breaking news
bikini shot
-
సినిమాల్లో నిజాయితీ పనికిరాదు: సోనమ్ కపూర్
స్వేచ్ఛ కోసం పరితపించే సోనమ్ కపూర్.. ఇక మీదట మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంది. తాము చేసిన ప్రకటనలను తిప్పితిప్పి కావల్సినట్లు ఉపయోగించుకుంటారని ఇప్పుడు అంటోంది. సోనమ్ కపూర్ చేసిన బికినీ షాట్ వల్ల 'బేవకూఫియా' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆమె తండ్రి అనిల్ కపూర్ ఇటీవల అన్నాడు. అయితే, ''నాన్న ఎప్పుడూ అలా అనలేదు. ఆ ప్రెస్మీట్లో సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మా నాన్న అన్నట్లు నేను చెప్పానంతే. కానీ మర్నాడు పేపర్లలో చూస్తే నా బికినీ షాట్ ప్రధాన శీర్షికలలో కనిపించింది'' అని సోనమ్ వాపోయింది. దాంతో ఇకమీదట ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నట్లు చెప్పింది. తాను చెప్పిన విషయాల్లో చాలా వరకు అనువాద లోపం వల్ల రాకుండా పోయాయని, అయినా ఈ పరిశ్రమలో అసలు నిజాయితీ అన్నదే పనికిరాదని సోనమ్ తెలిపింది. సాధారణంగా స్క్రిప్టు డిమాండు చేయడం వల్లనో, డైరెక్టర్ చెప్పారనో తాను బికినీ వేసుకున్నట్లు హీరోయిన్లు తరచు చెబుతుంటారు. కానీ, సోనమ్ మాత్రం తనంతట తానే ఆ నిర్ణయం తీసుకున్నట్ల చెప్పింది. -
బికినీ షాట్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!
బేవకూఫియా అనే తాజా చిత్రంలో సోనమ్ కపూర్ టూ పీస్ బికినీ వేసుకుని ఓ దృశ్యంలో నటించింది. దీని గురించి అందరూ అమ్మో అనుకున్నారు గానీ.. ఆమె తండ్రి అనిల్ కపూర్ మాత్రం ఏమంత ఆశ్చర్యపోలేదట. పైపెచ్చు, ఈ దృశ్యం వల్ల సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని చెబుతున్నాడట. ''మా నాన్నకు బికినీ షాట్ గురించి తెలుసు. ఆయన కూడా నటుడే. ఆయన హృదయం చాలా విశాలమైనది. అసలు నన్ను సినిమాల గురించి ప్రోత్సహించింది ఆయనే. అందువల్ల బికినీ షాట్ గురించి ఏమీ అనలేదు'' అని సోనమ్ చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. మంచి పొడగరి అయిన సోనమ్ కపూర్.. ఒకప్పుడు చాలా లావుగా, బరువుగా ఉండేది. కానీ ఇప్పుడు టూ పీస్ బికినీ వేసుకోడానికి తగినంత సన్నగా, రివటలా తయారైంది. తాను ఎప్పటికప్పుడు బరువు పెరగడం, తగ్గడం చేస్తూనే ఉంటానని, ఇందుకోసం ప్రత్యేకంగా కష్టపడేది ఏమీ లేదని తెలిపింది. పైపెచ్చు ఈ సినిమాలో తాను సాధారణ అమ్మాయిగానే కనిపిస్తాను తప్ప ప్రత్యేకంగా ఉండనని చెప్పింది. ఈ సినిమాకు సంతకం చేసేటప్పుడే బికినీ గురించి తెలుసని, ఎటూ సన్నగానే ఉన్నాను కాబట్టి, సరే అన్నానని సోనమ్ తెలిపింది. ధూమ్, రేస్ లాంటి సినిమాల్లో అయితే హీరోయిన్ల శరీరం మీదే కెమెరా కళ్లు ఉంటాయని, ఇందులో అలా ఉండదని చెప్పింది. నూపుర్ ఆస్థానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించాడు.