breaking news
bomb found
-
అకల్తక్త్ ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం
అమేథి: అమృత్సర్ నుంచి కోల్కతా వెళ్తున్న అకల్తక్త్ ఎక్స్ప్రెస్లో బాంబు కలకలం రేగింది. రైల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలు చేపట్టి బాంబును గుర్తించారు. ఉత్తరప్రదేశ్లోని అక్బర్గంజ్ రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి దాటాక బాంబు పెట్టారనే సమాచారంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే తనిఖీలు చేపట్టి గోనె సంచిలో మూటకట్టి ఉన్న పేలుడు పదార్థాలతో పాటు రెండు లైటర్లను స్వాధీనం చేసుకున్నారు. -
బయటపడిన రెండో ప్రపంచయుద్ధ బాంబు