breaking news
Bakewell Bakery
-
‘ఫీవర్’లో మరో ఐదు ఫుడ్‌పాయిజన్ కేసులు
నల్లకుంట,న్యూస్‌లైన్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి మరో ఐదు ఫుడ్ పాయిజన్ కేసులు నమోదయ్యాయి. చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబానగర్‌లోని బేక్వెల్ బేకరీలో మార్చి 29న పాడైపోయిన పిజ్జా, బర్గర్లు తిని పలువురు అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా, బాధితుల్లో పది మంది మంగళవారం రాత్రి చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. ఇదిలా ఉండగా మరో ఐదుగురు బాధితులు బుధవారం రాత్రి ఫీవర్ ఆసుపత్రిలో చేరారు. వీరిలో కంచన్‌బాగ్‌కు చెందిన ఫిరదౌసి బేగం(9), ఖలీ దాబిన్ యూసఫ్(22), అబ్దుల్ సమి(32), హసీనాబేగం(36)తో పాటు మౌలాలికి చెందిన ఆబేద్(23) ఉన్నారు. చికిత్స అనంతరం ఈ ఐదుగురిలో ఫిరదౌసిబేగం, యూసఫ్, హసీనాబేగం, ఆబేద్లను గురువారం ఉదయం డిశ్చార్జి చేసినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా, బాధితుల్లో ప్రస్తుతం 11 మంది తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, అందరూ కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని పీవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బేకరీ యజమానుల అరెస్ట్ సంతోష్‌నగర్: కలుషిత ఆహారం వల్ల దాదాపు 20 మంది అస్వస్థతకు గురికావడానికి కారణమైన హఫీజ్‌బాబానగర్‌లోని బేక్వెల్ బేకరీ యజమానులను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. బేక్వెల్ బేకర్స్‌లో పాడైపోయిన ఫిజ్జాలు, బర్గర్లు తిని వినియోగదారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బాధితుల్లో చాలా మంది ఇప్పటికీ చాంద్రాయణగుట్టలోని బాకోబన్ ఆసుపత్రి, బార్కాస్ ఆసుపత్రి, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. హఫీజ్‌బాబానగర్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ అలీముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేకరీ యజమానులైన సోదరులు మహ్మద్ అబ్దుల్ గఫార్(32), మహ్మద్ నిస్సార్(36)లను గురువారం అరెస్ట్ చేసి రిమాం డ్కు తరలించినట్టు ఇన్స్పెక్టర్ రమేష్ కొత్వాల్ తెలిపారు. -
కలుషిత ఆహారంతో యువతి మృతి?
మరో 23 మందికి అస్వస్థత వీరిలో ఇద్దరి పరిస్థితి విషమం బేక్వెల్ బేకరీని సీజ్ చేసిన ఏఎంహెచ్ఓ పోలీసుల అదుపులో దుకాణం యజమాని సంతోష్‌నగర్/నల్లకుంట, న్యూస్‌లైన్: ఓ బేకరీలో పాడైపోయిన బర్గర్లు తిన్న ఘటనలో యువతి మృతి చెందగా... మరో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాతబస్తీ హఫీజ్‌బాబా నగర్లో మూడు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన బుధవారం ఓ బాధితుడు ఫిర్యాదు ఇవ్వడంతో వెలుగులోకి వచ్చింది. కంచన్‌బాగ్ పోలీసుల కథనం ప్రకారం.. హఫీజ్ బాబానగర్‌లోని ఉమర్ హోటల్ పక్కన ఉన్న బేక్వెల్ బేకర్స్ దుకాణంలో మూడు రోజుల క్రితం సుమారు 50 మంది బర్గర్లు కొనుగోలు చేసి తిన్నారు. వీరిలో 24 మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంధువులు వీరిని వెంటనే చికిత్స కోసం సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో యాకుత్‌పురాకు చెందిన ఖతీజాబేగం(20) ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. ఆమె కలుషిత ఆహారం వల్ల మృతి చెందిందా లేక ఇతర కారణాల వల్లా అన్నది తెలియ రాలేదు. ఆమె మృతిపై కుటుంబసభ్యులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాగా బాధితుల్లో బార్కాస్‌కు చెందిన కరీమున్నిసా(32), చాంద్రాయణగుట్ట హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన మహ్మద్ హమీద్(18), అజీజ్ (36), మహ్మద్ ఇబ్రహీం (18) మహ్మద్ అలీముద్దీన్ (18), గౌసియా బేగం (18), రోషన్బేగం (21), మొహియుద్దీన్ గౌసియా బేగం(20), మహ్మద్ ఇస్మాయిల్ (18) నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వీరిలో గౌసియా బేగం(21), మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బార్కాస్ ఆసుపత్రిలో 8మంది, ఒవైసీ ఆసుపత్రిలో మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. బేకరీని సీజ్ చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది దక్షిణ మండలం సర్కిల్-4 ఏఎంహెచ్‌వో వెంకటరమణ, ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డిల బృందం బేక్వెల్ బేకర్స్ తినుబండారాలను పరిశీలించి స్వాధీనం చేసుకొన్నారు. దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ దక్షిణ మండలం సర్కిల్-4 ఏఎంహెచ్‌వో వెంకటరమణతో పాటు బార్కాస్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బేకర్స్ యజమానిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. బేకరీ వద్ద ఉద్రిక్తత హఫీజ్‌బాబానగర్‌లోని బేకర్స్ బేకరీలో పిజ్జాలు తిన్న వినియోగదారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఒకరు మృతి చెందారన్న వార్త దాహనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున బేకరి వద్దకు చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బేకరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి కాగా ఈ బేకరీలో బర్గర్లు, పిజ్జాలు తిని తామంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యామని అరుంధతి కాలనీకి చెందిన నవీన్, మహేష్, మహ్మద్ అలీం, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అరవింద్‌లతో పాటు పలువురు న్యూస్‌లైన్‌కు వెల్లడించారు. బేకరీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అందరికీ మెరుగైన చికిత్సలు అందిస్తున్నాం ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతక గురై ఫీవర్ ఆస్పత్రిలో చేరిన రోగులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె. శంకర్ తెలిపారు. -
బలి తీసుకున్న బర్గర్...
హైదరాబాద్ : బేకరీ పదార్థాల్లో బర్గర్ అంటే.. ఇష్టపడనివారుండరు. కమ్మని బర్గర్తో ఆకలి తీర్చుకోవాలనుకోగా అది ఒకరి ఆయువు తీసింది. హైదరాబాద్ పాతబస్తీ హఫీజ్ బాబానగర్‌లోని బేక్ వెల్ బేకరీలో ఆహారం కలుషితమైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిదిమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బేకరీ బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బలి తీసుకున్న బర్గర్