breaking news
Brahmin vellenla Project
-
కరువు నేలకు జల సవ్వడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువుకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కృష్ణమ్మ బిరబిరా తరలివచ్చి కరువు నేల దాహార్తిని తీర్చనుంది. దాదాపు 100 గ్రామాలను సస్యశ్యామలం చేయనున్న ఉదయసముద్రం (బ్రాహ్మణ వెల్లెంల) ఎత్తిపోతల ప్రాజెక్టులో కీలకమైన రిజర్వాయర్ నిర్మాణం పూర్తైంది. నీటిని ఎత్తిపోసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. కాల్వల తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు పూర్తికాగానే కరువు నేలపై కృష్ణమ్మ ఉరకలెత్తనుంది. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించటంతోపాటు భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్ సమస్యకూ పరిష్కారం లభించనుంది.వైఎస్ చొరవతో ప్రాజెక్టు మంజూరునల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పలు మండలాలకు జీవనాధారమైన ఈ ప్రాజెక్టును 2007లో ఎమ్యెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టుబట్టి సాధించారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి మంజూరు చేయించారు. బ్రాహ్మణ వెల్లెంల గ్రామ శివారులో 2007లో ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, రూ.699 కోట్లతో 2008లో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ఉదయసముద్రం నుంచి అప్రోచ్ చానల్, సొరంగం, పంప్‌హౌస్ నిర్మాణం, మోటార్ల ట్రయల్ రన్, 486 ఎకరాల్లో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి కీలక పనులు పూర్తయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఈ రిజర్వాయర్‌లోకి 0.302 టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇదీ..ఏఎంఆర్‌పీలో భాగంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పానగల్‌లోని ఉదయ సముద్రం రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. దాని పైభాగాన ఉన్న దండంపల్లి గ్రామం సమీపం నుంచి అప్రోచ్ చానల్ ప్రారంభమై 6.9 కిలోమీటర్ల దూరంలోని కట్టంగూరు మండలం పిట్టంపల్లి గ్రామం వద్దకు నీరు వస్తోంది. అక్కడి నుంచి 10.625 కిలోమీటర్ల పొడవున సొరంగం ద్వారా నీరు నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామం వద్ద ఉన్న సర్జ్పూల్కు చేరుతుంది. అక్కడి నుంచి రెండు మోటార్లతో 86 మీటర్ల ఎత్తుకు పంపింగ్ చేసి 1.12 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసిన రెండు డెలివరీ పైపుల ద్వారా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ప్రధాన కుడి, ఎడమ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పనులు కొంత వరకే అయ్యాయి. వాటికి సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపు, కాల్వల తవ్వకం, లైనింగ్ చేయాల్సి ఉంది. -
ఏడాదిలోగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి
నల్లగొండ రూరల్ : బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేస్తామని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి, ముషంపల్లి గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు. నల్లగొండ రూరల్ : ఏడాదిలోగా బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చందనపల్లి, ముషంపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. బ్రాహ్మణ వెల్లెంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సీఎం ను కలిసి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందిం చారన్నారు. రైతులకు ప్రతిఏటా 10 శాతం గిట్టుబాటు ధర పెంచాలని శాసనసభలో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దైద రజిత వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల రాధ లింగస్వామి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచ్‌లు లక్ష్మీశైలజ, భిక్షం, నోముల భవాని, రేఖ నాగయ్య, తంగేళ్ల హేమలత వెంకట్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, చింతల భిక్షం, బీరం గోపాల్‌రెడ్డి, తహసీల్దార్ వై.అశోక్‌రెడ్డి, ఏపీఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలి తిప్పర్తి : పదేళ్ల నుంచి ఇప్పటి వరకు ధాన్యానికి మద్దతు ధర పెంచకపోవడం రైతులను మోసం చేసినట్లేనని.. వెంటనే మద్దతు ధర పెంచాలని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని రాజుపేట గ్రామపంచాయతీ పరిధిలో గల జొన్నలగడ్డలగూడెంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ఉ ద్యోగులకు జీతాలు పెంచిన ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 70శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. శ్రీశైలం సొరంగమార్గం, బ్రాహ్మణ వెల్లెంల, పథకాలకు నిధులు కేటాయించడం, ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు రూ.400కోట్లతో లైనింగ్ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించడం హర్షణీయమన్నారు. కొత్తపల్లి వద్ద 57 ఎకరాలలో బత్తాయి మార్కెట్ పనులను ఈ నెల 20లోపు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో ఇప్పటికి 16ఐకేపీ కేంద్రాలు ప్రారంభమైనట్లు, మరో 25 కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ డెరైక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జూకూరు రమేష్, సర్పంచ్ పుల్లెంల సైదులు, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రామిరెడ్డి, మెరుగు వెంకన్న, అనంతరెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.