breaking news
Back to Shoot
-
చల్ చల్ చలో.. షూటింగ్ చేద్దాం చలో.. అంటున్న హీరోలు
కరోనా వ్యాప్తి కారణంగా ఆ మధ్య కొందరు స్టార్ల సినిమా షూట్‌కి బ్రేక్ పడింది. సంక్రాంతి పండగ బ్రేక్ కూడా తోడైంది. ఇప్పుడు బ్రేక్‌లు తీశారు.. మేకప్ వేద్దాం.. షూటింగ్ చేద్దాం.. చలో.. చలో అంటూ స్టార్స్ షూట్లో పాల్గొంటున్నారు. గత నెల చివర్లో చిరంజీవి కరోనా పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉన్నారు. స్వల్ప లక్షణాలతో కరోనా ఆయన్ను ఇబ్బందిపెట్టలేదు. త్వరగానే నెగటివ్ వచ్చేసింది. దాంతో ఒకవైపు మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న ‘గాడ్ ఫాదర్’, మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న ‘బోళా శంకర్’ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు చిరంజీవి. శుక్రవారం ‘గాడ్ ఫాదర్’ షూట్లో ఉన్నారు. హైదరాబాద్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజుల్లో ‘బోళా శంకర్’ కూడా ఆరంభమవుతుందని తెలిసింది. అలాగే ప్రభాస్ కూడా హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్నారు. ‘ఆదిపురుష్’ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’.. ఇవి ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు. ‘ఆదిపురుష్’ పూర్తయింది. ‘సలార్’ కొన్ని షెడ్యూల్స్‌లో పాల్గొన్నారు. ఇటీవల వెకేషన్ నిమిత్తం యూరోప్ వెళ్లొచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇక రవితేజ అయితే ‘రామారావు: ఆన్ డ్యూటీ’, ‘రావణాసుర’, ‘ధమాకా’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలకు తన డైరీలో చోటిచ్చేశారు. ‘ఖిలాడీ’గా ఈ నెల 11న థియేటర్స్‌లోకి రానున్నారు. మిగతా చిత్రాల షూట్‌ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ‘రావణాసుర’ షూట్లో ఉన్నారు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌లోనే షూట్‌తో బిజీగా ఉన్న మరో హీరో రామ్. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ‘ది వారియర్’ చిత్రీకరణ జరుగుతోంది. కొందరు స్టార్స్ హైదరాబాద్‌లో చిత్రీకరణతో బిజీగా ఉంటే నాగచైతన్య కొన్నాళ్లుగా రష్యాలో ఉన్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఈ హీరో నటిస్తోన్న ‘థ్యాంక్యూ’ షూటింగ్ శుక్రవారం వరకూ అక్కడ జరిగింది. ఈ షెడ్యూల్‌తో సినిమా పూర్తయింది. ఇక ముంబైలో ‘లైగర్’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ శుక్రవారం ముంబైలో ఆరంభమైంది. ఈ హీరోలే కాదు... మరికొందరు కూడా జోరుగా షూట్లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే పక్కా.. ఈ నెలలో మరో పదీ ఇరవై రోజుల్లో షూటింగ్లో పాల్గొననున్నారు బాలకృష్ణ, మహేశ్‌బాబు, రామ్‌చరణ్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూట్లో ఈ నెల మూడో వారం నుంచి బాలకృష్ణ పాల్గొంటారని తెలిసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే మహేశ్ పాల్గొనడంలేదు. మరో నాలుగు రోజుల్లో మహేశ్ ఈ షూట్లో అడుగుపెడతారు. శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూట్లో ఈ నెల 10 నుంచి రామ్‌చరణ్ పాల్గొంటారని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. -
బ్యాక్ టు షూట్
సుమంత్ హీరోగా మురళీకృష్ణ దర్శకత్వంలో గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించారు. ‘బ్యాక్ టు షూట్’ అని చిత్రబృందం పేర్కొంది. సుమంత్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తికర కథనంతో, వినోదాత్మక సన్నివేశాలతో సినిమా నడుస్తుందని చిత్రబృందం తెలియజేసింది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించనున్నారు. సుమంత్ సరసన నాయికగా ఐమా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: సిద్ధం మనోహర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మాదాల ఝాన్సీకృష్ణ, రమేష్ మహేంద్రవాడ. -
లోకనాయకుడు తిరిగొస్తున్నారు
-
బ్యాక్ టు షూట్
‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ ఇది ఓ బేతాళ ప్రశ్నలా ఇప్పటివరకూ అందర్నీ వేధిస్తూనే ఉంది. కానీ, దీనికి సమాధానం కేవలం రాజమౌళి అండ్ టీమ్‌కు మాత్రమే తెలుసు. అయినా సరే, ఎవరికి తోచిన కథ వాళ్లు అల్లుకుంటూనే ఉన్నారు. ఓ సందర్భంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను దీని గురించి అడిగితే- ‘‘నాకో రూ.150 కోట్లు ఇవ్వండి. కచ్చితంగా చెబుతాను’’ అని చమత్కరించారు కూడా. ఈ సంగతి పక్కనబెడితే, ఎవరెన్ని స్టోరీలు చెప్పినా అసలు సమాధానం వచ్చే ఏడాది విడుదలయ్యే ‘బాహుబలి -ద కన్‌క్లూజన్’ (బాహుబలి2) చూసి తెలుసుకో వాల్సిందే. మొదటి భాగానికి జాతీయ అవార్డు కూడా రావడంతో రెండోభాగంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకే మలి భాగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు రాజమౌళి. ఏ పనిలోనైనా బ్రేక్ కావాలి. లేకపోతే ఎంత ఇష్టమైన పనైనా సరే అది కష్టంగా ఉంటుంది. అందుకేనేమో ‘బాహుబలి’ టీమ్ మొత్తం సమ్మర్ బ్రేక్ తీసుకున్నారు. అయితే మళ్లీ ఈ సినిమా పనుల్లో నిమగ్నమైనట్లు ‘బాహుబలి’ టీమ్ తన ట్విట్టర్లో పేర్కొంది. క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. త్వరలోనే ఆర్ఎఫ్సీలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించి, అక్టోబరు నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ‘బాహుబలి’ టీమ్ ప్లాన్ చేసుకుంటోంది. ‘బాహుబలి’తో పాటు దాని రెండో భాగాన్ని కూడా వర్చ్యువల్ రియాలిటీ వెర్షన్లో కూడా సిద్ధం చేయాలనుకుంటున్నట్లు ఇటీవల జరిగిన కాన్స్ చిత్రోత్సవాల్లో చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి పని మొదలైంది... సినిమా ఎలా ఉంటుందో... అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.