‘బ్యాక్లాగ్’ దరఖాస్తుల పరిశీలన
మహబూబ్నగర్ న్యూటౌన్: ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల దరఖాస్తుల పరిశీలన గురువారం మూడోరోజు కొనసాగింది. జూనియర్ సహాయకులు, టైపిస్టు పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల మార్కుల జాబితాలను గురువారం ఎన్ఐసీ వీసీ హాలులో కలెక్టరేట్ సిబ్బంది పరిశీలించారు. ధ్రువపత్రాల ఆధారంగా మార్కుల శాతం వివరాలను నమోదు చేశారు. పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని, ఇంకా ఫైనల్ కాలేదని కలెక్టరేట్ ఏఓ నర్సయ్య తెలిపారు.