breaking news
books and facts
-
ట్రంప్ కలం నుంచి జాలువారిన అక్షరాలు
డొనాల్డ్ ట్రంప్ అనగానే వెంటనే గుర్తొచ్చేది అమెరికా అధ్యక్షుడిగానే కదా. ఆయన మంచి రచయితని చాలామందికి తెలియకపోవచ్చు. డబ్బు ఎలా సంపాదించాలి.. అందుకు ఎన్ని మార్గాలున్నాయి.. సమకూరిన డబ్బును ఎలా సమర్థంగా నిర్వహించాలి.. అనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని పుస్తకాలు రాశారు. ప్రముఖ పుస్తకం ‘రిచ్‌డాడ్ పూర్‌డాడ్’ రచయిత రాబర్ట్ టి కియోసాకీ వంటి వారితో కలిసి సహ రచయితగా కూడా ట్రంప్ కొన్ని పుస్తకాలు రాశారు. డబ్బుకు సంబంధించి ట్రంప్ రాసిన పుస్తకాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.1. 1987: ది ఆర్ట్ ఆఫ్ ది డీల్ అనే పుస్తకాన్ని టోనీ ష్వార్ట్జ్ తో కలిసి రాశారు.2. 2004: హౌటు గెట్ రిచ్3. 2004: థింక్ లైక్ బిలియనీర్: ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో ఎబౌట్ సక్సెస్, రియల్ ఎస్టేట్ అండ్ లైఫ్.4. 2005: సర్వైవింగ్ ఎట్ ది టాప్5. 2006: ట్రంప్ 101: ది వే టు సక్సెస్.6. 2006: వై వి వాంట్ యు టు రిచ్ - రాబర్ట్ టి కియోసాకితో కలిసి రాశారు.7. 2007: థింక్ బిగ్ అండ్ కిక్ ఆస్ ఇన్ బిజినెస్ అండ్ లైఫ్8. 2011: ట్రంప్ నెవర్ గివప్: హౌ ఐ టర్న్డ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్టు సక్సెస్.9. 2012: మిడాస్ టచ్: వై సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గెట్ రిచ్-అండ్ వై మోస్ట్ డోన్ట్-రాబర్ట్ టి కియోసాకి, మార్క్ బర్నెట్లతో కలిసి రాశారు.10. 2015: క్రిపుల్డ్ అమెరికా: హౌ టు మేక్ అమెరికా గ్రేట్ అగేన్డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చాలా వ్యాపారాను స్థాపించి సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆయన దృష్టి సారించిన కొన్ని కీలక వ్యాపారాలు కింది విధంగా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ట్రంప్ తండ్రికి చెందిన ట్రంప్ మేనేజ్మెంట్ కంపెనీతో రియల్ ఎస్టేట్‌లో తన వ్యాపార కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత దానికి ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. న్యూయార్క్ నగరంలోని ట్రంప్ టవర్, మియామిలోని ట్రంప్ నేషనల్ డోరాల్, ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగోతో సహా అనేక స్థిరాస్తులను అభివృద్ధి చేశారు.హోటల్స్ అండ్ రిసార్ట్స్వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, మియామీలోని ట్రంప్ నేషనల్ డోరాల్ సహా పలు హోటళ్లు, రిసార్టులను ట్రంప్ నిర్వహిస్తున్నారు.కాసినోలుఅట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా, ట్రంప్ తాజ్ మహల్ వంటి ప్రాపర్టీలతో ట్రంప్ క్యాసినో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అయితే, వీటిలో కొన్ని వెంచర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు దివాలా పిటిషన్ దాఖలు చేశాయి.గోల్ఫ్ కోర్సులున్యూజెర్సీలోని బెడ్మినిస్టర్లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్, స్కాట్లాంట్లోని ట్రంప్ టర్న్బెర్రీతో సహా ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌నకు అనేక గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి.లైసెన్సింగ్, బ్రాండింగ్ట్రంప్ వోడ్కా, ట్రంప్ స్టీక్స్, ట్రంప్ బ్రాండెడ్ దుస్తులు, ఇతర ఉపకరణాలతో సహా వివిధ ఉత్పత్తులు, సర్వీసులకు ట్రంప్ తన పేరుతో లైసెన్స్ తీసుకున్నారు.టీవీ షో2004-2015 వరకు అమెరికాలో ప్రసారమైన రియాలిటీ టీవీ షో ‘ది అప్రెంటిస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఇదీ చదవండి: తులం బంగారం ధర ఎలా ఉందంటే..ఇదిలాఉండగా, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ బుక్ ఫెస్టివల్‌కు నగరంలోని చాలా ప్రాంతాల నుంచి పాఠకులు వస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శన గడువు డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఉందని నిర్వాహకులు తెలిపారు. -
పుస్తకాల్లో వాస్తవాలు రాయరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాటం గురించి వెలువడిన పుస్తకాల్లో వాస్తవాలను పొందు పరచలేదని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. చాలా మంది వారి జీవితచరిత్ర, లేదా అనుభవాలను క్రోడీకరించి వెలువరించే పుస్తకాల్లో నిజాలు చెప్పరన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంపై దివంగత కమ్యూనిస్టు నేత చండ్ర రాజేశ్వరరావు రాసిన పుస్తకం కూడా కొంత తప్పుల తడకగా ఉందని, అయితే దీన్ని తాను ఉద్దేశపూర్వకంగా తప్పుపట్టడం లేదని చెప్పారు. శనివారం మఖ్దూం భవన్లో నారాయణ రాసిన వ్యాసాలను పొందు పరిచి రూపొందించిన ‘ఉద్యమకారుని డైరీ’ని అరసం కార్యదర్శి ఎస్వీ సత్యనారాయణ, అలాగే జూలూరి గౌరిశంకర్ రచించిన ‘నారాయణ పోరుయాత్ర’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తనపై వెలువడిన రెండు పుస్తకాలు భావితరాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానే తప్ప క్రిమినల్ ఆలోచనతో కాదని, అయినప్పటికీ అప్పుడప్పుడు తన మాటలు వివాదాస్పదం అవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రెండు ప్రాంతాల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో సీపీఐని టీఆర్ఎస్తో జట్టు కట్టకుండా, సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో సీపీఎం పొత్తు కుదరకుండా కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయన్నారు. చుక్కా రామయ్య మాట్లాడుతూ, నారాయణ తన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురాకపోయుంటే చారిత్రక తప్పిదం చేసినవారయ్యేవారని అన్నారు. కమ్యూనిస్టులు పలుచన కావడంతో దేశంలో ప్రమాదకరమైన ధోరణులు వస్తున్నాయని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, నారాయణ రాసే రచనలు, చేసే ఉద్యమాలను తెలంగాణ ప్రాంతం మరింత ఆశిస్తోందని, దీన్ని నిలబెట్టుకోవాలని ఆకాక్షించారు. నారాయణను వివాదాస్పద నాయకుడిగా చిత్రీకరించడాన్ని తాను విభేదిస్తానని నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. జూలూరు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వై.ఎస్.ఆర్.శర్మ, సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్, పాశం యాదగిరి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల తదితరులు పాల్గొన్నారు.