breaking news
basar iiit
-
బాసర ట్రిపుల్ ఐటీ: స్పందించిన కేటీఆర్.. ఆపై చర్చలు విఫలం..
బాసర ట్రిపుల్ ఐటీలో(రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం)లో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. ట్రిపుల్లో తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని విద్యార్ధులు.. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా, బుధవారం విద్యార్థులుతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారుల ముందు విద్యార్థులు 12 డిమాండ్లను ఉంచారు. కాగా, విద్యార్థులు డిమాండ్లకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమైనట్టు సమాచారం. దీంతో, విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంతకుముందు విద్యార్థులు.. మెస్‌లో భోజనం సరిగా లేదని, కరెంట్ ఉండటం లేదని, వాటర్ సమస్య వెంటాడుతోంది ఆరోపించారు. అలాగే, విద్యార్థులకు కనీసం ల్యాప్ టాప్స్ కూడా ఇవ్వడంలేదని ఆదేవన వ్యక్తం చేశారు. ఇక, రెండు సంవత్సరాల నుండి బాసర ట్రిపుల్ ఐటీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. వారికి కూడా లోపలికి అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చుని నిరసనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ విద్యార్థులకు పెట్టే భోజనంలో బొద్దింకలు, బల్లులు రావడంతో వారు ఆందోళన చేపట్టారు. మరోవైపు.. విద్యార్థుల ఆందోళనలపై ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ స్పందించారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలను తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యా నాణ్యతను పెంచేందుకు, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందకండి అంటూ ట్విట్టర్ వేదికగా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. ఈ విషయంపై బుధవారం.. వైస్ ఛాన్స్లర్(వీసీ)తో సమావేశం కానున్నట్టు తెలిపారు. Will take all the issues mentioned to the notice of Hon’ble CM KCR Garu & Education Minister @SabithaindraTRS Garu Kindly be assured that we are committed to resolving any challenges with respect to improving quality of education https://t.co/jNLkemAkMU — KTR (@KTRTRS) June 15, 2022 ఇది కూడా చదవండి: చదువు చెప్పే గురువులేరి? -
చదువు చెప్పే గురువులేరి?
నిర్మల్/బాసర: ‘మాకు పురుగులతో కూడిన అన్నం పెట్టినా తింటాం..కానీ..చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేకపోతే ఎలా? ఓ వైపు విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం.. అదే లెక్కన అధ్యాపకుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? మా వర్సిటీకి రెగ్యులర్ వీసీ.. అది కూడా క్యాంపస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదా? ప్రఖ్యాత క్యాంపస్‌లతో వర్సిటీని ఎప్పుడు అనుసంధానిస్తారు? ఇలాంటివి.. ఎన్నో సమస్యలున్నాయ్. వీటిపై మంత్రులు, ఇన్చార్జి వీసీ, కలెక్టర్లతో సహా అధికార, ప్రతిపక్ష నేతలందరినీ కలిశాం. ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొమ్మిది వేల మంది వరకు ఉండే వర్సిటీ ఎవరికీ పట్టడం లేదు. అందుకే ఆందోళన చేపట్టాం..’అని నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెల్లడించారు. మూకుమ్మడి నిరసన మంగళవారం ఉదయం విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనకు దిగారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనం ఎదుట ఎండలో బైఠాయించి, రోజంతా ఆందోళన కొనసాగించారు. తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో వేలమంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రాంగణమంతా వారి నినాదాలతో మార్మోగింది. అయితే విద్యార్థులను బయటకు రాకుండా.. వారి గోడును బయట ఉన్న తల్లి దండ్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియాకు వినిపించనివ్వకుండా పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవోకు తమ గోడును, డిమాండ్లను తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్‌కుమార్ మద్దతు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారనే విషయం తెలియగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్లో స్పందించారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలుస్తామన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఎస్పీ నాయకులు వర్సిటీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. నేడూ కొనసాగనున్న ఆందోళన! గత కొన్నేళ్లుగా వర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, అవినీతి అక్రమాలూ.. ఏవీ బయటకు తెలియడం లేదు. వర్సిటీ ఇన్చార్జి వీసీగా రాహుల్ బొజ్జా ఉన్నా.. ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారి అది కూడా సగం పూట మాత్రమే వర్సిటీకి వచ్చి వెళ్లారని విద్యార్థులు తెలిపారు. రాత్రి ఏడున్నర సమయంలో ఆందోళన విరమించిన విద్యార్థులు బుధవారం నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. గోడదూకి వెళ్లిన బల్మూరి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పోలీసుల కళ్లుగప్పి క్యాంపస్‌లోకి వెళ్లారు. వర్సిటీ వరకు సాధారణ యువకుడిలా బైక్‌పై వచ్చి, రెండోగేట్ వద్ద గోడ ఎక్కి లోపలికి దూకారు. విద్యార్థుల వద్దకు వెంకట్ చేరుకున్న విషయం తెలియగానే పోలీసులు వెళ్లి అరెస్టు చేసి, ముధోల్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల డిమాండ్లివే.. ళీ సీఎం కేసీఆర్ వర్సిటీని సందర్శించాలి. ళీ రెగ్యులర్ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. ళీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. ళీ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి. ళీ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి. ళీ తరగతి, హాస్టల్ గదులకు మరమ్మతులు చేయాలి. ళీ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. ళీ మెస్‌ల మెయింటెనెన్స్ మెరుగ్గా ఉండేలా చూడాలి. ళీ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి. -
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళన
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బాసరలో ట్రిపుల్ ఐటీ ఆవరణలో విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థతకు గురైన ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పరిస్థితిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారికి స్థానిక నేతలు మద్దతు తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఆదివారం కలుషిత ఆహారం తిని 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ట్రిఫుల్ ఐటీ విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. తాగునీరు, వాతావరణ మార్పుల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండి ఉంటారని విద్యాసంస్థ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయాత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.