breaking news
bcroy
-
యువతకు స్ఫూర్తిప్రదాత
డాక్టర్ బి.సి.రాయ్‌గా సుపరిచితులైన బిధాన్ చంద్రరాయ్ 1882 జూలై 1న నేటి బిహార్‌లోని బాంకీపూర్‌లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించారు. 1925లో రాజకీయాలలో ప్రవేశించారు. బెంగాల్‌లోని బారక్పూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటిచేసి ‘గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన సురేంద్రనాథ్ బెనర్జీని ఓడించారు. 1928లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐ.ఎం.ఎ.) ఏర్పాటులోనూ, 1939లో దేశంలో వైద్య విద్య నియంత్రణకు, అభివృద్ధికి పాటుపడే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎం.సి.ఐ.) ఏర్పాటు చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.మహత్మాగాంధీకి అనుంగు మిత్రునిగా, వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించారు. 1942లో పుణేలో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంలో నిరాహార దీక్షకు దిగారు. ఆరోగ్యం క్షీణించడంతో రాయ్ మందులు ఇచ్చారు. ఆ మందులు ఇండియాలో తయారైనవి కావని గాంధీజీ వాటిని నిరాకరించారు. అంతేకాక... ‘నేను, నువ్వు ఇచ్చిన మందులు ఎందుకు తీసుకోవాలి? ఈ దేశంలోని 40 కోట్ల ప్రజలకు నువ్వు ఉచితంగా వైద్యం చేస్తావా?’ అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ రాయ్ ‘లేదు, అందరికీ ఉచితంగా వైద్యం చేయలేను. కానీ నేను వచ్చింది... మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీకి వైద్యం చేయడానికి కాదు, ఈ దేశంలోని 40 కోట్ల మంది ప్రజలకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి’కి అన్నారు. గాంధీజీ మాట్లాడకుండా మందులు తీసుకున్నారు.స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుల ఒత్తిడి మేర 1948 జనవరి 23న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రాయ్. ఆ రోజుల్లో దేశవిభజన కారణంగా బెంగాల్ అతలాకుతలమవుతోంది. రాయ్ ప్రణాళికబద్ధంగా పశ్చిమ బెంగాల్‌ను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు. తన 80వ ఏట 1962 జూలై 1న తన పుట్టినరోజే తుదిశ్వాస విడిచేవరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడటం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం బి.సి. రాయ్ సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. రాయ్ అవివా హితులు. తన ఇంటిని తల్లి అఘొర్ కామినీదేవి పేరుతో హాస్పిటల్‌కు విరాళంగా ఇచ్చారు. తన ఆస్తులతో ప్రజాప్రయోజనార్థం ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆయన నేటి వైద్యులకు, రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. – డా. టి. సేవకుమార్, ఐ.ఎం.ఎ. నేషనల్ కౌన్సిల్ సభ్యులు (రేపు డా. బి.సి. రాయ్ జయంతి, వర్ధంతి – జాతీయ వైద్యుల దినోత్సవం) -
బీసీ రాయ్ అవార్డు గ్రహీత రామారెడ్డికి సత్కారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ) : బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డిని కలాం ఐఏఎస్ ఇ¯ŒSస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నన్నయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్.టేకి మాట్లాడుతూ చిన్ననాటి నుంచే గొప్పగా ఎదగాలని కలలు కంటూ వాటి సాకారంకోసం నిత్యం శ్రమించాలన్నారు. సీసీసీ ఎండీ పంతం కొండలరావు మాట్లాడుతూ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ డాక్టర్ రామారెడ్డి రాజమహేంద్రవరానికే గర్వకారణమన్నారు. డాక్టర్ కర్రి రామారెడ్డి మాట్లాడుతూ పదో తరగతి, ఇంటరీ్మడియట్ విద్యార్థులు విద్యాభివృద్ధికి, ఉద్యోగ సాధనకు లక్ష్యాలను ఏర్పర్చుకోవాలన్నారు. అనంతరం రెండుగంటల పాటు లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS నిర్వహించారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ డైరెక్టర్ రజనీష్ రెడ్డి, విజ్ఞానభారతి రాష్ట్ర కన్వీనర్ కె.సుబ్బరాయశాస్త్రి, ఆదిరెడ్డి వాసు, రామ్‌గోపాల్‌రెడ్డి, జి.సూర్యకుమారి పాల్గొన్నారు.


