breaking news
balijapeta
-
తుప్పల్లో, చెరువుల్లో బ్యాలెట్ పేపర్లు
బలిజిపేట (విజయనగరం): విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని నారన్నాయుడువలసలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. కౌంటింగ్ సమయంలో అధికారులు డ్రామా నడిపించి శనివారం రాత్రి 11 గంటలకు టీడీపీ మద్దతు అభ్యర్థి తోముచిట్టి వెంకటరమణ 15 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించారు. నారన్నాయుడువలస పంచాయతీలో ఉన్న 10 వార్డులకు ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పాఠశాల భవనాలున్నాయి. వాటిలో ఒకవైపు ఒక రూములో 3 వార్డులు, వంటగదిలో ఒక వార్డుకు, మరొకవైపు ఉండే భవనాలలో రెండు రూముల్లో 6 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ అయిన తరువాత అన్ని పోలింగ్ బాక్సులను ఒకచోట చేర్చి కౌంటింగ్ ప్రారంభించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా 4 వార్డుల పోలింగ్ బాక్సులను అక్కడే ఉంచి 5, 6, 7, 8, 9, 10 వార్డులకు చెందిన కౌంటింగ్‌ను వేరే భవనాలలో నిర్వహించారు. ఈ సమయంలో మొదటి 4 వార్డులకు చెందిన బాక్సుల వద్ద టీడీపీ మద్దతుదారులు ఓట్లు మార్పులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు తార్కాణంగా ఆదివారం ఉదయం పోలింగ్‌స్టేషన్‌కు వెనుకభాగంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు గుర్తులపై ముద్రలతో ఉండే బ్యాలెట్ పేపర్లు, బాక్సుల పై భాగంలో ఉండే సీళ్ల తొలగింపులు చేసిన ఆధారాలు కనిపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ సమీపంలో ఉండే చెరువులో బ్యాలెట్ పేపర్లు, రశీదులు దొరికాయి. ఆబోతుల ప్రసాదు అనే ఓటరు ఒక పర్యాయం ఓటువేసినా అతడి సంతకంతో వేరొక రశీదు రావడాన్ని చూపించారు. ఇదే విషయాన్ని ఆర్వో చంద్రశేఖర్ వద్ద ప్రస్తావించగా అన్ని బాక్సులు దగ్గర ఉంచి కౌంటింగ్ చేశామని, కౌంటింగ్ ఏజెంట్లకు అన్నీ తెలియజేశామన్నారు. బ్యాలెట్ పేపర్ల విషయం తెలియదని చెప్పారు. -
వాళ్లు చనిపోయారు..కానీ పింఛన్లు మాత్రం వస్తున్నాయి
ఎవరూ మనల్ని పట్టించుకోవడం లేదనుకున్నారో ఏమో... ఏం చేసినా ఎవరూ గుర్తించరు అనుకున్నారో ఏమో... చనిపోయినవారి పేరుమీద వచ్చిన పింఛన్లు కాజేసినా ఎవరికీ తెలియదనుకున్నారో ఏమో... ఓ ఇద్దరు ఉద్యోగులు అక్రమానికి తెరతీశారు. అథంటికేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఆరు నెలలుగా చనిపోయినవారి పేరున పింఛన్లు తీసేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగు చూడటంతో ఇప్పుడు వారిపై చర్యలకు రంగం సిద్ధమైంది. సాక్షి, బలిజిపేట(విజయనగరం) : బడుగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను ఓ ఇద్దరు ఉద్యోగులు పక్కదారి పట్టించేశారు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించకుండా... ప్రతి నెలా వారి పేరు న తీసేసుకుంటున్నారు. ఆరు నెలలుగా ఈ అక్రమం సాగుతోంది. బలిజిపేట మండలం గలావల్లిలో వెలుగు చూసిన సంఘటన ఇది. గలావల్లి పంచాయతీ పరిధిలోని కడగల రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102371602), చందక సంగయ్య(పెన్షన్ ఐడీ 102394294), మజ్జి రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102137032), రాగోలు రామయ్య(పెన్షన్ ఐడీ 102796572), గేదెలపేటకు చెందిన కొంచాడ సుందరమ్మ(పెన్షన్ ఐడీ 102404322), చందక రాముడమ్మ(పెన్షన్ ఐడీ 102820571) 6 నెలల క్రితమే మృతి చెందారు. వారిపేర్లు జాబితా నుంచి తొలగించకపోవడంతో పింఛన్లు మంజూరవుతున్నాయి. ఆ మొత్తాలను ఇద్దరు ఉద్యోగులు దర్జాగా స్వాహా చేసేస్తున్నారు. జూన్‌నెల పింఛన్ల పంపిణీ సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. రాగోలు రామయ్య డిసెంబర్లో పింఛ న్ తీసుకుని మృతి చెందినా ఆ పేరు తొలగించకపోవడంతో అతని పేరున పింఛన్ వచ్చేస్తోంది. అతని భార్య సుందరమ్మకు వితంతు పింఛన్ ఫిబ్రవరి నుంచి ఇస్తున్నారు. ఈ 6 నెలల వ్యవధిలో వ చ్చిన మొత్తాలు గ్రామ కార్యదర్శి మోహన్, రెండు నెలలుగా ఎంపీడీఓ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టైపిస్టే సూత్రధారి గలావల్లిలో మే, జూన్ నెలలకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయ టైపిస్ట్ నారాయణరావు పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా లబ్ధిదారులనుంఇచ 10నుంచి 20రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పింఛన్ల ఫైలును తనవద్దే ఉంచుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పింఛన్లు ఆన్లైన్ చేసేటపుడు చేతివాటం చూపుతున్నారని కూడా కొందరు చెబుతున్నారు. గతంలోనూ పెద్దింపేటలో 6, పలగరలో ఒకటి, అంపావల్లిలో 2, వంతరాంలో 2, అరసాడలో ఒకటి ఆథంటికేషన్ పద్ధతిలో కార్యదర్శులు విత్‌డ్రా చేసిన విషయం విదితమే. ఈ విషయం సోషల్ ఆడిట్‌ద్వారా బయటపడింది. అథంటికేషన్ పేరుతో అక్రమాలు రెండేళ్లుగా బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. లబ్ధిదారులు వేలిముద్రలు వేసి వారి పింఛన్ తీసుకోవాల్సి ఉంటుంది. మంచంమీద ఉండేవారు, ఇతరత్రా రాలేనివారి వద్దకు వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకుని వారికి పింఛన్ పంపిణీ చేస్తారు. వేలిముద్రలు పడక, ఐరిస్ అవక పింఛన్ పొందలేనివారికి పింఛన్లు పంపిణీ చేసేవారే అథంటికేషన్ వేసి మొత్తాలు అందజేస్తారు. ఈ విధంగా చేసేందుకు వారికి గ్రామపింఛన్ లబ్ధిదారుల మొత్తంలో 2శాతం వరకే అవకాశం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. మరణ ధ్రువీకరణ నమోదు కాకే... మరణ ధ్రువీకరణ పత్రాలు గ్రామ కార్యదర్శులే ఇస్తారు. మృతుడు ఎప్పుడు మృతిచెందాడో వారికి తెలుస్తుంది. వారికి సంబంధించిన సమాచారాన్ని 21రోజుల్లోగా కార్యదర్శి ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చనిపోయిన వారి పేరున మొత్తాలు మంజూరయ్యే అవకాశం ఉండదు. అయితే కావాలనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేయకుండా తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. దీనిపై ఈఓపీఆర్డీ దేవకుమార్వద్ద సాక్షి ప్రస్తావించగా టైపిస్ట్ ఎక్కడ పింఛన్లు పంపిణీ చేసినా మృత్యువాత పడినవారి పేరున వచ్చే వాటికి ఆథంటికేషన్ వేసి విత్‌డ్రా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తాము గుర్తించినట్టు తెలిపారు. అంతేగాకుండా పింఛన్లు పెట్టేందుకు కార్యాలయానికి వచ్చేవారి నుంచి వెయ్యి నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారనీ, పింఛన్లు పంపిణీ చేసే సమయంలోనూ లబ్ధిదారులనుంచి 10 నుంచి 20రూపాయలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎంపీడీఓకు తెలియజేసినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. ఇప్పుడు గలావల్లిలో అక్రమాలకు పాల్పడినట్టు బట్టబయిలయిందని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. -
సమస్యల వలయంలో సర్కార్ బడులు
బలిజిపేట రూరల్: ఈనెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్న సర్కారు పాఠశాలలో సమస్యలు విలయతాండవాలు చేస్తున్నాయి. పాఠశాల ఆవరణలు మురికి కూపాల్లా కనిపిస్తున్నాయి. పాఠశాలల వద్ద ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు మరమ్మత్తులకు గురయి కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల వద్ద శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఉండడంతో ఏసమయంలో ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని విద్యార్థులు, తల్లిదండ్రులు భయకంపితులు అవుతున్నారు. పాఠశాలల విద్యార్థులకు రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించేందుకు వెంగాపురం ఎలిమెంటరీ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన వాటర్‌ట్యాంకు పైపులైన్లు విరిగి, ట్యాంకు మూలకుచేరి ఉంది. నారాయణపురం ఉన్నత పాఠశాల ఆవరణ మురికి కూపంలా కనిపిస్తున్నాది. అక్కడ మరుగుదొడ్లను వెళ్ళాలంటే నరకమే. బలిజిపేట ఉన్నత పాఠశాల ఆవరణలో శిథిలావస్థ భవనం ఉండడంతో పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని భీతిల్లుతున్నారు. కొన్ని పాఠశాలలకు ప్రహారీలు లేకపోవడంతో అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి.