breaking news
Being single
-
ఇలా ఉంటే మీరే రాజు.. మీరే మంత్రి
సోలోగా ఉండటమంటే.. పెళ్లి,పెటాకులు, ఎవరితోనూ ప్రేమలో లేకుండా ఒంటరిగా ఉండటమనే కాదు! మనతో మనం ఉండటం. మనల్ని మనం ప్రేమించుకోవటం. కొంతమంది ఓ సినిమాలో హీరోలాగా గ్యాప్ లేకుండా ఒకరితర్వాత ఒకర్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఎదుటి వారి వల్ల కష్టపడో లేక వారిని కష్టపెట్టో విడిపోతుంటారు! తరుచూ బాధపడుతుంటారు. అయితే సోలో లైఫ్‌లో ఇలాంటివేవీ ఉండవని చెప్పొచ్చు. ఇందులో ఇతరుల ప్రవర్తన వల్ల మన మనసును బాధించుకునే సందర్భాలు చాలా అరుదు. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితానికి మీరే రాజు.. మీరే మంత్రి. సోలోగా ఉండటం వల్ల చాలానే లాభాలు ఉన్నాయి. 1) స్నేహ బంధాలు ధృడపడతాయి సోలోగా ఉండటం వల్ల స్నేహితులకోసం ఎక్కువ సమయం కేటాయించటానికి అవకాశం ఉంటుంది. నిరంతం భాగస్వామికోసం, పిల్లల కోసం తపనపడాలన్న ఆలోచనలేకుండా మిత్రులతో సరదాగా గడపొచ్చు. 2) ఆరోగ్యంపై శ్రద్ధ సోలో లైఫ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవటానికి ఎక్కువ సమయం దొరకుతుంది. పెళ్లైన వారికంటే సింగిల్‌గా ఉన్న వారే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైంది. పెళ్లైన వారికంటే ఒంటరి వ్యక్తులు వారంలో ఎక్కువ సార్లు వ్యాయామం చేస్తారని తేలింది. 3) మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవచ్చు సోలోగా ఉండటం వల్ల కలిగే అతి ముఖ్యమైన లాభం మనల్ని మనం అర్థం చేసుకోవటం. మన ఇష్టాయిష్టాలను, అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. పక్కవారి కోసం మనల్ని మనం మార్చుకునే అవసరం ఎంతమాత్రమూ లేదు. 4) అనవసర ఖర్చులు సింగిల్‌గా ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులను నివారించవచ్చు. మనం కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరుల కోసం ఇష్టం లేకపోయినా ఖర్చు చేయటం ఉండదు. మన ఇష్టప్రకారం,మనకోసమే వాటిని ఖర్చు చేసుకోవచ్చు. 5) అంతా మీ ఇష్టం : సోలో లైఫ్‌లో మనకు నచ్చినట్లుగా మనం ఉండొచ్చు. సినిమాలకు వెళ్లాలన్నా, షికార్లకు వెళ్లాలన్నా పదిసార్లు ఆలోచించాల్సి అవసరం లేదు. 6) కుటుంబం కోసం.. కనిపెంచిన అమ్మానాన్నలు, తోడబుట్టిన వాళ్ల కోసం ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. పెళ్లైనా లేదా ప్రేమలో ఉన్నా మన ప్రాధాన్యతలు మారుతుంటాయి! దీంతో మిగిలిన కుటుంబసభ్యులను నిర్లక్ష్యం చేస్తుంటారు. సింగల్‌గా ఉండటం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
దేశాలకు దేశాలే పెళ్లికి నో !
మగోడు బ్రిటన్‌లోని అవివాహితుల్లో సింహ భాగం మగాళ్లే. అంటే పెళ్లిని తిరస్కరిస్తున్నది మగాళ్లే గానీ స్త్రీలు కాదట! ఒక్క బ్రిటన్‌లోనే ఈ ధోరణి కనిపిస్తోందని అనుకుంటున్నారేమో... ఆసియా దేశాలైన చైనా, తైవాన్‌లలోనూ ఇదే పరిస్థితి. పెళ్లి చేసుకున్న ప్రతి మగాడూ ‘పెళ్లొద్దురో బాబోయ్’ అంటాడు... పెళ్లి కాని ప్రతి మగాడూ ‘పెళ్లెపుడు చేసుకుందామా’ అనుకుంటుంటాడు. ఇది మన సమాజంలోని ప్రస్తుత పరిస్థితి. అంటే స్వానుభవంతో గుణపాఠాలు నేర్చుకుంటున్నాం మనం. కానీ ఇంగ్లండ్ దేశస్థులు ఇతరుల అనుభవాలతో తాము పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది కళ్లు తెరిపించే నిజం కాదు, ఆశ్చర్యపరిచే నిజం. ఒక దేశ జనాభాలో సగం మంది అవివాహితులు ఉన్నారంటే నమ్ముతారా? అసాధ్యం. పిల్లల్ని కూడా కలిపి చెప్పి ఉంటారు లెండి అని మీరు లాజిక్‌లు తీస్తారేమో. ఈ ఘనత సాధించింది బ్రిటన్ దేశం. ఆ దేశంలో పదహారేళ్ల వయసు పూర్తయిన వారిలో ప్రస్తుతం 51 శాతం మంది బ్రహ్మచారులు!! ఇది అక్షరాలా బ్రిటన్ ప్రభుత్వం అధికారిక జనాభా లెక్కల్లో తేలిన కఠోర నిజం. మీకు ఇంకో అనుమానం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీరిలో భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు కూడా ఉంటారేమో అని. నిజమే. కానీ ఆ అవకాశం చాలా తక్కువట. ఎందుకంటే ఈ లెక్కల ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వంలోని ఓ సర్వే విభాగం 16-20 మధ్య వారిని పెళ్లి పై అభిప్రాయం గురించి ఆరా తీస్తే ‘ఎందుకండీ పెళ్లి’ అని పెద్ద సంఖ్యలో స్పందన వచ్చిందట. మనల్ని బ్రిటన్ వారు పాలించారంటే ఏమో అనుకున్నాం కానీ... వారు ఎంతో తెలివైనవారు కాబట్టే మనల్ని అంతకాలం పాలించారు అనుకోవాలేమో! అన్ని తెలివితేటలున్నాయి కాబట్టే పెళ్లి ఎంత ప్రమాదమో బ్రిటన్ దేశీయులు ముందే పసిగట్టేసినట్లున్నారు. ఈ లెక్కలు చెప్పిన నిజాలు అన్నీ ఇన్నీ కావు. ఈ లెక్కల్లో పెళ్లయి విడిపోయిన వారు కూడా ఉన్నారు. వారయితే మరో పెళ్లి చేసుకోవడానికి సముఖంగా లేరట. పెళ్లి ఎప్పటికీ వద్దనుకున్న వారి శాతం (అంటే ఒక్క పెళ్లి కూడా కాని వారు) మరీ ఘోరంగా 35 శాతం ఉందంటే... వారికి పెళ్లి పట్ల ఎంత విముఖత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐలింగ్టన్, లాంబెత్ నగరాల్లో కేవలం పాతిక శాతం మందే పెళ్లయినోళ్లు. ఇంతకీ ఎందుకు మీకు పెళ్లంటే అంత అనిష్టం అని ఆరా తీసినప్పుడు బయటపడిన మొదటి కారణం... ‘పెళ్లి చేసుకోకపోతే ఇపుడు ఎవరూ చిన్నచూపు చూడట్లేదు. పైగా ఎవరిష్టం వారిదంటున్నారు కదా. అందుకే ఇక పెళ్లి చేసుకోవట్లేద’న్నారట. అంటే ఇంతకాలం పెళ్లి చేసుకున్నది కూడా సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతోనే గానీ, ఎంతో కొంత ఇష్టంతో చేసుకోవట్లేదన్నమాట. రెండో కారణం ఏమిటంటే... పెళ్లితో బాధ్యతలు పెరుగుతున్నాయి గానీ సుఖాలేమీ పెరగట్లేదు. పైగా పని, ఖర్చులు అదనం అని గుర్తించారు. మరో సంగతి ఏమిటంటే, భార్య-భర్త సమానం అన్న సిద్ధాంతం వల్ల నష్టమే గాని లాభం లేకుండా పోయింది. అమ్మాయిలు కోరుకున్న ఈ మార్పు చివరకు వారికి తోడు దొరకడాన్నే కష్టంగా మార్చింది. ఇంత కచ్చితంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... బ్రిటన్‌లోని అవివాహితుల్లో సింహ భాగం మగాళ్లే. అంటే పెళ్లిని తిరస్కరిస్తున్నది మగాళ్లే గానీ స్త్రీలు కాదట! ఒక్క బ్రిటన్‌లోనే ఈ ధోరణి కనిపిస్తోందని అనుకుంటున్నారేమో... ఆసియా దేశాలైన చైనా, తైవాన్‌లలోనూ ఇదే పరిస్థితి. చైనా జనాభా లెక్కలేం లేవు గానీ తైవాన్ లెక్కలైతే అందుబాటులోకి వచ్చాయి. దాదాపు కోటి మంది తైవానీయులు, అంటే సగం జనాభా పెళ్లి చేసుకోలేదట. అక్కడ ఈ లెక్కలు విడుదలయ్యాక పిజ్జా ఫర్ సింగిల్, సింగిల్ రూమ్ ఫర్ సింగిల్ మ్యాన్, చిన్న స్టూడియో ఫ్లాట్లకు డిమాండ్ భారీగా ఉందట. కుటుంబ సమేతంగా వచ్చే బార్బిక్యూ రెస్టారెంట్లలోనూ సింగిల్ మీల్ డీల్స్ వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయికి చొచ్చుకుపోయిందో తెలుస్తోందిగా. వాళ్లు ‘బీయింగ్ సింగిల్’ అనే ఒక జీవనశైలిని పెంపొందించి, దానికి అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నారు.