breaking news
batch
-
మెహిదీపట్నంలో గంజాయి బ్యాచ్ వీరంగం
-
‘మా సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’
బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అయిన చిత్రం ‘బ్యాచ్’. నేహా పటాన్ హీరోయిన్. శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌లో సాత్విక్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి కథలో నటించే చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నందుకు హ్యాపీ’’ అన్నారు. ‘‘సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు శివ. ‘‘మా సినిమాకు వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు రమేష్. ‘‘ఈ సినిమాను 1000 థియేటర్స్‌లో విడుదల చేసి రమేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడు. హీరోహీరోయిన్లుగా బాగా చేశారు’’ అన్నారు నటుడు, సంగీతదర్శకుడు రఘు కుంచె. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రూ.1.60 లక్షలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం తాడితోట, ఏసీవై కాలనీలోని పళ్ల సత్తిరాజు ఇంట్లో శనివారం జరుగుతున్న 20–20 క్రికెట్ మ్యాచ్ పూనే వర్సెస్ ముంబయి ఇండియ¯Œ్స క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ప్రభునాయుడు, కామేశ్వరరావు, పళ్ల సత్తిరాజులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ 1.60 లక్షలు నగదు, 9 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్, టీవీ, బ్యాటరీలు, స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రభునాయుడు, కామేశ్వరరావులు 2014 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన కేసు వన్‌టౌన్ పరిధిలో ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు వైజాగ్‌కు చెందిన మున్నిని అరెస్ట్ చేయ్యాల్సి ఉందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఏజీఎస్ ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు తాతారావు, మణికంఠలను ఎస్పీ అభినందించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. -
పోలీస్ ఫైట్
వరంగల్, న్యూస్‌లైన్ పోలీస్ శాఖలో రెండు బ్యాచ్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది. వీరి మధ్య విభేదాలు రచ్చకెక్కారుు. 1991 బ్యాచ్‌కు చెందిన ఓ అధికారి సీఐగా, డీఎస్పీగా రెండుసార్లు యాగ్జిలరీ పదోన్నతి పొందారు. ఆయన చేసిన ఒకే ఎన్‌కౌంటర్‌ను రెండుసార్లు చూపించి, రెండుసార్లు యాగ్జిలరీ ప్రమోషన్లు తీసుకున్నారని ఆరోపిస్తూ 1989 బ్యాచ్‌కు చెందిన సీఐలు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీలను కలిసి ఫిర్యాదు చేశారు. తాము కూడా పదోన్నతికి అర్హులమేనని విన్నవించారు. అరుుతే, తన యాగ్జిలరీ పదోన్నతిపై ఫిర్యాదు చేశారన్న ఆక్రోశంతో 1991 బ్యాచ్ డీఎస్పీ 1989 బ్యాచ్‌పై కక్ష కట్టారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్నతాధికారులను బతిమిలాడుకుని పరకాల డీఎస్పీగా వచ్చిన ప్రభాకర్‌ను కేవలం 41 రోజుల్లోనే బదిలీ చేయించడం, ఆ స్థానంలోకి తన బంధువునే తీసుకురావడంలో ఆ డీఎస్పీ కీలకంగా వ్యవహరించి సీనియర్ బ్యాచ్‌కు సవాల్ విసిరారు. దీంతో విభేదాలు మరింత ముదిరాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలంతా ఏకమయ్యారు. ఏసీబీ కేసులుండడంతో పాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను కోరుకున్న చోటుకు బదిలీ చేస్తున్నారని, ఎలాంటి కేసులు లేని వారికి కనీసం పదోన్నతి కూడా రాకుండా అడ్డుకుంటున్నారన్న వివాదానికి తెరలేపారు. ఇక్కడ మొదలైన లొల్లి ఫిర్యాదుల పరంపరకు దారితీసింది. 1989 బ్యాచ్‌లో ఏడుగురు సీఐలు, 1991 బ్యాచ్‌లో ఆరుగురు సీఐలతో పాటు పలువురు పోలీసులు ఉన్నతాధికారులను కలిసి పోలీసు శాఖలో కొందరి అక్రమాస్తులు, యూగ్జిలరీ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. ఆస్తులెంత... ఎక్కడెక్కడ పక్క జిల్లాలో లూప్లైన్లో ఉన్న డీఎస్పీతో పాటు మరో ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలపై ఆధారాలతో ఉన్నతాధికారులకు వివరించారు. గతంలో వారు పనిచేసిన ప్రాంతాల్లో ఏసీబీ కేసులు, మద్యం ముడుపుల వ్యవహారంలో లింకులు, తప్పించుకున్న తీరుపై వివరంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సదరు డీఎస్పీ, సీఐలపై రహస్య విచారణ మొదలుపెట్టారు. వరంగల్, హసన్‌పర్తి, మామునూర్, మడికొండ ప్రాంతాలతో పాటు, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్ ప్రాంతాల్లో కొందరు పోలీసు అధికారులు కొనుగోలు చేసిన ఎకరాల కొద్దీ భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఎల్కతుర్తి శివారులో ఏకంగా నలుగురు పోలీస్ అధికారులు ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసిన విషయం విచారణలో తేలింది. వీరికి బినామీలు సైతం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ప్రధాన నగరాల్లో వ్యాపారులు, ఇళ్లు, ప్లాట్ల స్థలాలపై సైతం దృష్టి పెట్టారు. మద్యం ముడుపులు, ఏసీబీ కేసుల్లో ఉన్న ఈ పోలీసు అధికారులు కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని, కానీ... వారికే మంచి పోస్టింగ్‌లు కల్పిస్తున్నారని కొందరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గతంలో క్రైం మీటింగ్‌లోనే పోలీసుల పనితీరును గుర్తించి అక్కడే పోస్టింగ్‌లు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. డబ్బుల సంచులు పట్టుకుని రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’ అని ఓ సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉన్నతాధికారులే పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. మాలాంటి వాళ్లకు పోస్టింగ్ రావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సవాల్. పరిస్థితులకనుగుణంగా మేం కూడా దిగజారాల్సి వస్తోంది..’ అంటూ మరో సీఐ చెప్పారు. 1999 నుంచి 2007 వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన సీఐలు, ఎస్సైలు ప్రధాన స్టేషన్లలో పాగా వేశారు. కానీ, ఇప్పుడు వారి మధ్య అంతర్గత పోరుతో వర్గాలుగా వీడిపోయి చివరకు అక్రమ ఆస్తుల బండారాలను బయటపెట్టుకున్నారు. పోలీస్ శాఖలో ఇప్పుడిదే హాట్ టాపిక్.