breaking news
balintha
-
సాక్షి ఎఫెక్ట్.. బాలింతకు జడ్జి ఆసరా!
కర్ణాటక: కులాచారం ప్రకారం బాలింత శిశువుతో కలిసి ఊరిబయట కొబ్బరి మట్టల గుడిసెలో ఉండడం, గాలివానకు శిశువు అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చనిపోయిన సంఘటనపై జిల్లా సివిల్ న్యాయమూర్తి, న్యాయసేవల ప్రాధికార కార్యదర్శి నూరున్నీసా స్పందించారు. శిశువు మృతిపై గురువారం సాక్షి పత్రికలో ‘‘ఆరుబయట.. గాలీవానలో తల్లీబిడ్డ’’ శీర్షిక పేరిట వార్తాకథనం ప్రచురితం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న ఆమె జిల్లాలోని బెళ్లావి దగ్గరున్న మల్లేనహళ్లి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జడ్జితో పాటు పలు శాఖల అధికారులు వచ్చారు. బాలింత వసంతను వెంటనే గుడిసె నుంచి ఇంటికి తరలించారు. బిడ్డలు చనిపోయిన బాలింతను గ్రామంలోకి తీసురాకూడదని గ్రామస్తులు అభ్యంతరం చెప్పగా వారిమీద జడ్జి మండిపడ్డారు. ఊరిబయట ఎలా ఉంచుతారు? ఒంటరిగా బాలింతను చంటిబిడ్డను ఊరి బయట ఉంచుతారా? అని గ్రామస్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసంత, ఆమె కుటుంబసభ్యులతో జడ్జి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మూడురోజులుగా గుడిసెలో ఎలా ఉంచారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కవలలు పుట్టినా పురిట్లోనే ఒకరు, గుడిసెలో మరొకరు చనిపోయారని తెలిసి అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బాలింతకు వైద్య పరీక్షలు చేయించి బలహీనంగా ఉండడంతో చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
‘నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్న పరిటాల సునీత’
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. కోనేటి నాయుని పాళ్యంలో అంజి అనే వ్యక్తి బాలింతపై అత్యాచార యత్నం చేసి, ఆమె ప్రతిఘటించడంతో ఆమెను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతని తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు అంజి వెంకటాపురంలోని పరిటాల సునీత ఇంట్లో తలదాచుకున్నాడని, విషయం తెలిసీ పోలీసులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. -
నిర్లక్ష్యానికి బాలింత బలి
చింతూరు ప్రభుత్వాస్పత్రిలో సంఘటన టేకులూరు (వీఆర్‌పురం) : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరమంటూ ఓ వైపు సర్కారు ప్రచారం చేస్తుంటే, అదే ఆస్పత్రిలో పురుడు పోయించుకున్న మహిళ.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలైపోయింది. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి భర్త చాందల బుచ్చిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీఆర్‌పురం మండలం కుందులూరు పంచాయతీ టేకులూరు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి, అదే గ్రామానికి చెందిన నాగమణి(28)కు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లయిన ఇన్నాళ్లకు ఆమె గర్భం దాల్చడంతో, ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెకు ఆదివారం ఉదయం 5.30కు పురిటినొప్పులు వస్తుండడంతో, ఆమె భర్త 108కు సమాచారం అందించాడు. గ్రామానికి మధ్యలో రహదారి నిర్మిస్తుండడంతో, అంబులె¯Œæ్స గ్రామానికి 4 కి.మీ. దూరంలో ఉన్న కుందులూరు వద్ద నిలిచిపోయింది. అతికష్టంపై బంధువులు ఆమెను ఆటోలో అంబులె¯Œæ్స వరకూ తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 7.30 సమయంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అరగంట తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో, ఆందోళన చెందిన ఆమె భర్త ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందితో చెప్పాడు. ఏమీ కాదని, తర్వాత తగ్గిపోతుందని చెప్పి.. సాయంత్రం 4 వరకూ ఆమెను అక్కడే ఉంచేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందంటూ, ఆమెను మెరుగైన చికిత్సకు 108లో భద్రాచలం ఆస్పత్రికి పంపేశారు. అక్కడి ఆస్పత్రికి వెళ్లిన కొద్ది సమయానికే ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని సోమవారం స్వగ్రామమైన టేకులూరుకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తల్లి పాల కోసం ఆ పసిపాప గుక్కపెట్టి ఏడవడం చూపరులను కంటతడి పెట్టించింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. నా భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయింది. ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతోందని, చూడమని నర్సును అడిగితే, పదేపదే నావెంట తిరుగుతావేంటి? రక్తస్రావం దానికదే తగ్గిపోతుందని చెప్పి పంపేసింది. మందులు ఆస్పత్రిలో లేకపోతే, బయటకు వెళ్లి కొనుక్కొస్తానని చెప్పినా ఆమె నా మాటలను పట్టించుకోలేదు. – చాందల బుచ్చిరెడ్డి, మృతురాలి భర్త విచారణ చేపడతాం రక్తస్రావంతో బాలింత మరణించిన విషయమై విచారణ చేపడతాం. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – పవన్‌కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ