breaking news
beskam employees
-
'కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి' ఆప్తులమంటూ నమ్మించి.. మోసం!
కర్ణాటక: బెస్కాంలో మీటర్ రీడర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు దండుకొని నకిలీ నియామక పత్రాలు జారీ చేసి పంగనామం పెట్టిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో వెలుగు చూసింది. పదో తరగతి, ఐటీఐ పాసైన 15 మంది నిరుద్యోగ యువకుల నుంచి దేవదుర్గ తాలూకా గబ్బూరుకు చెందిన సురేష్, బసప్ప, నేతాజీ, వేణు, హసన్ అనే వ్యక్తులు తాము కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆప్తులమంటూ నమ్మించి డబ్బు వసూలు చేశారు. అనంతరం బెంగళూరు ఎంఎస్ భవన్లో అభ్యర్థులకు నకిలీ ఇంటర్వ్యూలు జరిపించారు. అనంతరం ఐడియా ఇనఫిటి కంపెనీలో శిక్షణకు సిఫార్సు చేసినప్పుడు అసలు బండారం బయట పడింది. లింగసూగూరుకు చెందిన విక్రం సింగ్ రూ.13 లక్షలు, శరణప్ప రూ.12 లక్షలు, ప్రభుగౌడ రూ.9 లక్షలు, ఆనంద్ రూ.6 లక్షలు, దేవరాజ్ రూ.12 లక్షలు, బలరాం రూ.12 లక్షలు, వెంకట సింగ్ రూ.12లక్షలు, రాజు రూ.7 లక్షలు, రాహుల్ రూ.7లక్షలు, ముస్తాఫా రూ.3 లక్షలు ఇచ్చినట్లు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యే రమేశ్ కుమార్‌పై విద్యుత్ ఉద్యోగుల కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కోలారు జిల్లా శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తమపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇక్కడి కేపీటీసీఎల్ కార్యాలయం వద్ద బెస్కాం ఉద్యోగులు సోమవారం ప్రదర్శన చేపట్టారు. ఆయన శాసన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత వారం కోలారులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యలపై స్పందించని విద్యుత్ ఉద్యోగులను చెట్టుకు కట్టేసి కొట్టాలని, ఆహారం, నీరు అందకుండా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఇలా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయవచ్చునా అని ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వ్యవహార శైలిని మార్చుకోవాల్సిందిగా ఆయనను హెచ్చరించాయి.