breaking news
Bobbili constituency
-
గెలిచేది వైఎస్సార్సీపీ జెండా.. నిలిచేది జగన్ అజెండా
సాక్షి విజయనగరం: జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర గర్జించింది. అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య వైఎస్సార్ సీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర బొబ్బిలిలో అడుగుపెట్టింది. ఈ సందర్బంగా స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వైఎస్ఆర్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిదులుముచ్చటించారు. అనంతరం బొబ్బిలి జంక్షన్ వద్ద జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు. రుణాల మాపీపై బాబు పంగనామాలు పెట్టాడు, జగన్ టీడీపీ వదిలిన అప్పులు తీర్చారు - డిప్యూటీ సీఎం బూడి ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా ప్రజల కలలను సాకారం చేసారో ప్రజలు గమనిoచాలన్నారు. బొబ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు. ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. 25 మంది కేబినెట్ మంత్రులు ఉండగా, వారిలో 17 మంది బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకే కేటాయించారని గుర్తు చేసారు. గడిచిన ఎన్నికలలో ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నారన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పింఛన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్థాయి సంపన్నుల పిల్లలు ఎలా చదువుకుంటారో, పేదల పిల్లలు కూడా అలానే అభ్యసించాలని ప్రభుత్వ స్కూల్స్ ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మార్చారని వివరించారు. పేద విద్యార్థుల ఉజ్వల భవిత కోసం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే అనేక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసారని, బొబ్బిలి రాజుల పిల్లలే ఆంగ్లంలో చదువుకోవాలా, ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లలు చదువుకోకూడదా అని జగన్ నాడు - నాడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో బొబ్బిలిలో శంబంగి చిన అప్పల నాయుడును, రాష్ట్రంలో జగన్ ను మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ముత్యాల నాయుడు ఉద్గాటించారు. జగన్ ఆశీస్సులతో 11,500 ఎకరాలకు సాగునీరిచ్చాం. బొబ్బిలి రాజులు సొంత ఆస్తులు పెంచుకున్నారు - ఎమ్మెల్యే శంబంగి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 606 హామీలిచ్చి కనీసం ఆరు హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అర్హతలే ప్రతిపాదికగా తీసుకుని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుస్తున్నారని, కుల, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా అమలు చేస్తున్నారని వెల్లడించారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనా ఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే, ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించారని విమర్శించారు. గెలిచేది వైఎస్సార్ సీపీ జెండా... నిలిచేది జగన్ అజెండా - కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ, బొబ్బిలి అడ్డా.. జగన్ అన్న అడ్డాగా నిలిపి బొబ్బిలి కోటపై వైఎస్సార్ సీపీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఎప్పుడూ గెలిచేది వైెఎస్సార్ సీపీ జెండానే అని, ఎన్నడూ నిలిచేది జగన్ అజెండానే అని అభివర్ణించారు. జగన్ ను విమర్శించే టీడీపీ నాయకులకు తాను సవాల్ చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యథికంగా మేలు చేసినట్లు చెప్పే ధైర్యం తమకు ఉందని, అలా చెప్పే దమ్ము తెలుగు తమ్ముళ్లకు ఉందా అని సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందో, చంద్రబాబు ప్రభుత్వంలో మేలు జరిగిందో తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరారు. ఇది దళితుల, ఎస్టీల, బీసీల ప్రభుత్వమని, పేదల కోసం పాటుపడుతోందని వివరించారు. ఓట్ల కోసం ఇంటికి వచ్చే టీడీపీ నేతలను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసారో, ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని నిలదీయాలని పిలుపునిచ్చారు. చెరకు రైతులను టీడీపీ మోసం చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి వసూలు చేసి చెల్లించింది - జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, బొబ్బిలిలో సామాజిక సాధికార యాత్రకు వచ్చిన ప్రజానీకాన్ని చస్తుంటే జన సునామీని తలపిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మోసం చేసి ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్నారని, వారిని చెప్పే మాయ మాటలను నమ్మవద్దని హితవు పలికారు. చెరకు రైతులను షుగర్ ఫ్యాక్టరీ నిలువునా ముంచేసి మోసం చేస్తే వైెఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రూ. 35 కోట్లు యాజమాన్యం నుంచి ముక్కుపిండి వసూలు చేసి రైతులకు అందించామన్నారు. విజయనగరం జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల రూపు రేఖలు మారుస్తున్న ఘనత జగన్ దేనని కొనియాడారు. వెనుకబడిన వర్గాలన్నీ జగన్ సారథ్యంలో అథికారం అనుభవిస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ పనుల కోసం బొబ్బిలి రాజుల గేటు వద్ద కాపలా కాయాలని వివరించారు. తోటపల్లి, మడ్డువలస వంటి ప్రాజెక్టులను తీసుకువచ్చి రైతులను ఆదుకున్నామని, చెరకు రైతుల సమస్యలను పరిష్కరించి వారికి కూడా అండగా ఉంటామన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు జగన్ కే సాధ్యం - ఎంపీ బెల్లాన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పేదలకు చేరువ చేస్తున్నారన్నారు. సంక్షేమం ఓ వైపు, అభివృద్ధి మరోవైపున చేస్తూ జగన్ జనరంజక పాలన చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చి పాలనను ప్రజల చెంతకు తీసుకువచ్చి గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసిన ఏకైక నేత ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. -
వైఎస్సార్సీపీలోకి బొబ్బిలి కాంగ్రెస్ నాయకులు
* పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అధినేత * నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో వీరందరికీ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో గల తన నివాసంలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇంటి గోపాలరావు, సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సావు కృష్ణమూర్తినాయుడు, 12వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ లక్ష్మి భర్త దమ్మా అప్పారావు, 28వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రేజేటి కృష్ణవేణి కుమారుడు విశ్వేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మునకాల కృష్ణారావు, పాలవలస ఉమాశంకరరావు, ఇంటి గోవిందరావుతో పాటు యువజన నాయకుడు దిబ్బ గోపీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఇంటి గోపాలరావు మాట్లాడుతూ వై.ఎస్.జగన్ నాయకత్వ లక్షణాలు, పార్టీ సిద్ధాం తాలు, ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనుల నాయకత్వంలో జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకూ క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు. -
ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్ఆర్సీపీ
విజయనగరం మున్సిపాలిటీ : ప్రజల చేతిలో పాశుపతాస్త్రం వైఎస్ఆర్ సీపీ అని, వారి తరఫున పోరాటమే పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, వారి తరఫున ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి స్వగృహంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి త్వరలోనే జిల్లా కమిటీలను నియమిస్తామని, మరో నెల రోజుల వ్యవధిలో మండల, గ్రామ స్థాయి కమిటీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడంలో భాగంగా జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించినట్లు ప్రకటించారు. వీరు స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలతో చర్చించి గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తారన్నారు. ఇంతకుమందు నిర్వహించిన సమావేశంలో అందరి సూచనలు, సలహాలతో జిల్లా పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీల జాబితాలను రూపొందించినట్టు చెప్పారు. రాష్ట్ర పార్టీ ఆమోదం తరువాత వాటిని ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామన్నారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర మాట్లాడుతూ పింఛన్లు, ఎస్సీ,బీసీ కార్పొరేషన్ రుణాల లబ్ధిదారుల పరిశీలనకు... నిబంధనలకు నీళ్లొదలి, చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా కమిటీలను నియమించిన ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన ర్లపై 2వ తేదీన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తప్పుడు నివేదికలు ఇచ్చి, కమిటీలు నియామకం చేపట్టిన అధికారులను బాధ్యులు చేసి క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. స్థానికంగా అన్నీ తెలిసిన సామాజిక కార్యకర్తలను ఈ కమిటీల్లో నియమించాలని జీఓలు చెబుతుంటే, అధికారులు మాత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తల పేర్లను సూచించి కమిటీలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కమిటీల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ప్రజలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. కమిటీల నియామక విషయంపై అసెంబ్లీలో చర్చించిన సందర్భంలో సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘ మా పార్టీ ప్రభుత్వంలో ఉంది , మా ఇష్టం’ అని సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడవలసి ఉంటుందని, అవసరమైతే పోట్లాటకు సిద్ధమని చెప్పారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభా సమావేశాల్లో ప్రకటించారని, ఆ నిర్ణయానికి వారు కట్టుబడకుంటే శాసనసభను కించపరిచినట్లేనని విలేకరుల అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. సమావేశంలో కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ పథకాల కమిటీల్లో స్థానం కల్పించడం వల్ల సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై బాధ్యత వహించేది పార్టీ నాయకులా.. ప్రభుత్వమా అన్ని ప్రశ్నించారు. తమ పార్టీ మండల గ్రామ స్థాయి కమిటీలు నియమించటం ద్వారా ప్రజలకు మరింత చేరవవుతామన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, ఎస్‌కోట నియోజకవర్గ ఇన్చార్జ్ నెక్కల.నాయుడుబాబు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ జమ్మాన.ప్రసన్నకుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ అంబళ్ల.శ్రీరాములనాయుడు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపిల్లి సుదర్శనరావు, వేచలపు చినరామునాయుడు, మామిడి అప్పలనాయుడు, పతివాడ అప్పలనాయుడు , వల్లిరెడ్డి శ్రీను, జరజాపు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకులు వీరే.... కురుపాం - పువ్వల మాధవరావు పార్వతీపురం- ఎస్.పరీక్షిత్‌రాజు బొబ్బిలి - జరజాపు ఈశ్వరరావు సాలూరు- అవనాపు విజయ్ గజపతినగరం - మామిడి అప్పలనాయుడు ఎస్‌కోట- పీరుబండి జైహింద్‌కుమార్ విజయనగరం- అంబళ్ల శ్రీరాములనాయుడు నెల్లిమర్ల - జి.ఎస్‌రాజు, కడియాల రామకృష్ణ చీపురుపల్లి- గొర్లె వెంకటరమణ