breaking news
biometric process
-
సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే
బీజింగ్: సాధారణంగా కొత్త సిమ్ కొనాలంటే సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి బయోమెట్రిక్ స్కాన్, తగిన రుసుం చెల్లిస్తే చాలు. కానీ చైనాలో అలా కాదు. ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని స్కాన్ చేయించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్ చేయడంతో పాటు.. కళ్లు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్ దక్కుతుంది. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ చైనా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడే వారు తమ ఫోన్ల రిజిస్ట్రేషన్‌లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్‌లో నిబంధనలు తెచ్చింది. ఈ చర్యలన్నీ ఆన్లైన్ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడటం కోసమేనని ప్రభుత్వం అంటోంది. -
కేబీఆర్ పార్క్‌లో ‘బయోమెట్రిక్’ ప్రారంభం
బంజారాహిల్స్ (హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో బయోమెట్రిక్ విధానాన్ని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఎస్బీఎల్. మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ విధానంలో వాకర్లు పాస్ మర్చిపోతే వేలి ముద్ర ద్వారా లోనికి ప్రవేశించవచ్చన్నారు. బయోమెట్రిక్, బార్కోడ్, ఆర్ఎఫ్ఐడీ, పాస్వర్డ్ ఇలా నాలుగు విధాలుగా ప్రవేశించేందుకు వీలు కల్పించినట్టు తెలిపారు. మొత్తం 3,850 మంది వాకర్లకు బయోమెట్రిక్ బార్‌కోడింగ్ పాస్‌లను అందజేసినట్లు వెల్లడించారు. రెండు మెషిన్లు ప్రధాన ద్వారం వద్ద, మరో మెషిన్ రెండో గేటు వద్ద అమర్చామన్నారు. పార్కులో 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, కేబీఆర్ పార్కు తరహాలో హెచ్ఎండీఏ పరిధిలో మరో 10 పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు మిశ్రా చెప్పారు. ఇందుకోసం రూ. 50 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని చెప్పారు.