breaking news
black variant
-
‘900 సీసీ బైక్ అయినా చక్కని శబ్దం’
సాక్షి, న్యూఢిల్లీ: కుర్రకారు జోష్‌కు తగ్గట్టు జపాన్‌కు చెందిన కవసాకి మోటార్ తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మంగళవారం ‘జడ్ 900 ఆర్ఎస్’ మోడల్లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 1970 ప్రాంతంలో ద్విచక్ర వాహనాల తయారీలో కొత్త ఒరవడి సృష్టించిన ఈ సంస్థ, అప్పటి థీమ్‌లను అనుసరించి ‘జడ్ 900 ఆర్ఎస్’ను తయారు చేయడం విశేషం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన క్యాండీ టోన్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి మంచి ఆదరణ లభించినందునే నలుపు రంగు మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా కవసాకి మేనేజింగ్ డైరెక్టర్ యుటకా యంషితా చెప్పారు. జపాన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ సంఖ్యలో తయారు చేసిన ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి భారతీయ సంపన్న వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 15.3 లక్షల రూపాయల (ఎక్స్ షోరూం) ధర గల ఈ బైక్ 900 సీసీ సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. బైక్ నడిచేప్పుడు వాహనదారుడికి గొప్ప అనుభూతినిచ్చేందుకు ధ్వని ట్యూనింగ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపారు. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా లోతైన ఎగ్జాస్టర్ (సైలెన్సర్) వల్ల ఇంజన్ శబ్దం ఆస్వాదించవచ్చని అన్నారు. అప్పటి మోడళ్లలో ఒకటైన జడ్1 ను అనుకరించి కొత్త మోడళ్లకు రూపకల్ప చేసినట్టు యంషితా పేర్కొన్నారు. జడ్ 900 ఆర్ఎస్ ఫీచర్లు: నాలుగు సిలిండర్లు గల ఇంజిన్ కవసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఎల్ఈడీ హెడ్ లైట్ మల్టీ ఫంక్షన్ ఎల్ఈడీ స్క్రీన్ -
రెడ్ మి నోట్ 4 బ్లాక్ ఈజ్ కమింగ్...
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ రెడ్ మీ నోట్ 4 లో కొత్త వేరియంట్ అమ్మకాలకు తెరలేపింది. రికార్డు అమ్మకాలతో దూసుకుపోయిన ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ వేయింట్ అమ్మకాలను భారత మార్కెట్లలో బుధవారం నుంచి ప్రారంభించింది. పాపులర్ రెడ్మీ నోట్ 4 లో బ్లాక్ వేరియంట్ ను లాంచ్ చేయనున్నట్టు గత వారం ప్రకటించింది. ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా ఈరోజు (మార్చి 1) మధ్యాహ్నం 12 గంటలకు ఈ విక్రయాలను ప్రారంభించనుంది. జనవరిలో లాంచ్ అయిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ హాట్‌కేకుల్లా అమ్ముడుబోయిన సంగతి తెలిసిందే. మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన కేవలం పది నిమిషాల్లోనే ఏకంగా 2.5 లక్షల ఫోన్లను విక్రయించినట్టు సంస్థ పేర్కొంది. రెడ్మీ నోట్ 4 మూడు వేరియంట్లలో లభిస్తోంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ.. 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ.. 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీతో ఇవి లభిస్తున్నాయి. ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999, రూ.12,999 ధరల్లో లభిస్తున్నాయి. రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 గ్రాఫిక్స్ 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 4.1 4100 ఎంఏహెచ్ బ్యాటరీ