breaking news
Boxing hall
-
అండర్-17 బాలికల విజేత నగ్మా
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర స్కూల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు అండర్-17 బాలికల 42 కేజీ విభాగంలో హైదరాబాద్ బాక్సర్ నగ్మా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కీర్తి ప్రియ (విజయనగరం) రజతం, వి.అఖిల (వరంగల్), రఫత్ (కృష్ణా) కాంస్య పతకాలను దక్కించుకున్నారు. ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో ఆదివారం ఈ పోటీలను హైదరాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి ఎ.సుబ్బారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ పోటీలకు 16 జిల్లాల నుంచి దాదాపు 250 మంది బాక్సర్లు పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: అండర్-17 బాలికల విభాగం: 42-44 కేజీలు: 1. రమీజ (అనంతపురం), 2.జి.అక్షిత (పశ్చిమ గోదావరి), 44-56 కేజీలు: 1. ప్రమీల (తూర్పు గోదావరి), 3.కృష్ణ వేణి (హైదరాబాద్), 3. పూజ (వరంగల్). 46-48 కేజీలు: 1.జ్ఞానేశ్వరి (విశాఖపట్నం), 2.అఖిల రెడ్డి (రంగారెడ్డి), 3. అక్షయ (వరంగల్). 48-50 కేజీలు: 1.హేమ (కరీంనగర్), 2.సోని (వరంగల్), 3.టి.గౌతమి (అనంతపురం), 3.ఎం.విజయలక్ష్మి (తూర్పు గోదావరి). 50-53 కేజీలు: 1.డి.తన్మయ యాదవ్ (హైదరాబాద్), 2.డి.నివేదిత (గుంటూరు). 59-62 కేజీలు: 1.మనిరేఖ (మెదక్), 2.కవిత (హైదరాబాద్), 3.సి.హెచ్.రమ్య (వరంగల్). -
చైతన్య ప్రసాద్‌కు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ వుషు టోర్నమెంట్లో బాలుర విభాగంలో చైతన్య ప్రసాద్(హైదరాబాద్) స్వర్ణం సాధించాడు. మహేష్ బిస్తి(రంగారెడ్డి) రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, శ్రీరామ్(నిజామాబాద్), గౌతమ్(రంగారెడ్డి) కాంస్య పతకం గెలుచుకున్నారు. రాష్ట్ర వుషు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో గురవారం ఈ పోటీలు ముగిశాయి. విజేతలకు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వుషు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎ.ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శి అబ్బాస్ పాల్గొన్నారు. ఫైనల్స్ ఫలితాలు: బాకి దౌషు ఈవెంట్: 1. వంశీ (నిజామాబాద్), 2. నితీష్ (పశ్చిమ గోదావరి), 3. ఫహారా ఖాన్(రంగారెడ్డి).