గల్ఫ్‌లో గుండెపోటుతో కార్మికుడి మృతి
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్(40) అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. రూ.3 లక్షల వరకు అప్పు కావడంతో దానిని చెల్లించేందుకు జీవనోపాధి కోసం సౌది అరేబియాకు వెళ్లాడు. అయితే ఏజెంట్ మోసం చేయడం, చేసేందుకు పని దొరక్క పోవడంతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడని కుటంబ సభ్యులు తెలిపారు.