breaking news
bc president
-
'చంద్రబాబు బీసీల ఉసురు తీస్తున్నారు'
రామచంద్రపురం: తెలుగుదేశం బీసీల పార్టీ అని పదేపదే ప్రకటించే సీఎం చంద్రబాబు బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని, పైగా వివిధ రూపాల్లో బీసీల ఉసురు తీస్తున్నారని ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాబు కావాలంటే బాబు రావాలి అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన టీడీపీ.. తీరా అధికారంలోకి వచ్చాక బీసీ యువత అత్యధికంగా ఉపాధి పొందుతున్న కాంట్రాక్టు ఉద్యోగాలను ఊడబెరుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీలపై దాడులు పెరిగాయని, ఏలూరు ఇందుమతి హత్య తదితర సంఘటనలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినా తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మంజునాథ కమిషన్ ఏమి చెబుతుందోనని అందరూ ఎదురు చూస్తుంటే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న హోంమంత్రి కాపులకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. -
'ఇంటికో ఉద్యోగం ఇచ్చేదాకా కేసీఆర్ను వదలం'
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను వదిలిపెట్టేది లేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆదివారం వనస్థలిపురంలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది, ఈ సంవత్సరం కలుపుకుని ఈ రెండేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.