breaking news
beedi factory
-
బీడీ ప్యాకెట్లపై రొనాల్డో, మెస్సీ చిత్రాలు: వైరల్
ఏదైనా ఓ వస్తువు మార్కెట్లో క్లిక్ కావాలంటే ముందుగా తట్టే ఆలోచన అడ్వర్టైజ్మెంట్. తినే ఆహారం నుంచి మనిషికి వినోదాన్ని పంచే సినిమా వరకు ప్రకటన చాలా ఉపయోగపడుతుంది. ఇక సెలబ్రిటీలు బ్రాండ్అంబాసిడర్గా ఉండే కంపెనీలు కోట్లు పోగేసుకుంటాయి. ఆ మధ్య కాలంలో క్రిస్టియానో రొనాల్డో ప్రెస్ మీట్లో కోక్ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ..’ ఇచ్చిన పిలుపు.. కోలా బ్రాండ్‌కు ఊహించని స్థాయిలో నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లియోనల్ మెస్సీ చిత్రంతో ఉన్న ఓ బీడీ ప్యాకెట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని ధూలియన్‌లో ఆరిఫ్ బీడీ ఫ్యాక్టరీ వీటిని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారత ఐపీఎస్ అధికారి రూపీన్ శర్మ ‘‘ మెస్సీ ఫస్ట్ ఎండోర్స్మెంట్ ఇన్ ఇండియా’’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘‘మెస్సీ ఏజెంట్లు దీన్ని చూడరని, బీడీ కంపెనీ నుంచి రాయల్టీ కోసం క్లెయిమ్ చేయరని ఆశిస్తున్నాను. ఇది బెంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ అయి ఉండాలి.’’ అంటూ కామెంట్ చేశాడు. అయితే కేవలం మెస్సీ చిత్రంతో ఉన్న బీడీ ప్యాకెట్‌నే కాదు. పోర్చుగీస్ ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో బీడీ ప్యాకెట్ల చిత్రాలను కూడా నెటిజన్లు పంచుకున్నారు. Messi's first endorsement in India ☺️☺️☺️☺️☺️ pic.twitter.com/07vh7bTMwC — Rupin Sharma IPS (@rupin1992) July 13, 2021 And as expected, there is a competitor: #Ronaldo Beedi with the tagline "beware of duplicates". Now waiting for #Neymar beedi's appearance. @rupin1992 pic.twitter.com/jndFOUmnRI — উৎপল বৰপূজাৰী Utpal Borpujari (@UtpalBorpujari) July 13, 2021 -
సీబీఐకి చిక్కిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
నంద్యాల: బీడీ ఫ్యాక్టరీ యజమాని నుంచి రూ.10వేల లంచం తీసుకుంటూ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సతీష్‌కుమార్ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని పార్కు రోడ్డు ప్రాంతానికి చెందిన ఆరిఫ్ 2012లో కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకుని నెంబర్ 12 బీడీ ఫ్యాక్టరీ నెలకొల్పారు. రెండు మూడేళ్లకే నష్టాలు వచ్చాయి. అయితే ప్రతి ఏడాది కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖకు సర్వీసు ట్యాక్స్ చెల్లించడంతో పాటు రికార్డులను సమర్పించాల్సి ఉంది.దీంతో ఆయన ఫ్యాక్టరీని మూసివేయాలని నిర్ణయించుకుని లైసెన్స్ రద్దు చేయాలని ఇటీవల ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే లైసెన్స్ రద్దుకు రూ.15వేలు ఇవ్వాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిమాండ్ చేయగా.. రూ.10వేలు ఇచ్చేందుకు ఆరిఫ్ ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన సతీష్‌కుమార్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కేంద్రం పరిధిలో ఉండటంతో ఏసీబీ అధికారులు ఫిర్యాదును సీబీఐకి పంపారు. ఈ మేరకు సతీష్‌కుమార్‌కు బాలాజీ కాంప్లెక్స్‌లోని మధుమణి నర్సింగ్ హోం ప్రాంతంలో ఉన్న ఒక దుకాణంలో ఆరిఫ్ రూ.10వేలు అందజేశారు. వెంటనే సీబీఐ డీఎస్పీ బషీర్, సీఐలు రాజేంద్రకుమార్, రాఘవేంద్రకుమార్ దాడి చేసి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌కుమార్‌ను శ్రీనివాసనగర్‌లోని కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి విచారించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.