గులాంనబీ ఆజాద్‌కు మాతృవియోగం
న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి బసా బేగం (93)మృతి చెందారు. జమ్ము కశ్మీర్‌లోని గుజ్జర్ నగర్లో ఆమె శుక్రవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారు. బసా బేగం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. బసా బేగం అంత్యక్రియలు నేడు గుజ్జర్ నగర్లో నిర్వహించనున్నారు. కాగా పలువురు నేతలు ఈ సందర్భంగా గులాం నబీ ఆజాద్‌కు సంతాపం తెలిపారు.