breaking news
beaten father
-
Hyderabad: తండ్రి చేతిలో గాయపడిన చిన్నారి మృతి
సాక్షి, హైదరాబాద్: కన్న కూతురిని విక్షణారహితంగా కొట్టడమేగాక పైకెత్తి కింద పారవేడయంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గత శనివారం ఇంట్లో బాత్రూంలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి సకినా ఫాతిమాను ఆమె తండ్రి బాసిత్ ఖాన్ తీవ్రంగా కొట్టడమేగాక పాటు పైకెత్తి నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి సనా ఫాతిమా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Telangana: ఆర్టీసీ కీలక నిర్ణయం.. వారికి ఉద్యోగాలకు ఓకే! -
మూడేళ్ల బాలుడిని చితకబాదిన తండ్రి
* తల్లిదండ్రుల అరెస్టు * అనాథాశ్రమానికి బాలుడి తరలింపు పటాన్‌చెరుటౌన్: మెదక్ జిల్లా పటాన్చెరులో దారుణం జరిగింది. చెప్పినట్టు వినడం లేదని మూడేళ్ల బాలుడిని కన్న తల్లిదండ్రులు చితకబాదారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చూసి స్థాని కులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని అనాథాశ్రమంలో చేర్పించి తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. శివకుమార్, రాధ దంపతులు. వీరికి మనోహర్(3) కుమారుడు ఉన్నాడు. సదాశివపేట కోనాపూర్‌కు చెందిన శివకుమార్ పటాన్‌చెరుకు వలస వచ్చాడు. స్థానికంగా సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. చెప్పినట్టు వినడం లేదని ఆగ్రహించిన శివకుమార్.. గురువారం తన మూడేళ్ల కుమారుడిపై ప్రతాపం చూపాడు. అందరి ముందే చితకబాదాడు. ఎక్కడికక్కడ ఒళ్లంతా కమిలిపోయినా వదల్లేదు. ఈ తతంగాన్ని బాలుడి తల్లి రాధ చూస్తున్నా అడ్డుకోలేకపోయింది. బాలుడి పరిస్థితిని గమనిం చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. చైల్డ్ డెవలప్మెంట్ డెరైక్టర్ చంద్ర ఫిర్యాదు మేరకు బాలుడి తల్లిదండ్రులు శివకుమార్, రాధను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడి పరిస్థితిని తెలుసుకున్న చైల్డ్ డెవలప్మెంట్ (చైల్డ్ లైన్ 1098) డెరైక్టర్ చంద్ర తన సిబ్బందితో కలసి పటాన్చెరు చేరుకున్నారు. బాలుడిని స్వాధీ నం చేసుకుని అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్‌కు తరలించారు. ఈ సందర్భంగా చెల్డ్ డెవలప్మెంట్ డెరైక్టర్ చంద్ర మాట్లాడుతూ.. ఆ బాలుడు తల్లిదండ్రుల వద్ద ఉండడం అంత శ్రేయస్కరం కానందున మహిమ మినిస్ట్రీస్‌కు తరలించినట్టు చెప్పారు.