breaking news
Brain sharp
-
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే..?
మన శరీర భాగాల్లో ఎక్కువ శ్రమపడేది– మెదడు. ఇది అద్భుతమైన శక్తులతో కూడినది. కాని, దానికి ఇచ్చే విశ్రాంతి, శ్రద్ధ మాత్రం చాలా తక్కువ. మెదడును పదిలంగా ఉంచుకోవాలంటే గంటల తరబడి యోగా, వ్యాయామం అవసరమేమీ కాదు. రోజుకు ఐదు నిమిషాల ‘చిన్న అలవాట్లు’ మన మెదడును శక్తిమంతంగా మార్చగలవని తాజా న్యూరో సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఐదు నిమిషాల అలవాట్లు కేవలం ప్రస్తుతానికే కాక, భవిష్యత్తులో వృద్ధాప్యంలో మెదడు మందగించడం నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలవుతాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం. 1. ముక్కుతోనే పీల్చాలిమనం బతకాలన్నా, మెదడు బతకాలన్నా శ్వాస కావాలి. అయితే మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామన్నది మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు ద్వారా పీల్చే శ్వాస నేరుగా ‘అల్ఫ్యాక్టరీ బల్బు’కు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకునే సమయంలో మెదడు స్మృతి కేంద్రాలను ప్రేరేపించే ‘సబ్టల్ ఎలక్ట్రికల్ రిథమ్స్’ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే నోటిద్వారా శ్వాస తీసుకునే వారికంటే ముక్కుద్వారా శ్వాసతీసుకునేవారు 40శాతం మెరుగైన మెమరీ చూపించారు.2. బాక్స్ బ్రీతింగ్నాలుగు సెకన్లు శ్వాస తీసుకొని, నాలుగు సెకన్లు శ్వాస నిలిపి, నాలుగు సెకన్లు విడిచి, మరో నాలుగు సెకన్లు ఖాళీగా ఉండటం. ఈ విధానాన్ని రోజుకు ఐదు నిమిషాలు పాటిస్తే, మీ మెదడు ముందు భాగంలో (ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్) 25శాతం అదనపు ఆక్సిజన్ చేరుతుంది. ఇది నిర్ణయం తీసుకోవడం, ఫోకస్, మెమరీ వంటివి మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇది మీ పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తూ, కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక్క రోజు బాక్స్ బ్రీతింగ్ చేయడం, ఫోకస్‌ను పదిశాతం పెంచుతుంది. అదే అలవాటు 30 రోజులు కొనసాగితే మీ మెదడు పనితీరులో 40శాతం మెరుగుదల ఉంటుంది. 3. డెస్క్ వర్కవుట్స్... అధిక తీవ్రత గల వ్యాయామం చేసిన వారు రెండు గంటలపాటు మెరుగైన మెదడు పనితీరు చూపారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.. దీనివల్ల బ్రెయిన్ అండ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) విడుదల అవుతుంది, ఇది మెదడు న్యూరాన్ల వృద్ధిని పెంచుతుంది. కేవలం మీ డెస్క్ దగ్గరే ఐదు నిమిషాల్లోనే సాధ్యమయ్యే వ్యాయామాల ఉదాహరణ: 30 సెకన్లు బాడీ వెయిట్ స్క్వాట్స్, 30 సెకన్లు ఆర్మ్ సర్కిల్స్, 30 సెకన్లు హై నీస్, 30 సెకన్లు వాల్ పుషప్స్– ఈ చర్యలతో మెదడులో రక్తప్రసరణ పెరిగి, మీ ఫోకస్, శక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.4. విభిన్న మేధా కార్యకలాపాలుపజిల్స్, బ్రెయిన్ గేమ్స్ కాకుండా, మీ మెదడుకు ‘కొత్త’ అనుభవాలు ఇవ్వడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది. రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని మూడు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించడం, చిన్న గణిత సమస్యలను కాగితం–పెన్సిల్ లేకుండా లెక్కించడం, లేదా సాధారణ వస్తువులకు అసాధారణ ఉపయోగాలను కనుగొనడం వంటివి మెదడులో క్రియేటివ్, భాగాలను కలుపుతూ డైవర్జెంట్ థింకింగ్‌ను మెరుగుపరుస్తాయి. మళ్లీ మళ్లీ అదే ఆటలు ఆడే కన్నా, చిన్న కొత్త విషయాలే మెరుగైన న్యూరోప్లాస్టిసిటీని అందిస్తాయి.5. సంగీతంతో సరళతసంగీతం మనసుకు సాంత్వననిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గిటార్, పియానో లాంటి వాయిద్యాలను వాయించడం వల్ల మెదడులోని అనేక భాగాలు ఒకేసారి ఉత్తేజితమవుతాయి. ‘అరె... నాకే వాయిద్యమూ రాదండీ’ అని బాధపడకండి. బీట్‌కు సరిపడేలా వేలితో ట్యాప్ చేయడం వల్ల మెదడులోని మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, అటెన్షన్ భాగాలు యాక్టివ్ అవుతాయి. ఇది మీకు గణనీయమైన కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది.6. నలుగురితో మాట్లాడండిఐదు నిమిషాల సామాజిక సంభాషణలు మీ మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం, వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో, కొత్త విషయాలపై చేసిన సంభాషణలు మీ మెదడుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత పరిచయాల కన్నా వయస్సులో తేడా గలవారితో సంభాషణ వల్ల మెదడు కొత్త దృక్కోణాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరదా కబుర్ల కన్నా లోతైన సంభాషణలు మెరుగైన కాగ్నిటివ్ బెనిఫిట్స్‌ను అందిస్తాయి. వీడియో, ఫోన్ సంభాషణలు టెక్స్ట్ మెసేజెస్ కంటే నేరుగా మాట్లాడటమే మెరుగైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..
తొమ్మిది గుడులు.. తొమ్మిది అంకెలు. అటు చూసినా ఇటు చూసినా ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని అంకెలూ రావాలి. ఒక్కటీ మిస్ కాకూడదు, ఒకే అంకె మరోసారి రాయకూడదు. ఇవన్నీ సుడోకు(sudoku) ఆటలో నియమాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిత్యం ఆడే ఈ ఆటంటే పిల్లలతోపాటు పెద్దలకూ చాలా ఇష్టం. దీని వల్ల లెక్కల మీద ఇష్టంతోపాటు ఏకాగ్రత, దీక్ష పెరుగుతాయి. ‘సుడోకు’ జపాన్‌లో (Japan) చాలా ప్రసిద్ధి చెందింది. అయితే పుట్టింది మాత్రం అమెరికాలో. 1979లో హోవర్డ్ గాన్స్ అనే ఆయన దీన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇది పలు పత్రికల్లో ప్రచురితమైంది. అయితే 1986లో జపాన్‌కు చెందిన పజిల్ కంపెనీ ‘నికోలీ’ ఈ ఆటకు ‘సుడోకు’ అని పేరు పెట్టిన ప్రపంచమంతా తెలిసింది. ‘సుడోకు’ అంటే ‘ఒకే సంఖ్య’ అని అర్థం. సుడోకు ఆడాలంటే లెక్కలు తెలిసి ఉండాలని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి అదేమీ అక్కర్లేదని సుడోకు నిపుణులు అంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు గుర్తుపట్టగలిగేవారు ఎవరైనా సుడోకు ఆడొచ్చంటున్నారు. ఈ ఆట ఆడేందుకు గణితశాస్త్రంతో పని లేదని, కేవలం ఆలోచనాశక్తి చాలని వివరిస్తున్నారు.సుడోకులోనూ అనేక రకాలున్నాయి. జిగ్సా సుడోకు, సమురాయ్ సుడోకు, మినీ సుడోకు, లాజిక్ 5, కిల్లర్ సుడోకు.. ఇలా ఒకే ఆటని రకరకాలుగా ఆడతారు. పేరుకు ఆటే అయినా ఇది ఆడేందుకు ఒక్కరే సరిపోతారు. ఒకచోట కూర్చుని పెన్ను, కాగితం పట్టుకొని గడులు నింపడమే ఇందులో కీలకం. చదవండి: ఆమె ఇళయరాజానా లేక రెహమానా..? అంత చిన్న వయసులోనే..సుడోకు ఎలా ఆడాలి, తొందరగా ఎలా పూర్తి చేయాలి అనే విషయాలను వివరిస్తూ కొంతమంది పుస్తకాలు రాశారు. అలాగే సుడోకు పేపర్లతో నిండిన పుస్తకాలను మార్కెట్లో అమ్ముతుంటారు. త్రీడీ సుడోకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఫోన్లో సుడోకు ఆడేందుకు ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2006లో ఇటలీ(Italy)లో ప్రపంచ సుడోకు ఛాంపియన్(Championship) షిప్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ విన్నాక మీకూ సుడోకు మీద ఆసక్తి కలుగుతోందా? ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి ఆడేయండి. మెదడును పదునుగా మార్చుకోండి. -
తెలివితేటలు పెరగాలంటే మాత్రం..!
మాతృభాషపై ఎంత ప్రేమ ఉన్నా సరేగానీ, విదేశీ భాషలను నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. విదేశీ భాషలు నేర్చుకున్న వారిలో తెలివి తేటలు మెరుగవుతాయని, నేర్చుకునే భాషల సంఖ్య పెరిగేకొద్దీ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రాక్టికల్ గా తేలింది. యూరీ స్టైరోవ్ నేతృత్వంలోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీకి చెందిన రీసెర్చర్స్ బృందం విదేశీ భాషలపై బాగా అవగాహన ఉన్న 22 మంది(10 మంది బాలురు, 12 మంది బాలికలు) విద్యార్థులను ప్రశ్నించి, పరిశీలించి కొన్ని విషయాలను గుర్తించారు. వారి మాతృభాష పదాలు, విదేశీ భాషల పదాలను ప్లే చేసి ఎక్కువ భాషలు తెలిసిన విద్యార్థుల మెదడు పనితీరు చాలా వేగంగా ఉందని వెల్లడించారు. అధిక భాషలపై అవగాహన ఉన్న విద్యార్థులలో చురుకుదనం ఎక్కువగా ఉండి ఎక్కువ విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం ఉంటుందని ఎలక్ట్రాన్ సెఫలోగ్రఫీ(ఈఈజీ) ద్వారా హెల్సింకీ వర్సిటీ బృందం ప్రాక్టియల్ గా వివరించింది.