breaking news
Booth BJP
-
విశ్లేషణలన్నీ ఊహాత్మకం.. ఫలితాలు వాస్తవికం
సాక్షి, అమరావతి: ఇప్పుడు చేసే విశ్లేషణలన్నీ ఊహాత్మకమని, రాబోయే ఎన్నికల ఫలితాలు వాస్తవికమని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు చెప్పారు. ఎవరు బాగా పనిచేశారు.. ఎవరు బాగా పనిచేయలేదు.. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారనే సమాచారంతో సమగ్ర నివేదికలు పంపాలని వారికి సూచించారు. టీడీపీ నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, సేవామిత్రలు, ఇతర పార్టీ బాధ్యులతో గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బూత్, ఏరియా, నియోజకవర్గం వారీగా మూడు దశలుగా నివేదికలు పంపాలని, ఓటింగ్ పెరగడానికి దారితీసిన అంశాలు వివరించాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాల్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు, సర్వేలు ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ ఉపయోగపడ్డాయన్నారు. సీబీఎన్ ఆర్మీ బాగా పనిచేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఆర్మీగా పనిచేశారని తెలిపారు. తన జీవితంలో ఏ ఎన్నికలోనూ ఇంత పోరాటాన్ని ఎదుర్కోలేదన్నారు. అక్కడక్కడా కొందరు నాయకులు డ్రామాలాడారని, ఒకరిని మరొకరు విమర్శించుకోవడం సరికాదన్నారు. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్తకాదని, మోదీ దుర్మార్గాల మధ్య ఈ ఎన్నిక ప్రజల సహనానికి పరీక్షని, ఎన్నికల్లో ధన ప్రవాహానికి మొదటి ముద్దాయి మోదీయేనని చెప్పారు. ప్రతి ఎన్నికలో 80 శాతం ఓటింగ్ టీడీపీకే రావాలని, కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్ చీలకూడదని, ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలలో టీడీపీకే ఆదరణ ఉందని, ఇంకా యువతరాన్ని టీడీపీ వైపు మరింతగా ఆకట్టుకోవాల్సి ఉందన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి ఆర్ధికంగా అండగా ఉంటామని.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 1 నుంచి లోక్‌సభ స్థానాల సమీక్ష మే ఒకటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకూ 17(సి) నివేదికలు 19 వేలు వచ్చాయని, మిగిలిన నివేదికలను కూడా వెంటనే పంపించాలని చెప్పారు. 17(సి) ఈవీఎంతో పాటు ఉంటుందని, 17(ఏ) రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఉంటుందని, కౌంటింగ్ పూర్తయ్యేవరకూ అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని, పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల ఓట్లలో తేడాలున్నాయని, పోలైన ఓట్లలో పార్లమెంటుకు, అసెంబ్లీకి తేడాలున్నాయని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, కౌంటింగ్‌పై అవగాహన ఉండాలన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక పర్యటనల ద్వారా అక్కడి పార్టీలు, ప్రజలను చైతన్య పరిచానని, ఈవీఎంలపై అవగాహన పెంచామని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచేలా చైతన్యపరిచామన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లోనూ పర్యటిస్తానని తెలిపారు. -
రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా
రాయచూరు, న్యూస్‌లైన్ : రానున్న రోజుల్లో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, అవి తమ ఉనికిని కాపాడుకుంటూ బలోపేతం అవుతుండటమే దేశంలో తృతీయ శక్తిని తేటతెల్లం చేస్తోందని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అొ్కన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని పదవికి రాహుల్ గాంధీని ప్రతిపాదిస్తున్న కాంగ్రెస్, నరేంద్రమోడీని ప్రతిపాదిస్తున్న బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు గత 30-40 ఏళ్లుగా ఈ రెండు పార్టీల వ్యతిరేక ధోరణులతో విసిగిపోయి రాజకీయంగా పోరాడుతున్నాయన్నారు. ఈ ప్రాంతీయ పార్టీల శక్తే భవిష్యత్తులో తృతీయ శక్తికి గట్టి పునాది కానుందన్నారు. కాంగ్రెస్ ఆర్డినెన్స్ ద్వారా ఏర్పడిన సంక్షోభం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తీవ్ర సంకటానికి గురిచేసిందన్నారు. ఆయన అధికారంలో ఉండటం ఎంతవరకు సమంజసమని ప్రజలు విశ్లేషిస్తున్నారన్నారు. 2జీ స్పెక్ట్రం స్కాంలో చిదంబరానికి క్లీన్చిట్ ఇవ్వడంపై లోక్‌సభలో వివిధ పార్టీల సభ్యులు సీబీఐ తీరుపై మండిపడ్డారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రాంతీయ పార్టీలను విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ జేడీఎస్‌ను విడగొట్టేందుకు నిరంతరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ శక్తులకు వ్యతిరేకంగా పటిష్టమైన పోరాటాలతో తమ పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమన్వయ సమితి ద్వారా చేతులు, నోరు కట్టేస్తున్నారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. పాకిస్తాన్‌తో శాంతి సంబంధాల కోసం ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడి మధ్య చర్చలపై అడిగిన ప్రశ్నకు.. అమెరికా సూచన మేరకు చర్చలు సాగించేంత వైఖరిలో భారత్ ఉండరాదని అభిప్రాయపడ్డారు. ఒబామా మధ్యవర్తిగా పాక్‌తో చర్చలు సమంజసం కాదన్నారు. జిల్లాలో నారాయణపుర కుడిగట్టు కాలువను నిర్మించామన్నారు. కృష్ణా బీ.స్కీం నీటి వినియోగంలో ప్రభుత్వం దృఢ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కృష్ణప్ప, జిల్లాధ్యక్షుడు మహంతేష్ పాటిల్, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, మాజీ మంత్రులు, యువ నేతలు పవన్, ఎన్.శివశంకర్, తిమ్మారెడ్డి, ఎల్లప్ప, హరీష్ నాడగౌడ, తదితరులు పాల్గొన్నారు.