breaking news
bangledesh
-
మహిళా టీవీ జర్నలిస్ట్ దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య కలకలం రేపింది. పాబ్నా నగరంలో తన ఇంటి వద్ద తెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. స్థానిక మీడియా అందించిన సమాచారం ప్రకారం మోటార్ సైకిళ్లపై దాదాపు 10-12 మంది సాయుధులు రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చారు. అనంతరం కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే ముందస్తు పథకం ప్రకారం పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇబ్నె మిజాన్ తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదనీ, విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు పాబ్నాలోని పాత్రికేయులు ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. హంతకులకు కఠినమైన శిక్ష విధించాలని పిలుపునిచ్చారు. కాగా సుబర్ణ నోది ఆనంద టీవీ ఛానల్లో న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. డైలీ జాగృతో బంగ్లా పత్రికకు జర్నలిస్టుగా కూడా సేవలందించారు. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి జీవిస్తున్న ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు తెలుస్తోంది. -
న్యూజిలాండ్ గెలిస్తేనే..!
కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో బోణీ కొట్టని న్యూజిలాండ్ గెలుపు కోసం ఆరాటపడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ కు విజయం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఓటమి ఎదురైంది. దాంతో గ్రూప్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న న్యూజిలాండ్ విజయంపై కన్నేసింది. శుక్రవారం బంగ్లాదేశ్ త్ జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ కానిపక్షంలో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టక తప్పదు ఇప్పటికే గ్రూప్-ఎలో ఇంగ్లండ్ సెమీస్ కు చేరగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు వర్షార్పణం కావడంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభించాయి. ఇక న్యూజిలాండ్ కేవలం ఒక పాయింట్ తో మాత్రమే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే మూడు పాయింట్లు వస్తాయి. అదే సమయంలో రేపు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవాలి. అప్పుడే న్యూజిలాండ్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీ, రాస్ టేలర్, బ్రూమ్, నీషమ్, కోరీ అండర్సన్, సాంత్నార్, మిల్నే, సౌథీ, ట్రెంట్ బౌల్ట్ బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రఫ్ మోర్తాజ(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, తస్కిన్ అహ్మద్, ముష్పికర్ రహీమ్, షకిబుల్ హసన్, షబ్బిర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్