బనగానపల్లిలో టీడీపీ నేత హత్య
బనగానపల్లి: పాతకక్షల నేపధ్యంలో ఓ టీడీపీ నాయకుడు హత్యకు గురైన సంఘటన కర్నూల్ జిల్లా బనగానపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో మంగళవారం ఉదయం జరిగింది. రామకృష్ణాపురానికి చెందిన నగేష్ (37) టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం రామకృష్ణ పిల్లలను స్కూల్ దగ్గరకు దించి వస్తుండగా గుర్తు తెలియన వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. రామకృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామ కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. రామకృష్ణ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.