breaking news
Benami loans
-
ఉన్నదంటే ఉలికిపాటెందుకు ఎల్లోమీడియా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లోమీడియా వ్యవహారం మితిమీరుతోంది. బాబుపై వారి భక్తి హద్దులు దాటుతోంది. జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చేసిన ఎల్లోమీడియా ప్రతినిధులు మరింత దిగజారిపోయి వ్యక్తిత్వ హననానికి, అనుచిత, దారుణమైన భాషను వాడుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విషయం ఏమిటంటే.. అమరావతి మలిదశ భూసేకరణపై జగన్ ‘‘తొలిదశకే దిక్కులేదు.. మళ్లీ రెండో దశ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు’’ అని అనడం మాత్రమే. రెండు గంటలపాటు సాగిన ప్రెస్మీట్లో భోగాపురం విమానాశ్రయంపై బాబు క్రెడిట్ చోరీ మొదలుకొని అనేక అంశాలపై జగన్ మాట్లాడితే.. వాటన్నింటినీ వదిలేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక్క రివర్ బేసిన్ అన్న పదాన్ని పట్టుకుని తమ ఊహాశక్తినంతా జోడించి కథలల్లాయి! పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. మొత్తం సమస్యను పక్కదారి పట్టించేందుకు విశ్వయత్నం చేశాయి. ఆ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చేయవచ్చు. విశ్లేషించవచ్చు. అంతేకానీ దారుణమైన భాషతో విమర్శిస్తారా? జగన్ చెప్పిందేమిటి? దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేసిందెలా? అన్నది విశ్లేషిద్దాం. చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రకటించారని జగన్ చాలాకాలంగా ఆధారాలతోసహా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వ పెద్దలపై కేసులు కూడా పెట్టారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో రాజధాని పేరుతో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఇంత పెద్ద ఎత్తున భూముల సమీకరణ అవసరమా? అని ప్రశ్నించారు కూడా. అంతేకాదు అమరావతి ఒక కుల రాజధానిగా మారుతోందని కూడా విమర్శించారు. ఎల్లోమీడియా ఈ విమర్శలను ఎప్పుడూ తమ కథనాల్లో ప్రస్తావించలేదు. తొలి దశలో సేకరించిన ఏభై వేల ఎకరాల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజి తదితర సదుపాయాల కల్పనకు ఎకరాకు రూ.రెండు కోట్లు ఖర్చు టీడీపీ ప్రభుత్వం గతంలోనే నివేదిక ఇచ్చిందని జగన్ చెప్పారు. ఇది అసత్యం కాదు కదా! ఇప్పుడు మరో ఏభై వేల ఎకరాలు తీసుకుంటే మౌలిక వసతుల కల్పనకే రూ.రెండు లక్షల కోట్లు అవుతుందని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు గతంలో చెప్పిన లెక్కే! రాజధాని పెద్ద స్కామ్అని, చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారని ఆయన విమర్శించారు. రాజధానిగా విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతాన్ని ఎంపికి చేసిఉంటే ఇప్పటికే మహానగరంగా అభివృద్ధి అయ్యేదని జగన్ అన్నారు. ఇది వాస్తవమే కదా! చాలామంది నాగార్జున యూనివర్శిటీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో రాజధాని భవనాల నిర్మాణం చేయాలని సూచించారు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములను పాడు చేయవద్దని కూడా చాలామంది స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా ఈ ప్రదేశంలో రాజధాని వద్దన్నది. అయినా చంద్రబాబు వినలేదు. ఇప్పుడు జగన్ అన్నదేమిటి? చంద్రబాబు రివర్ బేసిన్లో రాజధాని కడుతున్నారు, దీనిపై సుప్రింకోర్టు కూడా దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు.రాజధాని కోసం ప్రస్తుతం తీసుకున్న 29 గ్రామాల పరిధిలోని భూమిలో అత్యధికం అటు కృష్ణా నదికి, ఇటు కొండవీటి వాగు, తదితర వాగుల మధ్య ఉన్న ప్రదేశం. నల్ల రేగడి నేల అవడంతో రాఫ్ట్ టెక్నాలజీని అమలు చేస్తున్నారని, పునాదుల నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి లు జగన్ మళ్లీ విషం కక్కారంటూ నానా చెత్త అంతా రాశారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అమరావతి ప్రాంతం రాజధానికి అనువు కాదని ఎందుకు అన్నారు? దానిపై వీరు ఎన్నడైనా స్పందించారా? టీడీపీ మద్దతుదారుగా పేరున్న మాజీ పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు రెండో దశ భూ సమీకరణను ఎందుకు వ్యతిరేకించారు? జగన్ రైతుల కష్టాల గురించి, వారికి రిటర్నబుల్ ప్లాట్ల ఇప్పటికీ ఇవ్వకపోవడం గురించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం లేక ‘రివర్ బేసిన్’ అన్న పదాన్ని పట్టుకుని నానా యాగి చేశారు. ఈనాడు మీడియా అయితే ఏ, ఏ నగరాలు నదుల ఒడ్డున ఉన్నాయో చెబుతూ పెద్ద కథనాన్ని రాసేసింది. అదే టైమ్‌లో ఆ నగరాలలో ఎక్కడైనా వరద ఎత్తిపోసే స్కీములు ఉన్నాయా? అన్నది చెప్పలేదు. వేల కోట్ల ఖర్చు చేసి మూడు, నాలుగు వరద నీటి ఎత్తిపోత పథకాలను పెడుతున్న నగరంగా అమరావతి కొత్త రికార్డు సృష్టిస్తుందేమో! అంతేకాదు.. చదరపు అడుగుకు రూ.తొమ్మిది వేల నుంచి పది వేల వరకు ఖర్చుపెట్టడం కూడా మరో రికార్డే. జగన్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రతిపాదించినప్పుడు ఈనాడు మీడియా ఏకంగా సముద్రమే ముందుకు వచ్చేస్తోందంటూ తప్పుడు కథనాలు రాసింది.అది విషం చిమ్మడం కాదా? విశాఖ నగరంలో వరద ఎత్తిపోసే పరిస్థితి ఎక్కడైనా ఉందా? మరి అమరావతిలో ఎందుకు ఉంది? అంటే నేల స్వభావం, భౌగోళికంగా ఉండే పరిస్థితిని బట్టి ఆ ప్రాంతం వరద ముంపును గురవుతుంది. ఈ విషయం చెప్పినంత మాత్రాన పెద్ద తప్పు చేసినట్లు దుర్మార్గంగా ప్రచారం చేస్తుంటారు. ఒక రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ గుండెపోటుకు గురై చనిపోతే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా ఒక్క ముక్క రాయలేకపోయింది. అమరావతిపై ఏదైనా అభిప్రాయం వ్యక్తం చేస్తే విషం కక్కినట్లా? నిజానికి ఏపీ ప్రజలను ముఖ్యంగా అమరావతి రైతులను మోసం చేయడానికి ఈ మీడియా ఈ డైవర్షన్ రాజకీయం చేసిందన్నది బహిరంగ రహస్యమే. జగన్ పేరుతో అబద్ధాలు సృష్టించి, వదంతులు వ్యాప్తి చేసి, అమరావతి రైతులను భయపెట్టడమే వీరి లక్ష్యం. అమరావతికి ఏదో అయిపోతుందని భ్రమ కల్పించి, రైతులు తమ సమస్యల గురించి చెప్పకుండా చేయడానికి జరుగుతున్న కుట్ర తప్ప ఇది మరొకటి కాదు. జర్నలిజాన్ని తాకట్టు పెట్టి నీచపు రాతలు రాయడానికే ఎల్లో మీడియా కంకణం కట్టుకుందని పదే, పదే రుజువు చేసుకుంటోంది.చివరిగా ఒక మాట. ఎవరు బాధపడినా భవిష్యత్తు నగరంగా అమరావతి అవుతుందని చంద్రబాబు అన్నారు. ఆయన చెబుతున్నది ఎలా ఉందంటే ఎందరిని బాధ పెట్టి అయినా తమ పని పూర్తి చేసుకుంటామని చెప్పినట్లు ఉందని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను కాదనగలమా?అవును నష్టపోతున్న రైతుల బాధలు ప్రభుత్వ పెద్దలకు ఎందుకు పడతాయి! -
కొనసాగిన బినామీ రుణాల విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంల రావివలస పీఏసీఎస్‌లో బినామీ రుణ గ్రహీతల విచారణ నాలుగో రోజూ కొనసాగింది. శుక్రవారం జరిగిన విచారణకు 134 మందికి నోటీసులు జారీ చేయగా 76మంది హాజరయ్యారు. పీఏసీఎస్ కార్యాలయానికి విచారణకు వచ్చిన బాధితులు డీసీసీబీ అధ్యక్షురాలు మరిశర్ల తులసి, సర్పంచ్ బలరాం నాయుడు, సీఈఓ సింహాచలంలను అరెస్ట్‌చేయాలంటూ...నినాదాలు చేస్తూ..కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. బాధితులు కార్యాలయంలోనికి రాకుండా ఎస్సై డి.ఈశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కార్యాలయం ఆవరణ లో ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అప్పు కావాలంటే కుంటి సాకులు చెప్పి...కాళ్లరిగేలా తిప్పించే పీఏసీఎస్‌లు...తాము కోరకుండా..తామెవరో తెలియకుండా..సభ్యత్వ నమోదు లేకుండానే.. తమ పేరున రూ.75వేలు రుణాలున్నట్లు...విచారణకు హాజరు కావాలంటూ...నోటీసులివ్వడం పట్ల బాధితుల ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ సందర్భంగా చిలకాంకు చెందిన ద్వారపురెడ్డి సత్యనారాయణ, రావివలసకు చెందిన కోట సుమన్, కారివలసకు చెందిన పట్టా లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ బినామీ రుణాలు వాడేసి ఎవరి కొంప ముంచేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎస్సై వారికి నచ్చచెబుతూ..విచారణ పూర్తి అయినవెంటనే ఏఎస్పీ ఇచ్చిన హామీ ప్రకారం దోషులు ఎంతటివారినైనా చట్టం శిక్షిస్తుందన్నారు. అనంతరం వారు రుణాల జాబితా కోరగా 4,514 మందికి సంబంధించిన రుణ జాబితాను అందజేశారు. దీంతో బాధితులు శాంతించారు. తర్వాత విచారణ కొనసాగింది. అప్పు ఎలా తీర్చాలి ఈ సందర్భంగా విచారణకు వచ్చిన వారిలో దత్తివలసకు చెందిన దత్తి కాం చన మాట్లాడుతూ కుంటిదాన్ని. నాకు లోనేటి బాబు. ఇప్పుడెలా తీర్చాలి ఆ లోనం టూ.. గుండెలవిసేలా రో దిస్తుంటే...చుట్టూ ఉన్నవారంతా ఆవేద న చెందారు. బిక్షమెత్తే నాకు లోనా! ఊరూరా...ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకుని పూటగడుపుతున్న తనకు లోనేంటని విచారణకు హాజరైన వారిలో చిలకాం గ్రామానికి చెందిన మారెడ్డి పార్వతి అనే యాచకురాలు వాపోయింది. ఆమె ఆవేదన అక్కడున్నవారందర్నీ కలచివేసింది.


