breaking news
bichkand
-
మద్యం రవాణాపై డేగ కన్ను
బిచ్కుంద, న్యూస్‌లైన్ : రానున్న ఎన్నికల నేపథ్యంలో మ ద్యం అక్రమ రవాణాపై పొలీసులు దృషి సారించారు. మ హారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల వెంట జుక్కల్ నియోజకవర్గంలో మద్యం ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణా లేకుండా పొలీసులు డేగ కన్ను ఉంచారు. ఎన్నికల్లో మద్యం సరఫరాను అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నిర్ధేశిత మద్య దుకాణాలకే సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోరినంత మద్యం అందడం లే దు. మద్యం కొరత ఏర్పడింది. అయినా కొందరు అడ్డదారుల్లో మద్యం రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యం గా చెక్‌పోస్టుల దగ్గర ఎవరికి అనుమానం రాకుండా కాలినడకతో పొలాల నుంచి వెళ్లి చెక్‌పోస్టు దాటిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి మద్యం దిగుమతికి ఎత్తులు వేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో మండల కేంద్రాల్లో ఉన్న వైన్స్‌ల్లో నిర్దేశిత స్టాక్ ఉంది. దీంతో ఎన్నికల ముందు కోరినంత మద్యం అందడం కష్టంగా మారింది. ఇప్పటి నుంచే వ్యాపారులు మద్యం సేకరించి రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్‌పోస్టుల ఏర్పాటు.. మద్యం అక్రమ రవాణా ఎత్తులను చిత్తు చేసేందుకు పొలీ స్ అధికారులు సన్నద్ధమయ్యారు. ఏ మార్గం ద్వారానైనా మద్యం రవాణాను నిరోధించేందుకు నిఘాను తీవ్రతరం చేశారు. ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా సరిహద్దు కల్హెర్ మండలం మాసన్పల్లి గేటు వద్ద, కర్ణాటక సరిహద్దులో జుక్కల్ మండలం గుల్లా, చండేగాం, సోమూర్, పిట్లం మండలం గోద్మెగాం, తిమ్మనగర్, మహారాష్ట్ర సరిహద్దు ఎస్ఎన్ఏ రోడ్డు మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద పొలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమ మద్యాన్ని అడ్డుకుంటాం.. ఎన్నికల సందర్భంగా అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిఘా కట్టుదిట్టం చేశాం. నిఘాను పెంచాం. అక్రమ వ్యాపారుల మార్గాలను నిరోధించి తీరుతాం. నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో అక్కడక్కడ 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్నిరకాలుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నాం. రాత్రివేళ్లల్లో ప్రత్యేక దృష్టి పెట్టాం. - వెంకటేశం, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి సీఐ, బిచ్కుంద. -
అంతులేని శోకం
బిచ్కుంద, న్యూస్‌లైన్ : నాందేడ్-సంగారెడ్డి ప్రధాన రహదారిపై జుక్కల్ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే ప్రమాదంలో ఐదుగురు మరణించడంతో స్థానికులు కలత చెందారు. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్షతగాత్రులకు చికిత్సనందిస్తున్న ఆస్పత్రుల వద్ద రోదనలు మిన్నంటాయి. బిచ్కుంద మండలం పెద్ద కొడప్గల్ నుంచి మద్నూర్వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన నాలుగు కుటుంబాలలో తీరని శోకాన్ని తెచ్చి పెట్టింది. బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లికి చెందిన రాజు (34), వెంకట్ లు కలిసి ఆదివారం నిజాంసాగర్ మండలంలోని మహ్మద్‌నగర్ వెళ్లారు. అక్కడ శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆటో బోల్తా పడడంతో రాజు మృత్యువాత పడగా, వెంకట్ గాయాలపాలయ్యారు. మద్నూ ర్ మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(38), గంగవ్వ(36), మొగ గ్రామానికి చెందిన బస్వంత్(32) తన కూతురు అనుష్క(2)ను తీసుకొని పెద్దకొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. పిల్లలను చూసి, ఆటోలో స్వగ్రామాలకు పయనమయ్యారు. అంతలోనే ప్రమాదం ముంచుకువచ్చి, అనంతలోకాలకు చేరారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం బిచ్కుంద, బాన్సువాడ, జిల్లా కేంద్ర ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రిలో అందని వైద్యం బిచ్కుంద ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడు లేకపోవడంతో గాయపడినవారికి వైద్యం అందలేదు. స్థానిక ఆర్ఎంపీలు, పీఎంపీలు వచ్చి ప్రథమ చికిత్స అందించారు. వైద్యం అందక క్షతగాత్రుల అరుపులు, కేకలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. రోదనలు చూసి స్థానికులు చలించిపోయారు. ఆందోళనకు దిగిన స్థానికులు ఆస్పత్రిలో క్షతగాత్రులకు సరైన వైద్యం అందకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు, మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. మృతుల కుంటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. బాన్సువాడలో కాకుండా బిచ్కుందలోనే పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టారు. తహశీల్దార్ రామారావు, సీఐ వెంకటేశం వారికి నచ్చజెప్పారు. బిచ్కుందలోనే పోస్టుమార్టం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


