దేశాలకు దేశాలే పెళ్లికి నో ! | No one country to the wedding! | Sakshi
Sakshi News home page

దేశాలకు దేశాలే పెళ్లికి నో !

Jun 10 2014 11:51 PM | Updated on Sep 2 2017 8:35 AM

దేశాలకు దేశాలే పెళ్లికి నో !

దేశాలకు దేశాలే పెళ్లికి నో !

బ్రిటన్‌లోని అవివాహితుల్లో సింహ భాగం మగాళ్లే. అంటే పెళ్లిని తిరస్కరిస్తున్నది మగాళ్లే గానీ స్త్రీలు కాదట!

మగోడు
 బ్రిటన్‌లోని అవివాహితుల్లో సింహ భాగం మగాళ్లే. అంటే పెళ్లిని తిరస్కరిస్తున్నది మగాళ్లే గానీ స్త్రీలు కాదట!
 ఒక్క బ్రిటన్‌లోనే ఈ ధోరణి కనిపిస్తోందని అనుకుంటున్నారేమో... ఆసియా దేశాలైన చైనా, తైవాన్‌లలోనూ ఇదే పరిస్థితి.
 పెళ్లి చేసుకున్న ప్రతి మగాడూ ‘పెళ్లొద్దురో బాబోయ్’ అంటాడు... పెళ్లి కాని ప్రతి మగాడూ ‘పెళ్లెపుడు చేసుకుందామా’ అనుకుంటుంటాడు. ఇది మన సమాజంలోని ప్రస్తుత పరిస్థితి. అంటే స్వానుభవంతో గుణపాఠాలు నేర్చుకుంటున్నాం మనం. కానీ ఇంగ్లండ్ దేశస్థులు ఇతరుల అనుభవాలతో తాము పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది కళ్లు తెరిపించే నిజం కాదు, ఆశ్చర్యపరిచే నిజం.

ఒక దేశ జనాభాలో సగం మంది అవివాహితులు ఉన్నారంటే నమ్ముతారా? అసాధ్యం. పిల్లల్ని కూడా కలిపి చెప్పి ఉంటారు లెండి అని మీరు లాజిక్‌లు తీస్తారేమో. ఈ ఘనత సాధించింది బ్రిటన్ దేశం. ఆ దేశంలో పదహారేళ్ల వయసు పూర్తయిన వారిలో ప్రస్తుతం 51 శాతం మంది బ్రహ్మచారులు!! ఇది అక్షరాలా బ్రిటన్ ప్రభుత్వం అధికారిక జనాభా లెక్కల్లో తేలిన కఠోర నిజం.

మీకు ఇంకో అనుమానం కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీరిలో భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు కూడా ఉంటారేమో అని. నిజమే. కానీ ఆ అవకాశం చాలా తక్కువట. ఎందుకంటే ఈ లెక్కల ఆధారంగా బ్రిటన్ ప్రభుత్వంలోని ఓ సర్వే విభాగం 16-20 మధ్య వారిని పెళ్లి పై అభిప్రాయం గురించి ఆరా తీస్తే ‘ఎందుకండీ పెళ్లి’ అని పెద్ద సంఖ్యలో స్పందన వచ్చిందట.

మనల్ని బ్రిటన్ వారు పాలించారంటే ఏమో అనుకున్నాం కానీ... వారు ఎంతో తెలివైనవారు కాబట్టే మనల్ని అంతకాలం పాలించారు అనుకోవాలేమో! అన్ని తెలివితేటలున్నాయి కాబట్టే పెళ్లి ఎంత ప్రమాదమో బ్రిటన్ దేశీయులు ముందే పసిగట్టేసినట్లున్నారు.

ఈ లెక్కలు చెప్పిన నిజాలు అన్నీ ఇన్నీ కావు. ఈ లెక్కల్లో పెళ్లయి విడిపోయిన వారు కూడా ఉన్నారు. వారయితే మరో పెళ్లి చేసుకోవడానికి సముఖంగా లేరట. పెళ్లి ఎప్పటికీ వద్దనుకున్న వారి శాతం (అంటే ఒక్క పెళ్లి కూడా కాని వారు) మరీ ఘోరంగా 35 శాతం ఉందంటే... వారికి పెళ్లి పట్ల ఎంత విముఖత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐలింగ్టన్, లాంబెత్ నగరాల్లో కేవలం పాతిక శాతం మందే పెళ్లయినోళ్లు.
 
ఇంతకీ ఎందుకు మీకు పెళ్లంటే అంత అనిష్టం అని ఆరా తీసినప్పుడు బయటపడిన మొదటి కారణం... ‘పెళ్లి చేసుకోకపోతే ఇపుడు ఎవరూ చిన్నచూపు చూడట్లేదు. పైగా ఎవరిష్టం వారిదంటున్నారు కదా. అందుకే ఇక పెళ్లి చేసుకోవట్లేద’న్నారట. అంటే ఇంతకాలం పెళ్లి చేసుకున్నది కూడా సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతోనే గానీ, ఎంతో కొంత ఇష్టంతో చేసుకోవట్లేదన్నమాట. రెండో కారణం ఏమిటంటే... పెళ్లితో బాధ్యతలు పెరుగుతున్నాయి గానీ సుఖాలేమీ పెరగట్లేదు. పైగా పని, ఖర్చులు అదనం అని గుర్తించారు.

మరో సంగతి ఏమిటంటే, భార్య-భర్త సమానం అన్న సిద్ధాంతం వల్ల నష్టమే గాని లాభం లేకుండా పోయింది.  అమ్మాయిలు కోరుకున్న ఈ మార్పు చివరకు వారికి తోడు దొరకడాన్నే కష్టంగా మార్చింది. ఇంత కచ్చితంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... బ్రిటన్‌లోని అవివాహితుల్లో సింహ భాగం మగాళ్లే. అంటే పెళ్లిని తిరస్కరిస్తున్నది మగాళ్లే గానీ స్త్రీలు కాదట!

ఒక్క బ్రిటన్‌లోనే ఈ ధోరణి కనిపిస్తోందని అనుకుంటున్నారేమో... ఆసియా దేశాలైన చైనా, తైవాన్‌లలోనూ ఇదే పరిస్థితి. చైనా జనాభా లెక్కలేం లేవు గానీ తైవాన్ లెక్కలైతే అందుబాటులోకి వచ్చాయి. దాదాపు కోటి మంది తైవానీయులు, అంటే సగం జనాభా పెళ్లి చేసుకోలేదట. అక్కడ ఈ లెక్కలు విడుదలయ్యాక పిజ్జా ఫర్ సింగిల్, సింగిల్ రూమ్ ఫర్ సింగిల్ మ్యాన్, చిన్న స్టూడియో ఫ్లాట్లకు డిమాండ్ భారీగా ఉందట. కుటుంబ సమేతంగా వచ్చే బార్బిక్యూ రెస్టారెంట్లలోనూ సింగిల్ మీల్ డీల్స్ వచ్చాయంటే పరిస్థితి ఏ స్థాయికి చొచ్చుకుపోయిందో తెలుస్తోందిగా. వాళ్లు ‘బీయింగ్ సింగిల్’ అనే ఒక జీవనశైలిని పెంపొందించి, దానికి అనుగుణంగా వ్యాపారాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement