breaking news
banspwada
-
స్టీల్, సిమెంట్ ధరలు పైపైకి
బాన్సువాడ రూరల్ : సిమెంట్, స్టీల్, ఇటుకల ధరలు రోజురోజుకీ పెరుగుతుండటంతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ అప్పుచేసి సొంతిల్లు నిర్మించుకుందామనుకున్న సామాన్యుడి కల నెరవేరటం లేదు. అకాశాన్ని అంటుతున్న బిల్డింగ్ మెటీరియల్ ధరలతో సగంలోనే నిర్మాణాలు ఆగిపోతున్నాయి. బాన్సువాడలో నెలరోజుల క్రితం వరకు రూ. 200 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 300కు చేరింది. సాధారణ ఇటుక ధరసైతం మొన్నటి వరకు వెయ్యికి రూ. 2,500 ఉండగా ప్రస్తుతం రూ. 3,000లకు చేరింది. స్టీలు క్వింటాలుకు రూ. 4,500 పలుకుతోంది. పెరిగిన ధరలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా సిమెంట్, ఇటుక, స్టీలు ధరలు పెరుగుతుండటంతో ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టిన వారుకూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకు ధరలు పెరుగిపోతూ ఉండటంతో పలువురు నిర్మాణాలను నిలిపివేస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలోనే గృహ నిర్మాణాలు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో నిర్మాణాలు ప్రారంభించినవారు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. నిర్మాణాలకు చేయాల్సిన ఖర్చు అంచనాలకు రెట్టింపు అవుతోందని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టీల్, సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో సాధారణంగా గ్రామాల్లో పెంకుటిళ్లను మాత్రమే నిర్మించుకునేవారు. ఆర్సీసీ బిల్డింగ్‌ల నిర్మాణాలు అరుదుగా జరిగేవి. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో భాగంగా పెంకుటిళ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్సీసీ భవనాల నిర్మాణాలు పెరిగాయి. స్టీల్, సిమెంట్ ధరలు పెరగడంతో ఇందిరమ్మ గృహ నిర్మాణాలు కూడా మందగించాయి. ప్రభుత్వం స్పందించాలి.. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే సామాన్యుడికి సొంతింటి కల నెరవేరని పరిస్థితులు నెలకొంటాయి. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ సీఏం కేసీఆర్ వెంటనే కొత్తవారితోపాటు ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారికి సైతం గృహ నిర్మాణానికి రూ. 3 లక్షలు మంజూరు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. -
అంతా ఆన్లైన్లోనే..
బాన్సువాడ, న్యూస్‌లైన్ : ఒకవైపు ఎన్నికల సంఘం పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తోంది. అనుక్షణం అభ్యర్థులపై నిఘా పెడుతోంది. ఏమాత్రం కట్టు తప్పినా కఠినంగా స్పంది స్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నాయకులు ఆచితూచిగా స్పందిస్తున్నారు. పాతపద్ధతులతో పరేషాన్ వద్దంటూ.. కొత్త పద్ధతుల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నా రు. నవతరం ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక మా ద్యమాన్ని ఎంచుకొని ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, పోలీసులతో నిఘా పెంచడం అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు తలనొప్పిగా తయారయ్యింది. ప్రచార నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో కొంతమంది అభ్యర్థులు ప్రచారంలో కొత్త పద్ధతులను ఎంచుకున్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఇంటర్నెట్, ఫేస్బుక్, సెల్ఫోన్ల ద్వారా ఓట్లభ్యర్థిస్తున్నారు. యువ ఓటర్లు భారీగా ఉండడం, వారు ఫోన్, ఇంటర్నెట్ వినియోగిస్తుండడంతో అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను ప్రచారానికి ఎంచుకుంటున్నారు. గెలిపిస్తే తామేం చేస్తామో ఫెస్బుక్ పేజీల్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రచార ఫోటోలను ఎప్పటికప్పుడు అపడేట్ చేస్తున్నారు. మరోవైపు అత్యాధునిక త్రీడీ వాహనాల ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఫేస్బు క్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ల ద్వారా ప్రచారం చేయడం లో టీడీపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్మోహన్రా వు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే ఆయన తన ప్రత్యేకమైన మెనిఫెస్టోను తయారు చేసి ఫోన్లలో వైస్ రికార్డింగ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌రెడ్డి తరపున సురేశ్‌రెడ్డి యువసేన, కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ తరపున షబ్బీర్ అలీ యువసేన, టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున గంప గోవర్ధన్ యువసేన ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఎస్ఎంఎస్ల ద్వారా బీజేపీ తమ లక్ష్యాలను వివరిస్తోంది. ఆన్లైన్లోనే అన్నీ.. ఓట్ల కోసం డబ్బులు, మద్యం, క్రికెట్ కిట్లు, సెల్ఫోన్లు, చీరలు ఎరవేయడం అందరికీ తెలిసిందే. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొంటూ ఆన్లైన్ ద్వారా పంపకాలు చేసేందు కు కొందరు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. యువకులు, కళాశాల విద్యార్థుల బ్యాంకు ఖా తాల వివరాలను సైతం సేకరిస్తున్నారని సమాచారం.