నెల క్రితమే పెళ్లి.. నేడు దర్శకుడి మృతి!
విధి ఎంత విచిత్రమో. నిన్నటి వరకు తన సృజనతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. నేడు విగతజీవిగా మారారు. ఆయన దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ నిన్ననే(అక్టోబర్ 16) విడుదలైంది. ఇంతలోనే ఆయన మరణవార్త సినీలోకాన్ని విషాదాన్ని నింపింది. 27 ఏళ్ల వయసులో మలయాళ దర్శకుడు బేల్ రాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేళ్లపాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. ‘కప్పి స్క్వాడ్’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. (చదవండి: విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత)శుక్రవారం జియో హాట్స్టార్లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అయితే ఆ అనందాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే కన్నుమూశాడు. మరో విషాదకరమైన విషయం ఏంటంటే..నెల క్రితమే ఆయన వివాహం జరిగింది. ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న ఆయన పెద్దలను ఒప్పించి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన నెల రోజులకే దర్శకుడి మరణం ఆయన కుటుంబాన్ని, స్నేహితులను, చిత్ర పరిశ్రమను శోకంలో ముంచేసింది.