breaking news
br prasanna
-
19 మంది క్రీడాకారుల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ సెలెక్సన్స్ జిల్లా నుంచి 19 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. జిల్లాలో జూలైలో నిర్వహించిన సెలెక్సన్స్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, సెకండ్ ఫేస్ మంగళగిరిలో జరిగే సెలెక్సన్స్లో రాణించిన వారికి ఆంధ్రా అకాడమీలో చోటు దక్కుతుందన్నారు. అక్కడ అండర్–14కు ఎంపిౖకెన క్రీడాకారులు ఈ నెల 11 నుంచి 12 వరకు అండర్–16కు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 14న, అండర్–19కు ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18న హాజరు కావాల్సి ఉందన్నారు. అండర్–23 ఎంపికైన క్రీడాకారులు కూడా ఈ నెల 19న హాజరుకావాలన్నారు. ఎంపిౖకెన క్రీడాకారుల వివరాలు: అండర్–14 విభాగం అనీష్వీరారెడ్డి, భార్గవ్, విఘ్నేష్, శ్రీనివాసులు, మహీర్, భాస్కర్, మురళీ, లోహిత్‌సాయి, గణేష్‌రెడ్డి, భానుప్రకాష్, ప్రశాంత్ అండర్–16 విభాగం విష్ణువర్ధన్, నబిరసూల్, నరేష్, పవన్ కళ్యాణ్, చంద్రమౌళి అండర్–19 విభాగం శివగణేష్, సాయికుమార్, జగన్మోహన్ రెడ్డి -
13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 13న అండర్–16 బాలికల క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. కడపలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగే అండర్–16 బాలికల అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో పాల్గొనే అనంతపురం జిల్లా జట్టుకు 13న ఉదయం 9 గంటలకు అనంత క్రీడాగ్రామంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 1, 2000 సంవత్సరంలోపు పుట్టిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారిణులు యూనిఫాంతో హాజరుకావాలన్నారు.