మంది భక్తులు వేచిఉండేందుకు వీలుగా గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం ప్రారంభించారు. గరుడ సేవలో లక్షలాది మంది భక్తులు వాహన సేవను దర్శించేలా అదనపు ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ వీధుల్లో రంగుల రంగువళ్లులు అలంకరించారు. – బ్రహ్మోత్సవాల్లో గదులు, శ్రీవారి ఆర్జిత సేవల ముందస్తు రిజర్వేషన్ రద్దు చేశారు. – ఉత్సవాల్లో అదనంగా సీసీ కెమెరాలు, నిఘా భద్రతా విభాగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు – రోజూ 3 వేల నుండి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి మరో 50 మంది సిబ్బంది రానున్నారు. ఉత్సవాల్లో టీటీడీ, విజిలెన్స్, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్, వంటి ఇతర నిఘా సంస్థలు అనుక్షణం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ చేశారు. – కాటేజీలు, అతిథిగృహాలను ముందస్తుగానే మాస్క్లీనింగ్ నిర్వహించారు. – ఆలయానికి సరికొత్త శోభతో కాంతులీనే విధంగా విద్యుత్ అలంకరణ ప్రారంభించారు. – అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాల్లో సౌకర్యాలు పెంచనున్నారు. – కల్యాణవేదికలో ఫొటో ఎగ్జిబిషన్, ఫల, పుష్పప్రదర్శన ఏర్పాటుకోసం ప్రణాళికలు సిద్దం చే శారు. – వేలాదిగా తరలివచ్చే వాహనాల కోసం అదనపు పార్కింగ్ కేంద్రాలు, రింగ్‌రోడ్డు సదుపాయం కల్పించనున్నారు. – హిందూ ధర్మప్రచారం, అన్నమాచార్య, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భక్తి, సంగీత, సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. – సెప్టెంబరు 16న పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించి లోపాలు గుర్తించనున్నారు. – సెప్టెంబరు 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అంగరంగవైభవంగా ఉత్సవాలు: టీటీడీ ఈవో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మంగళవారం విలేకరులకు వెళ్లడించారు. భక్తులకు రోజుకు ఏడు లక్షలు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశామన్నారు.పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తామన్నారు. ఉత్సవాల్లో పచ్చదనం, పుష్పాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ––––––––––––––––––––––––––––––––––– తేది ఉదయం రాత్రి –––––––––––––––––––––––––––––––––– 03–10–2016 –ధ్వజారోహణం( సా:6గం) – పెద్ద శేషవాహనం 04–10–2016 – చిన్నశేషవాహనం – హంసవాహనం 05–10–2016 – సింహవాహనం – ముత్యపుపందిరి వాహనం 06–10–2016 – కల్పవృక్షవాహనం – సర్వభూపాల వాహనం 07–10–2016 – మోహినీ అవతారం– గరుడ వాహనం 08–10–2016 – హనుమంతæవాహనం, సాయంత్రం స్వర్ణ రథోత్సవం – గజవాహనం 09–10–2016 – సూర్యప్రభ వాహనం– చంద్రప్రభ వాహనం 10–10–2016 – రథోత్సవం – అశ్వ వాహనం 11–10–2016 – చక్రస్నానం – ధ్వజ అవరోహణం -
సూపర్ స్టార్ సరసన అలియా
-
సూపర్ స్టార్ సరసన అలియా
బాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు. అందుకే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ మహేష్ సినిమాలో నటించాలని ఉందంటూ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. కెరీర్ స్టార్టింగ్‌లో ఎక్కువగా బాలీవుడ్ భామలతోనే తెరను పంచుకున్నాడు ప్రిన్స్. ప్రీతిజింటా, సోనాలి బ్రిందే, బిపాషాబసు, లిసారే లాంటి క్రేజీ హీరోయిన్స్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇటీవల కాలంలో సౌత్ హీరోయిన్స్‌తోనే సరిపెట్టుకుంటున్న మహేష్, మరోసారి బాలీవుడ్ హీరోయిన్‌తో కలిసి నటించడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్, ఆ సినిమా తరువాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో మల్టీ లింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అలియా భట్ హీరోయిన్గా నటించనుందట. గజిని సినిమాతో బాలీవుడ్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న మురుగదాస్, ప్రస్తుతం హిందీలో సోనాక్షి సిన్హా లీడ్రోల్లో అఖీరా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తవ్వగానే మహేష్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు మురుగదాస్. ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‌తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. -
మహేష్‌తో మరోసారి శృతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతారు. అందుకే ఒకసారి మంచి హిట్ వస్తే అదే కాంబినేషన్లో తిరిగి పనిచేయాలనుకుంటారు. మామూలు హీరోలు మాత్రమే కాదు సూపర్ స్టార్లు కూడా ఇలాంటి సెంటిమెంట్లనే ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు తన నెక్ట్స్ సినిమా కోసం ఇలాంటి ఓ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌ను సెట్ చేస్తున్నాడు. శ్రీమంతుడు సక్సెస్‌తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసేస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శతక్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. సామాజిక సమస్యల నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా లీడ్ రోల్లో అకీరా అనే హిందీ సినిమా చేస్తున్న మురుగదాస్, ఆ సినిమా పూర్తి కాగానే మహేష్ సినిమా పని మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి శృతిహాసన్‌తో ఆడిపాడటానికి రెడీ అవుతున్నాడు మహేష్. శ్రీమంతుడు సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ అందించిన కాంబినేషన్లో సినిమా చేస్తే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.