breaking news
Bhumareddy
-
విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తా
పాడి పరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పాడి రైతుల సంక్షేమం కోసం విజయ డెయిరీ పునర్ వైభవానికి కృషి చేస్తానని కొత్తగా నియమితు లైన తెలంగాణ పాడిపరిశ్రమ సహకారాభివృద్ధి సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి స్పష్టం చేశారు. బుధ వారం హైదరాబాద్ లాలాపేటలోని విజయభవన్‌లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. విజయభవన్ ఎదుట ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. పాడి రైతులను ఆదుకునే క్రమంలో లీటరు పాలపై రూ. 4 ప్రోత్సాహాకాన్ని సీఎం అందిస్తున్నారని లోక భూమారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి.నగేశ్, శాసనసభ్యులు బాపూరావు, విఠల్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు పురాణం సతీశ్, సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ డీసీసీ బ్యాంకు అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ముఠాగోపాల్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్ర మంలో కార్మిక సంఘం నాయకులు యాదయ్య, విజయ డెయిరీ అధికారుల సంఘం అధ్యక్షుడు మోహన్‌మురళి, జీఎంలు దేవీదాస్, ప్రవీణ్, రమేశ్, డీడీలు మధు సూదన్‌రావు, కృష్ణస్వామి, వివిధ జిల్లాల నుంచి పాడి రైతులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
నిజామాబాద్ నాగారం : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా భూమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక తిలక్‌గార్డెన్‌లో గల న్యూఅంబేద్కర్ భవనంలో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయులతో ఎస్జీఎఫ్ కార్యదర్శి నియామకంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యదర్శి పదవికి పోటీలో ఆరుగురు నిలిచారు. అందరు ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు.. కానీ గతంలో నుంచి ఇప్పటి వరకు కార్యదర్శిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, ఇప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, దీనికి సహకరించాలని డీఈఓ శ్రీనివాసాచారి సూచించారు. దీనికి కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో పలువురి అభిప్రాయాలు తీసుకున్నారు. కార్యదర్శి పోటీలో ఉన్నవారు స్టేజీ మీదకు వచ్చి జాయినింగ్, సీనియారిటీ వివరాలు చెప్పాలని, తప్పుడు సమాచారం చెప్పితే సస్పెండ్ చేస్తానని అన్నారు. దీంతో వరుసగా జి.వి.భూమారెడ్డి, ఎం లక్ష్మీనారాయణ, వి.గంగాధర్, ఎం. నాగమణి, రసూల్ తదితరులు వచ్చారు. వీరి సీనియారిటీని డీఈఓ పరిశీలించారు. సీనియారిటీలో ముందున్న జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న జి.వి భూమరెడ్డి(పీడీ)ని జిల్లా కార్యదర్శి పదవికి ఏక గ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అందరు చప్పట్లతో అభినందనందించారు. జిల్లాకు పతకాలు తీసుకురావాలి వ్యాయామ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని డీఈఓ సూచించారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఇంతవరకు జానకీరాం కొనసాగారని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా చాలా బాగా పనిచేశాడని డీఈఓ అభినందించారు. పిల్లలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడించి పతకాలు, జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేవిధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. రోజు రెండు పిరియడ్లు బోధించాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాయామ విద్యపై తప్పని సరిగా అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం పీఈటీ, పీడీలు ప్రతి రోజు రెండు పీరియడ్లు విద్యార్థులకు వ్యాయమ విద్యా, ఆరోగ్యంపై అవగాహ న కల్పించాలన్నారు. అలాగే సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పిల్లలకు విధిగా ఆటలు ఆడించాలన్నారు. పిల్లల దగ్గర నుంచి రూ.3చొప్పున వసూలు చేసి కార్యదర్శికి అందించాల న్నారు. అనంతరం డీఈఓ నూతనంగా ఎన్నికైన ఎస్జీఎఫ్ కార్యదర్శి భూమరెడ్డిని అభినందించారు. అలాగే జానకీరాంను కూడా సన్మానిం చా రు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ పోచాద్రి, జా యింట్ సెక్రటరీ మల్లెష్గౌడ్, సభ్యులు శివరాజ్, మోహన్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, అనురాధ తదితరులు పాల్గొన్నారు.