breaking news
big brands
-
బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
-
బిగ్ బ్రాండ్స్ కు నో చెబుతున్న బాహుబలి
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించిన బాహుబలి-2తో ప్రభాస్ కు వచ్చిన కీర్తి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి హాలివుడ్ దాకా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. ప్రభాస్ పేరు ఇంతలా మారుమోగుతుంటే, బిగ్ బ్రాండ్స్ చడీచప్పుడు కాకుండా ఎలా కూర్చుంటాయి..! వెనువెంటనే తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా బాహుబలిని నియమించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించాయి. పెద్ద పెద్ద మొత్తంలో నగదును ఆఫర్ చేస్తూ తమ ప్రొడక్ట్ లకు ఎండోర్స్ చేసుకోవాలని కోరుతున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం వాటి ఆఫర్లను సుతిమెత్తంగా తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. 18 కోట్ల విలువైన అతిపెద్ద బ్రాండు ఎండోర్స్ మెంట్ ను ప్రభాస్ అంగీకరించలేదని ఆయన అధికార ప్రతినిధి చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ దగ్గరికి చాలా బ్రాండ్స్ వచ్చాయని, కానీ ఆయన వేటికీ అంగీకారం తెలుపలేదని పేర్కొన్నారు. బాహుబలి-2 షూటింగ్ సమయంలోనూ ప్రభాస్ ముందుకు 10 కోట్ల ఎండోర్స్ మెంట్ వచ్చిందని, అయితే సినిమాపైనే దృష్టిసారించిన ప్రభాస్ దాన్ని తిరస్కరించినట్టు రాజమౌళి కూడా తాజాగా రివీల్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎఫెక్ట్ తో ప్రభాస్ కీర్తి కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, భారీ అవకాశాలు ఆయన ముంగిట్లో వాలుతున్నాయి. అయితే తన సొంత కమిట్ మెంట్స్ కే ప్రభాస్ తొలి ప్రాధాన్యమిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మూడు భాషల్లో తెరకెక్కుతున్న సాహోపైనే ప్రభాస్ దృష్టిసారించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.. జూలైలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది. కొంతమంది టాప్ బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ హౌజ్ లు ప్రభాస్ ముందుకు కొత్త స్క్రిప్టులతో వస్తున్నారట. -
కబాలి మానియాలో బిగ్ బ్రాండ్స్
విడుదలకు ముందే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి ఫీవర్ ఓ రేంజ్ లో పెరుగుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు పెద్దపెద్ బ్రాండ్లన్నీ తమదైన శైలిలో పోటీ పడుతున్నాయి. ఓ వైపు కబాలి మానియాలో రజనీ అభిమానులు మునిగి తేలుతోంటే.. మరోవైపు బిగ్ బ్రాండ్స్ కూడా సౌత్ ఇండియా సూపర్ స్టార్ పై అభిమానాన్ని, ఇటు వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్ టెల్..అమెజాన్, క్యాడ్ బరీ ఫైవ్ స్టార్, ఎయిర్ ఆసియా, ఇమామి,షాప్ సీజె, ముత్తూట్ ఫైనాన్స్ కొన్ని ప్రత్యేక ఆఫర్లతో మార్కెట్ లోకి వస్తున్నాయి. ఇపుడు తాజాగా కబాలి క్రేజ్ ను కేరళకు చెందిన ప్రముఖ ఫైనాన్స్ సంస్థ ముతూట్ ఫిన్ కార్ప్, అమెజాన్ కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నాయి.. ముత్తూట్ సంస్థ కబాలి (ఎంబోజ్ చేసిన రజనీ కాంత్ బొమ్మ) వెండి నాణేలు రిలీజ్ చేసింది. 5, 10 ,20 గ్రాములున్న వెండి నాణేలను ఈ సంస్థ మార్కెట్ లో ప్రవేశపెడుతోంది. వీటి ధర రూ.350 , రూ 700, రూ.1400 గా ఉన్నాయి. వీటిని శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాకే తమ అన్ని బ్రాంచెస్ లో వీటి డెలివరీ ఉంటుందని ముతూట్ సంస్థ ప్రకటించింది. అలాగే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కబాలి కీ చైన్లు, మైనపు బొమ్మలు, పోస్టర్లు, ఫోటోలను ప్రీమియం ధరల్లో ప్రవేశపెట్టింది. వీటిని రూ. 90 నుంచి రూ. 400 మధ్య అందిస్తోంది. కబాలి రిలీజ్ డే నాడు బెంగళూరు - ముంబై నగరాల నుంచి రజనీ అభిమానులను చెన్నైకు స్పెషల్ ఫ్లైట్స్ లో వచ్చి సినిమాను వీక్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రెడీ అయ్యాయి. ఫ్లై లైక్ ఏ సూపర్ స్టార్ అంటున్న ఎయిర్ ఆసియా, ప్రత్యేక కబాలి మెనూను కూడా అందిస్తోంది. ఫ్లైట్స్ మీద సైతం కబాలి పోస్టర్లు దర్శనమివ్వడం చూశాం. అలాగే కబాలి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ ప్రత్యేకంగా సిమ్ ను విడుదల చేయడంతో పాటు రకరకాల ప్యాకేజీలు రూపొందించింది. కబాలి రిచార్జ్ ప్యాక్, సిమ్ ప్యాక్, పాపులర్ డైలాగులు, పాటలతో హలో ట్యూన్స్ ను ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కబాలి ఎయిర్టెల్ సిమ్ లు విరివిగా దొరుకుతున్నాయి. వినియోగదారుల ప్రత్యేక ఎస్ఎంఎస్ చానల్ ద్వారా ఇచ్చిన సెలెక్టెడ్ మెసేజ్ లతో కాఫీ టేబుల్ బుక్ తయారు చేసి రజనీకాంత్ అందించనున్నట్టు భారతీ ఎయిర్ టెల్ (తమిళనాడు అండ్ కేరళ)సీఈవో జార్జ్ మాథెన్ ప్రకటించారు. అటు కబాలి చిత్రనిర్మాతలు కూడా ఇదే రేంజ్ లో సినిమాను ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటుగా యూత్ ను టార్గట్ గా కబాలి ప్రత్యేక కప్పులు,కీ చెయిన్లు, ఫోన్ కవర్లు, టీ షర్టులు తదితర మార్కెట్లో హల్ చల్ చేస్తున్న సంగతి సరేసరి. కాగా రిలీజ్ కు ముందే ఇంత భారీ హైప్ క్రియేట్ కబాలి...ముందు ముందు ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.. ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.