breaking news
Bramhosthsavam
-
ఇటు బ్రహ్మోత్సవం.. అటు సీతారాముల కల్యాణోత్సవం
సాక్షి, యాదాద్రి: ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టుగా ఐదేళ్ల కిందట ప్రారంభమైన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ఫిబ్రవరిలో ప్రధానాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. వసంత పంచమి అయిన ఫిబ్రవరి 16న లేదా రథ సప్తమి తేదీ అయిన 18న ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ దర్శన భాగ్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 18 నుంచి 21 వరకు అధ్యయనోత్సవాలు, ఫిబ్రవరి 22 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల్లోపు స్వామి వారి దర్శనం ప్రారంభిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తం అవుతోంది. అందుకే కొండపైన పనులన్నీ ఈ నెల 30కల్లా పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు జరిగిన సమీక్షలో సీఎం ఆదేశించారు. ఈ పనులను 27న సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పర్యవేక్షించనున్నారు. అనంతరం ఆయన ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం చినజీయర్ స్వామిని కలసి ప్రధానాలయాన్ని పునఃప్రారంభించడంపై అనుమతి కోరే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొండ కింద జరుగుతున్న టెంపుల్ సిటీ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది పట్టే అవకాశం ఉంది.(చదవండి: యాదాద్రి పునర్నిర్మాణం కేసీఆర్ కలల ప్రాజెక్టు) ప్రాణ ప్రతిష్టకు ప్రత్యేక పూజలు... ప్రస్తుతం బాలాలయంలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఫొటోలకు స్వామి వారి ఆవాహనం చేశారు. త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 2016లో భక్తులకు దర్శనం కోసం ఈ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ప్రధానాలయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పారాయణాలు, మూలమంత్ర జపాలు, యాగం నిర్వహిం చాల్సి ఉంది. అయితే కరోనాకు ముందు సంవత్సరకాలంపాటు మూలమంత్ర జపాలు చేశారు. కరోనాతో నిలిపివేసిన ఈ జపాలను ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మళ్లీ కొనసాగిస్తారా లేక 11 రోజులపాటు మూలమంత్ర జపాలు నిర్వహించి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఫిబ్రవరిలో ఒకట్రెండు రోజులు మినహా మే వరకు మూఢా లు ఉండటంతో ప్రారంభ తేదీపై స్పష్టత రావడం లేదన్న వాదన కూడా ఆలయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి కొండపైన భక్తుల కోసం చేపట్టిన క్యూ కాంప్లెక్స్ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్రధానాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూ కాంప్లెక్స్ పనులు తిరుమల తరహాలో పూర్తికాగా ప్రధానాలయంలో మిగతా పనులన్నీ దాదాపు పూర్తి కావచ్చాయి. ఆలయం వెలుపల మూడంతస్తుల క్యూ కాంప్లెక్స్ పనులు మరో 15 రోజుల్లో పూర్తి కానున్నాయి. ఆలయం చుట్టూ ఏకశిల సాలహార విగ్రహాలు 150 వరకు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం 32 విగ్రహాలు యాదాద్రికి చేరుకున్నాయి. మిగతావి నెలాఖరు వరకు రానున్నాయి. వాటిని ఫిబ్రవరి మొదటి వారంలో ప్రతిష్టించనున్నారు. దీంతోపాటు ఉత్తరం వైపున రిటైనింగ్ వాల్‌ను 15 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అది పూర్తి అయితే పుష్కరిణి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆర్చి వరకు పార్కింగ్ వసతి కల్పిస్తారు. కొండ కింద చేపట్టిన పుష్కరిణి, అన్న ప్రసాద వితరణ కేంద్రం, బస్టాండ్, రింగ్ రోడ్డు, గండి చెరువు ఆధునీకరణ, ప్రెసిడెన్షియల్ సూట్, కల్యాణకట్ట పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 21న భద్రాద్రి సీతారాముల కల్యాణం ఏప్రిల్ 13 నుంచి 27 వరకు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 21న సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 13 నుంచి 27 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు వైదిక కమిటీ రూపొందించిన బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను సోమవారం ఆలయ ఈఓ బి.శివాజీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు అందించారు. ఏప్రిల్ 13న ప్లవనామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మూలమూర్తుల స్నపన తిరుమంజనం, నూతన పంచాంగ శ్రవణం ఉంటుంది. అదే రోజు బ్రహ్మోత్సవాల ప్రారంభం, 17న మృత్సంగ్రహణం, వాస్తు హోమం, అంకురారోపణం, 18న గరుడ ధ్వ జపట లేఖనము, గరుడ ధ్వజ పటావిష్కరణ, గరు డ ధ్వజాధివాసం, 19న ధ్వజారోహణం, దేవతాహ్వానము, బలి సమర్ప ణ, 20న చతుఃస్థానాచర్చనము, ఎదుర్కోలు ఉత్సవం, 21న శ్రీరామనవమి, 22న మహాపట్టాభిషే కం, 23న సదస్యము, 24న చోరోత్సవం, 25న ఊంజల్ ఉత్సవం, 26న వసంతోత్సవం, 27న పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఉంటాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొ ని ఏప్రిల్ 13 నుంచి 27 వరకు నిత్య కల్యాణోత్సవాలు రద్దు చేశారు. ఏప్రిల్ 17 నుంచి 27 వరకు దర్బార్ సేవలు రద్దు చేశారు. ప్రస్తుతం కోవిడ్–19 నిబంధనలను సడలిం చిన నేపథ్యంలో శ్రీరామనవమిని మిథిలా స్టేడియంలో నిర్వహిస్తారా.. లేదా ఆంతరంగికంగా నిర్వహిస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మహేష్ బాబు 'ఎనిమీ' అట..?
శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్ బాబు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని ప్రిన్స్, ఈసారి మాత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా ఫైనల్ కావటంతో త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో భారీగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు క్లాస్ సినిమాలే కావటంతో ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. మురుగదాస్ రెగ్యులర్ స్టైల్లో సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థ మీద పోరాటం చేసే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'చట్టానికి కళ్లు లేవు' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు 'ఎనిమీ' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక ఫైనల్ అయితే పోకిరీ తరువాత నెగెటివ్ టైటిల్‌తో వస్తున్న మహేష్ సినిమా ఇదే అవుతోంది. అదే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. -
బాలీవుడ్లో మహేష్ మూవీ
టాలీవుడ్లో నెంబర్ వన్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు. వంద కోట్ల వసూళ్లతో టాలీవుడ్ సినిమా స్టామినా ప్రూవ్ చేసిన సూపర్ స్టార్, ప్రస్తుతం తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన ప్రతి సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫార్ములాతో శ్రీమంతుడు సినిమాకు భారీ కలెక్షన్లు సాధించిన మహేష్, తదుపరి సినిమాల విషయంలో మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఘనవిజయం సాదించటంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటు శ్రీమంతుడు సినిమా ఇచ్చిన కిక్‌తో బ్రహ్మోత్సవాన్ని కూడా తెలుగుతో పాటు తమిళ్లోనూ తెరకెక్కిస్తున్న ప్రిన్స్, మలయాళంలోనూ డబ్బింగ్ వర్షన్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టిన రాజకుమారుడు త్వరలో నార్త్‌లోనూ అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా తరువాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మహేష్. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈసినిమాను తెలుగు తమిళ్‌తో పాటు హిందీలోనూ ఒకేసారి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో చాలా సార్లు బాలీవుడ్ ఆఫర్స్ వచ్చినా తిరస్కరించిన మహేష్ ప్రస్తుతం మార్కెట్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాడట. సోషల్ మెసేజ్‌తో భారీగా తెరకెక్కుతున్న మహేష్, మురుగదాస్‌ల సినిమాను ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న ఈసినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతోపాటు నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తున్నారు చిత్రయూనిట్.