breaking news
Bellam Ramakrishna Reddy
-
అందరూ మెచ్చే శుభలేఖ+లు
‘‘పెళ్లి అనే శుభకార్యానికి ముందు అందులోని సమాచారాన్నంతా క్లుప్తంగా శుభలేఖలో రాసి కావాల్సిన బంధువులందరికీ పంచుతాం. మరి సినిమాకు శుభలేఖలంటే ‘టీజర్, ట్రైలర్స్’లే. బంధువులు ఎవరంటే ప్రేక్షకులే. పెళ్లి కార్డ్‌ని చూసి పెళ్లి ఏ రీతిలో జరగబోతోందో అని ఊహించినట్టుగా, ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా బావుండబోతోందని టాక్ వినిపిస్తోంది. ‘మా ‘శుభలేఖ+లు’ చిత్రం కూడా కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మం ఉంది’’ అంటున్నారు చిత్రబృందం. సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ జంటగా ప్రియా వడ్లమాని ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘శుభలేఖ+లు’. శరత్ నర్వాడే దర్శకత్వంలో సి. విద్యాసాగర్, ఆర్.ఆర్. జనార్థన్ నిర్మించారు. చిత్రాన్ని వీక్షించి, బాగా నచ్చడంతో చిత్రం హక్కులను పుష్యమి ఫిల్మ్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి కొనుగోలు చేశారు. ఈ చిన్న చిత్రాన్ని సుమారు మూడున్నర కోట్ల ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేశారని టాక్. ‘శుభలేఖ+లు’ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెప్పిన విశేషాల్లో కొన్ని... ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపించాలి అన్నది పాత నానుడి. ఇప్పటి యువత నాడి తెలిసిన దర్శక– నిర్మాతలు ఒక అబద్ధం ఆడకుండా ఒకరి బలహీనతలు ముందుగానే మరొకరికి పరిచయం చేసి ఎలా ఒక్కటవ్వాలనుకుంటున్నారు అనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు వేరు కాపురాలు పెట్టేశాయి. నిర్ణయాలు కలిసి తీసుకోవడం నుంచి ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్లు తీసుకుని కేవలం నిర్ణయాలను తెలియజేస్తున్నారు. కొంచెం కష్టం అయినా సరే పెద్దలను ఒప్పించవచ్చు. ఇలాంటి కాంటెపరరీ సబ్జెక్ట్‌కి యువత బాగా కనెక్ట్ అవుతారు. పాటలకు విశేష స్పందన లభిస్తోంది. కథను ముందుకు తీసుకువెళ్లేలా పాటలుంటాయి. చిన్న చిత్రాలకు పెద్ద సంవత్సరం 2018 చిన్న సినిమాలకు చాలా పెద్ద సంవత్సరం. రిలీజ్ అప్పుడు చిన్న స్థాయిలో కనిపించినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద సందడి చేస్తున్నాయి. మా సినిమా కూడా కచ్చితంగా అదే స్థాయిలో ఉంటుంది. ‘ఛలో, ఆర్ఎక్స్ 100, కంచరపాలెం, సమ్మోహనం, గూఢచారి’ లాంటి చిత్రాల జాబితాలో మా చిత్రం కూడా చోటు సంపాదించుకుంటుందని నమ్ముతున్నాం. కంటెంట్ బాగుంటే... పెద్ద సినిమాలకు పెట్టింది తిరిగొస్తే హిట్ అను కుంటాం. లాభాలు చూసేది చాలా తక్కువ ఉంటుంది. కానీ చిన్న సినిమాల విషయంలో అలా కాదు. సినిమా టాక్ని బట్టి ఎన్నింతలైనా లాభం చూడొచ్చు నిర్మాతలు. కంటెంట్ బావుంటే చిన్న హీరో, పెద్ద హీరో అనే బేధాలను బాక్సాఫీస్ అంకెల్లో ప్రేక్షకుడు చూపించడం లేదు. మా సినిమా విషయంలో కూడా అదే జరుగుతుందనే నమ్మకం ఉంది. మంచి ఇంపాక్ట్ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో కూడా ప్రేక్షకులు ‘శుభలేఖ+లు’ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూసున్నారంటే అది కచ్చితంగా టీజర్స్, ట్రైలర్స్, సినిమాలోని పాటలు క్రియేట్ చేసిన ఇంపాక్టే. సాయి శ్రీనివాస్, ప్రియా వడ్లమాని, దీక్షా శర్మ గుర్తుండిపోయేలా స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచారు. శరత్ నర్వాడ్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంతైనా చెప్పొచ్చు. డిసెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రం కోసం పాటలు వింటూ, ట్రైలర్ చూస్తూ ఆసక్తిగా ఎదురు చూడటమే’’ అంటూ తమ చిత్రం గ్యారంటీగా హిట్ అనే నమ్మకాన్ని కూడా చిత్రబృందం వ్యక్తం చేశారు. -
ఈ ఏడాది మూడు సినిమాలు!
గతేడాది పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంౖపై ‘దృశ్యకావ్యం’ చిత్రాన్ని అందించిన దర్శక–నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మూడు చిత్రాలను ప్రేక్షకులకు ఇవ్వనున్నారు. ఆ చిత్రాల విశేషాలను రామకృష్ణారెడ్డి తెలియజేస్తూ – ‘‘విజయ్–కీర్తీ సురేశ్ జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘భైరవ’ను మేలో తెలుగులో విడుదల చేయబోతున్నాం. జై, అంజలి, జెన్నీ అయ్యర్ హీరో హీరోయిన్లుగా రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ‘బెలూన్’ షూటింగ్ ప్రస్తుతం కొడైకెనాల్లో జరుగుతోంది. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. విక్రమ్, నయనతార జంటగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘స్వామి–2’ని ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తాం. మహేశ్ గోవిందరాజు సమర్పణలో మా పుష్యమి ఫిలిం మేకర్స్ నిర్మాణ సారథ్యంలో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ మూడు చిత్రాలూ ఘనవిజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
అందమైన దృశ్యకావ్యం ఇది
- దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనసు పెట్టి పనిచేయడంతో ఈ చిత్రం అందమైన ‘దృశ్యకావ్యం’లా తయారైంది. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకన్నా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘ప్రాణం’ కమలాకర్ పాటలు మా చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి’’ అని దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి తెలిపారు. రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై మధునందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘దృశ్యకావ్యం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మా చిత్రం పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా ప్రతి సీన్ అన్ని వర్గాల వారికి నచ్చేలా ఉంటుంది. ‘థర్టీ ఇయర్స్’ పృధ్వీ, అలీ, ‘జబర్దస్త్’ టీమ్ వినోదం ఆకట్టుకుంటుంది. ఆంధ్ర, తెలంగాణలతో పాటు తమిళనాడు, నార్త్ ఇండియాలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రామకృష్ణారెడ్డిగారు కొత్త దర్శకుడైనా సీనియర్ దర్శకుల్లా అందరి నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. ఇప్పటికే సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లారు. కమలాకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్’’ అని మధునందన్ పేర్కొన్నారు. అందరూ ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్ర మిదని హీరో రామ్ కార్తీక్ చెప్పారు. సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్, హీరోయిన్ కశ్మీరా కులకర్ణి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లం సుధారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొల్లు శివనాగేంద్ర రావు.